english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఎత్తబడుట (రాప్చర్) ఎప్పుడు జరుగుతుంది?
అనుదిన మన్నా

ఎత్తబడుట (రాప్చర్) ఎప్పుడు జరుగుతుంది?

Sunday, 29th of September 2024
0 0 296
ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుందో బైబిలు యందు సరిగ్గా చెప్పబడలేదు.
ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూత లైనను, కుమారుడైనను ఎరుగరు. (మార్కు 13:32)

ఎత్తబడుట జరుగుతుందా లేదా అనే చర్చ లేదు; బైబిలు ఆ ప్రశ్నపై స్పష్టంగా ఉంది. ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుందో, ఈ సంఘటన యొక్క ఖచ్చితమైన సమయం ఎవరికీ తెలియదు. యేసు ప్రభువు లూకాలో ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాడు, "మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను" (లూకా 12:40).

మత్తయి 24:6-7లో, ప్రభువు రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి మనం వెదకగల వివిధ సూచనల గురించి ప్రభువైన యేసు చెప్పాడు.

మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవర పడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును. (మత్తయి 24:6-7)

మనం జీవిస్తున్న ఈ కాలంలో ఈ సూచనలు చాలా వరకు జరుగుతున్నాయని మనం చూడవచ్చు, కాబట్టి ప్రభువు రాకడకు ముందు ఇది చాలా కాలం ఉండదని మనం ఆశించవచ్చు.

ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుందో బైబిలు మనకు మరొక ఆసక్తికరమైన మెలకువను ఇస్తుంది.

ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింప వలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. (లేవీయకాండము 23:4)

యెహోవా యొక్క ఏడు పండుగలు క్రింది విధంగా ఉన్నాయి:
  1. పస్కా పండుగ 
  2. పులియని రొట్టెల పండుగ 
  3. ప్రధమ ఫలముల పండుగ 
  4. పెంతేకొస్తు లేదా వారాల పండుగ 
  5. బూరల శబ్దము పండుగ
  6. ప్రాయశ్చిత్త దినము
  7. గుడారాల పండుగ
ఏడు పండుగలలో, మొదటి నాలుగు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డాయి.
  1. పస్కా పండుగలో దేవుని గొర్రెపిల్లగా యేసయ్య బలి
  2. పులియని రొట్టెల పండుగలో యేసయ్య సమాధి
  3. ప్రధమ ఫలాల పండుగలో యేసు పునరుత్థానం
  4. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ రాకడ
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బలి, సమాధి, పునరుత్థానం మరియు పరిశుద్దాత్మ యొక్క రాకడ, ఈ పండుగలు జరుపుకునే ఖచ్చితమైన దినాన జరిగింది.

ఇప్పుడు మూడు పండుగలు ఇంకా నెరవేరవలసి ఉంది. అవి:
  1. బూరల శబ్దము పండుగ
  2. ప్రాయశ్చిత్త దినము
  3. గుడారాల పండుగ
దేవుడు "నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు" (ఆదికాండము 8:1), దేవుడు అతనిని మరచిపోయాడని లేఖనాలు చేపట్లేదు. కాదు, నోవహు విధేయత కారణంగా, దేవుడు అతని తరపున మాట్లాడే సమయం వచ్చిందని లేఖనం చెబుతోంది.

ఆయన నోవహు తరపున మాట్లాడటం ప్రారంభించినప్పుడు, వరద నీరు తగ్గుముఖం పట్టింది. విచిత్రమేమిటంటే, నోవహు ఓడ కప్పు తీసివేసి, నేల ఆరియుండిన రోజు "మొదటి నెలలో, తొలి దినము" (ఆదికాండము 8:13). ఈ ప్రత్యేక దినమును తరువాత జ్ఞాపకార్థ శృంగధ్వని అని అంటారు. జ్ఞాపకార్థ శృంగధ్వనిని రోష్ హషానా అని కూడా అంటారు, ఇది యూదుల పౌర సంవత్సరం ప్రారంభం.

చంద్రుని దశలు
path

రోష్ హషానా అనేది అమావాస్య దినము జరిగే ఏకైక విందు దినము, మరియు హిబ్రూ క్యాలెండర్ చాంద్రమానంగా ఉన్నందున, ఈ విందు మన క్యాలెండర్‌లో ప్రతి సంవత్సరం అదే దినమున జరగదు. రోష్ హషానా 2024 సెప్టెంబర్ 2 october సాయంత్రం ప్రారంభమై సెప్టెంబర్ 4 october, మంగళవారం సాయంత్రం ముగుస్తుంది.

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.." (లేవీయకాండము 23:24)

బూర శబ్దము పండుగ దినాన, షోఫర్ ఊదుతారు. బైబిలు పండితులు చాలాకాలంగా బాకా పండుగను సంఘము యొక్క ఎత్తబడుటతో ముడిపెట్టారు. అపొస్తలుడైన పౌలు రాశాడు,
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మన మందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. (1 కొరింథీయులకు 15:51-52)

ప్రతి సంవత్సరం యూదులు బూర శబ్దము పండుగను జరుపుకుంటారు. బూర శబ్దము పండుగ దగ్గర పడుతున్నప్పుడు భావోద్వేగాలు ఉప్పొంగుతాయి. ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు, అది బూర శబ్దము పండుగ దినాన జరుగుతుంది. సిద్ధంగా ఉండటమే మన పని.

ప్రార్థన
[ప్రతి ప్రార్థన అస్త్రాన్ని మీ హృదయం నుండి వచ్చేంత వరకు పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి.]

1. యేసు నామములో, ఎవరు నశించుట నీ చిత్తము కాదు కాబట్టి తండ్రీ నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను.
2. తండ్రీ, యేసు నామంలో … (వ్యక్తుల పేరు(లు) పేర్కొనండి) నీ గురించి తెలుసుకొనుట యొక్క జ్ఞానం మరియు ప్రత్యక్షత యొక్క ఆత్మను దయచేయి.
3. ప్రభువును పొందుకుండా… (వ్యక్తుల పేరు(లు) పేర్కొనండి) మనస్సును కప్పి ఉంచే శత్రువు యొక్క ప్రతి కోటను యేసు నామంలో తీసివేయబడును గాక. 
4. ప్రభువా, ఓ దేవా (వ్యక్తుల పేరు(ల) గురించి ప్రస్తావించండి) మీద నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేయుము.


Join our WhatsApp Channel


Most Read
● కృప చూపించడానికి క్రియాత్మకమైన మార్గాలు
● ప్రేమ - విజయానికి నాంది - 2
● మీ గురువు (బోధకుడు) ఎవరు - I
● ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 2
● దేవుని ప్రణాళికలో వ్యూహ శక్తి
● రహదారి లేని ప్రయాణము
● కార్యం చేయండి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్