అనుదిన మన్నా
నూతన ఆధ్యాత్మిక దుస్తులను ధరించుట
Monday, 18th of November 2024
0
0
59
Categories :
ఆధ్యాత్మిక దుస్తులు (Spiritual Clothes)
మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు. (కొలొస్సయులకు 3:10)
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ త్యాగం ద్వారా మనం దేవుని పిల్లలం అయినప్పటికీ, చాలా తరచుగా, మనము ఎప్పుడు అలా ప్రవర్తించము.
మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనం క్రైస్తవులం కాదా అని తెలుసుకోగల ఏకైక మార్గం మన ప్రవర్తన లేదా మన జీవనశైలి.
యేసు క్రీస్తును మన ప్రభువు మరియు రక్షకునిగా అంగీకరించే కార్యము చాలా వరకు వ్యక్తిగతంగా జరిగింది, కాబట్టి మీరు నిజమైన క్రైస్తవులు అని ప్రకటించడానికి ఏకైక మార్గం ఆత్మ ఫలాలను వ్యక్తపరచడం, ఇది మీరు మరియు నేను ప్రకటించే విశ్వాసానికి కీలకమైన సూచికగా మారుతుంది.
అపొస్తలుడైన పౌలు పాత జీవిత విధానాలను తొలగించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. మీలో దాగి ఉన్న చెడు కోరికలను చంపాలని (చనిపోవాలని, శక్తిని కోల్పోవాలని) అతడు మనకు సూచిస్తున్నాడు, ఎందుకంటే మీరు పాత (పునరుత్పత్తి చేయని) స్వభావాన్ని దాని దుష్ట పద్ధతులతో వేరు చేయబడ్డారు. మరియు నవీన స్వభావమును [ఆధ్యాత్మిక స్వయం] ధరించుకొనియున్నారు. (కొలొస్సయులు 3: 5,9-10)
"వేరు చేయబడటం" మరియు "ధరించుకొనుట" వంటి పదాలు మన వైపు నుండి చాలా ప్రయత్నం అవసరమని సూచిస్తున్నాయి.
మనం ఏమి ధరించుకోవాలో అపొస్తలుడైన పౌలు స్పష్టంగా పేర్కొన్నాడు:
1. మనం జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించాలి. (కొలస్సీయులు 3:12)
2. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మునుక్షమించాడు, కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించాలి. (కొలస్సీయులు 3:13)
మీరు మరియు నేను ఈ లక్షణాలను ధరించినప్పుడు, మీరు మరియు నేను యేసు లాగా మారడానికి మన లక్ష్యానికి దగ్గరవుతాము.
నిజమైన ఆత్మ పరిశోధన చేయడానికి ఇది మిమ్మల్ని సవాలు చేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మేము ఇక్కడ క్రీస్తు రాయబారులుగా ఉన్నాము మరియు కనుక ఆయనను సరిగ్గా సూచించాలి. దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని గడపడానికి పరిశుద్ధాత్మ మనల్ని అనుమతించుగాక, అలా చేయడం ద్వారా, మన మాటల ద్వారా మాత్రమే కాకుండా మన పనుల ద్వారా కూడా ఇతరులను ఆయన వైపు ఆకర్షించూదాం.
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నన్ను బాధపెట్టిన వారిని క్షమించడానికి నాకు నీ కృపను దయచేయి.
తండ్రీ, యేసు నామమున, నీ జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును నాకు ధరించమని నేను నిన్ను వేడుకుంటున్నాను. విశ్వాసం ద్వారా, నేను ఈ కొత్త దుస్తులను పొందుకుంటున్నాను మరియు దాని కోసం నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను.
Join our WhatsApp Channel
Most Read
● ఒక విషయం: క్రీస్తులో నిజమైన ధనమును కనుగొనడం● దెబోరా జీవితం నుండి పాఠాలు
● చెరసాలలో స్తుతి
● దూరం నుండి వెంబడించుట
● మహిమ మరియు శక్తి గల భాష - భాషలు
● ఇటు అటు పరిగెత్తవద్దు
● దేవదూతల సహాయాన్ని ఎలా సక్రియం చేయాలి
కమెంట్లు