english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మూడు కీలకమైన పరీక్షలు
అనుదిన మన్నా

మూడు కీలకమైన పరీక్షలు

Thursday, 10th of October 2024
0 0 583
Categories : పరీక్ష (Testing) శిష్యత్వం (Discipleship)
పందెపు రంగమందు పరుగెత్తు వారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వానివలె పరుగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను. (1 కొరింథీయులకు 9:24-27)

తూర్పు నుండియైనను పడమటి నుండియైనను అరణ్యము నుండియైనను హెచ్చు కలుగదు. (కీర్తనలు 75:6)

వృత్తి మీరు ఎంచుకునే విషయం; పిలుపు అనేది మీరు దేవుని నుండి పొందుకునే విషయం.

వృత్తి అనేది మీ కోసం మీరు చేసే పని; పిలుపు అనేది మీరు దేవుని కోసం చేసే పని. 

దేవుడు మనలను పిలిచినప్పుడు, మనం బాగా సిద్ధంగా ఉండాలి. దేవుడు అర్హత ఉన్నవారిని పిలవలేదు కాని 'పిలిచినవారికి' అర్హత ఇవ్వడానికి పిలిచాడు. దీని అర్థం ఏమిటి?

అప్పుడు మోషేప్రభువా, "ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటి నుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా".

యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటి వానినేగాని దృష్టిగల వానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను. అందుకతడు, "అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా" (నిర్గమకాండము 4:10-13)

తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి రక్షించడానికి దేవుడు మోషేను పిలిచాడు. కానీ మాట్లాడే నైపుణ్యం లేకపోవడం దేవుని ప్రణాళికను అనుసరించకుండా తను అనర్హుడని మోషే భావించాడు. ఇది దేవుడు తనను ఉపయోగించకుండా ఆపలేదు.

దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ ఒక ఉద్దేశ్యము కోసం పిలిచాడు. ఏదేమైనా, మనము ఆ ఉద్దేశ్యాన్ని మరియు పిలుపును నెరవేర్చడానికి మన జీవితాలను ముందు మనం ప్రస్తుతం చేస్తున్న "చిన్నదిగా అనిపించే' విషయాలపై నమ్మకంగా ఉండాలి.

మీరు కేంద్ర బిందువు గల ఉద్దేశ్యాన్ని పొందడానికి ముందు ప్రతి ఒకరు 'చిన్న విషయాలలో' నమ్మకంగా ఉండాలి. సీయోనులో రాజుగా పరిపాలించడానికి దావీదు అర్హత సాధించడానికి ముందు, అతడు మొదట మూడు స్థలంలో విశ్వాసపాత్రుడయ్యాడు. మీరు కూడా వాటిని జాగ్రత్తగా పరిశీలించండి ఈ మూడు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి:

1. బెత్లెహేములోని ఇంటి వద్ద:
ఇక్కడే దావీదు బాధ్యత వహించాలని నేర్చుకున్నాడు; జీవితాన్ని సంపాదించడానికి మరియు అతని కుటుంబాన్ని పోషించడానికి, దేవునితో తన సంబంధాన్ని పెంపొందించుకోవటానికి మరియు తన జీవితంపై దేవుని కృప కారణంగా ఇతరుల కోపాన్ని జయించడానికి. ఎవరో ఇలా అన్నారు, "ప్రేమ (మంచితనం) అనేది ఇంట్లో నుండే ప్రారంభమవుతుంది." చిన్న వాటిలో నమ్మకంగా ఉండడం ద్వారా గొప్ప పనులను నిర్వహించడానికి మీరు ఇక్కడ అర్హత సాధించారు. ఇక్కడ మీ పాత్ర అభివృద్ధి చేయబడింది మరియు మీ విశ్వసనీయత నిరూపించబడింది.

తన తండ్రి గొర్రెలను మేపడంలో దావీదు నమ్మకంగా ఉన్నాడు. అతడు వారి కోసం సింహం మరియు ఎలుగుబంటితో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ నమ్మకాన్ని చూసి తన ప్రజలపై గొర్రెల కాపరి చేశాడు. తండ్రి వ్యాపారాన్ని చూసుకునే కుమారులు మరియు కుమార్తెల కోసం దేవుడు చూస్తున్నాడు మరియు చుట్టూ తిరుగుతూ ఉండే ఆధ్యాత్మిక చెంచు వాళ్లు కాదు.

2. అదుల్లాము గుహలో:
సమాజంలోని యోగ్యతా మరియు తిరస్కరణల మధ్య జీవించడం ద్వారా, ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా దావీదు తనను తాను ఇతరుల కోరకు అప్పగించు కోవడం, అతని జీవితం దాడిలో ఉన్నప్పుడు కూడా ప్రేమించడం మరియు సేవ చేయడం కూడా నేర్చుకున్నాడు. దావీదు యొక్క 'శక్తివంతులను' తయారు చేసిన ప్రదేశం ఇది. 'అదుల్లాము ' అంటే మన రాజ్యం చనిపోవడం మరియు దేవుని రాజ్యం మన ద్వారా ప్రదర్శించబడటం. మన హృదయాలలో ప్రతి వ్యక్తిగత-కోరిక, వ్యక్తిగత సేవ ఉద్దేశ్యంతో దేవుడు వ్యవహరిస్తాడు. బాధపడాల్సిన విషయం ఏమిటంటే, మనలో కొందరు ఈ గుహలో ఎప్పుడూ ప్రవేశించరు.

3. హెర్మోను పర్వతంపై:
'హెర్మోను' అనే పదానికి నిబంధన అని అర్ధం. హెర్మోను పర్వతం ఇశ్రాయేలులోని ఎత్తైన పర్వతం మరియు పైకి ఎక్కడానికి సులభమైన రహదారి లేదు; ఇక్కడ ప్రతి మార్గం ఎత్తులో ఉంటుంది. మరియు ఇది ప్రతి నిబంధన సంబంధాలతో ఈ విధంగా ఉంటుంది. నిబంధన సంబంధాలకు ఎల్లప్పుడూ పరిస్థితులతో సంబంధం లేకుండా విధేయత, ఖర్చుతో సంబంధం లేకుండా నిజాయితీ మరియు బాధతో సంబంధం లేకుండా క్షమాపణ అవసరం. 

మనము ఈ పద్ధతిలో జీవించడం ప్రారంభించినప్పుడు, లోకము సమాధానాల కోసం సీయోను (సంఘం) వైపు తిరిగి చూస్తుంది ఎందుకంటే దేవుడు మనలో కార్యం చేస్తున్నట్లు వారు చూస్తారు.
ప్రార్థన
తండ్రి, యేసు నామములో, సమస్త వినయంతో, దయాళుత్వముతో, సహనంతో, ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ, శాంతి బంధంలో ఆత్మ యొక్క ఐక్యతను కాపాడుకోవటానికి ఆత్రుతతో నన్ను పిలిచిన పిలుపుకు తగిన రీతిలో నడవడానికి నీ కృపకై నేను నిన్ను వేడుకుంటున్నాను.

Join our WhatsApp Channel


Most Read
● పాపపు కోపం యొక్క పొరలను విప్పడం
● దేవునికి మీ పగను ఇవ్వండి
● మీరు ద్రోహాన్ని అనుభవించారా
● సాతాను మిమ్మల్ని ఎక్కువగా అడ్డుకునే ఒక రంగం
● యూదా జీవితం నుండి పాఠాలు - 2
● 07 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీ పరిస్థితి మలుపు తిరుగుతోంది
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్