అనుదిన మన్నా
03 రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
Sunday, 24th of November 2024
1
1
91
Categories :
ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
నేను చావను
"నేను చావను కాని జీవించెదను మరియు సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను." (కీర్తనలు 118:17)
మన లక్ష్యాలను నెరవేర్చుకొని మంచి వృద్ధాప్యంలో చనిపోవాలని దేవుని చిత్తం. మీ జీవితానికి సంబంధించిన దేవుని చిత్తంలో అకాల మరణం లేదా అనారోగ్యం, బాధ, చెడు మరియు వ్యాధితో నిండి ఉండిన జీవితం అనేది ఉండదు.
మరణం అంటే "వేరు చేయుట లేదా ముగింపు." అపవాది మనల్ని దేవుని నుండి వేరు చేయాలని కోరుకుంటున్నాడు మరియు భూమి మీద మన దైవిక కార్యములు లేదా పనులు సమాప్తం చేయాలని కోరుకుంటున్నాడు; మనము దీనిని బలవంతంగా ప్రతిఘటించాలి మరియు వాని ఆయుధాలను నాశనం చేయాలి.
మరణములో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి:
1. ఆధ్యాత్మిక మరణం
మానవుని ఆత్మ నుండి దేవుని ఆత్మ వేరు చేయబడినప్పుడు ఆధ్యాత్మిక మరణం అవుతుంది. ఆదాము మరియు హవ్వ అనుభవించిన మొదటి మరణం ఆధ్యాత్మికం; వారు దేవుని ఆత్మ నుండి వేరు చేయబడ్డారు. "అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను." (ఆదికాండము 2:17)
2. శారీరిక మరణం
శారీరిక మరణం అంటే భౌతిక శరీరం నుండి ఆత్మ వేరు చేయబడుట.
ఆదాము ఆధ్యాత్మిక మరణాన్ని అనుభవించిన తర్వాత, అతడు భౌతిక మరణాన్ని అనుభవించడానికి 930 సంవత్సరాలు పట్టింది, అయితే భౌతిక మరణం అనేది దేవునికి అవిధేయత చూపిన తర్వాత అతడు అనుభవించిన ఆధ్యాత్మిక మరణం యొక్క ఫలితం. "ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిది వందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను." (ఆదికాండము 5:5)
3. శాశ్వతమైన మరణం
ఏ ఉపాయం లేకుండా, మానవుని యొక్క ఆత్మ దేవుని ఆత్మ నుండి శాశ్వతంగా వేరు చేయబడినప్పుడు శాశ్వతమైన మరణం జరుగుతుంది.
/ దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు 8 మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. 9 ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు నిత్యనాశనమను దండన పొందుదురు (2 థెస్సలొనీకయులు 1:7-9)
పదబంధాన్ని గమనించండి, నిత్యనాశనమను దండన.
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. (ప్రకటన 21:8)
అకాల మరణానికి కారణాలు
అకాల మరణం అంటే ఎవరైనా తమ సామర్థ్యాన్ని (లక్ష్యాలను) సాధించే ముందు మరణించడం; కొంతమంది తాము శ్రమించిన వాటన్నిటినీ ఆస్వాదించే దశలోనే చనిపోతారు. ఇవన్నీ అపవాది యొక్క పనులను వెల్లడిస్తాయి (చంపడానికి, దొంగిలించడానికి మరియు నాశనం చేయడానికి, యోహాను 10:10 చూడండి).
- పాపపు జీవనశైలి
20 ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. 21 దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తులముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను.
25 అప్పుడు యెహోషువ, "నీవేల మమ్మును బాధ పరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరు వానిని రాళ్లతో చావగొట్టిరి; 26 వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మళ్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అనిపేరు. (యెహోషువ 7:20-21, 25-26)
ఆకాను తన ఘోరమైన పాపము కారణంగా అకాల మరణం చెందాడు.
దేవుని వాక్యానికి నిరంతరం అవిధేయత మరియు పాపపు జీవనశైలి మరణాన్ని ఆకర్షించగలదు, మరణం రావడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది.
- మనుషుల దుర్మార్గం
ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుక లకు పదును పెట్టుదురు.
యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు (కీర్తనలు 64:3)
కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. (ఆదికాండము 4:8)
మనుష్యుల హృదయం దుష్ట ఆలోచనలు మరియు స్వార్థపూరిత ఉద్దేశ్యాలతో నిండి ఉంది. మనుష్యుల హృదయాలలోని దుష్టత్వం వారు తమ ప్రియమైన వారిని మరియు వారి చుట్టూ ఉన్న ప్రజలను చంపేలా చేస్తుంది.
- ఆధ్యాత్మిక దాడులు
17 పిమ్మట ఆ స్త్రీ గర్భ వతియై మరుసటి యేట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను.
18 ఆ బిడ్డ యెదిగిన తరువాత ఒకనాడు కోత కోయువారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకుపోయి 19 అక్కడ ఉండగా వాడు నా తలపోయెనే నా తలపోయెనే, అని తన తండ్రితో చెప్పెను.
అతడు వానిని ఎత్తుకొని తల్లియొద్దకు తీసికొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా 20 వాడు ఆ బాలుని ఎత్తికొని వాని తల్లియొద్దకు తీసికొనిపోయెను. పిల్లవాడు మధ్యాహ్నమువరకు తల్లి తొడమీద పండుకొని యుండి చనిపోయెను. (2 రాజులు 4:17-20)
ఈ అంశములో ఉన్న బిడ్డ ఎటువంటి భౌతిక కారణం లేకుండా మరణించాడు. ఇది అతని తల మరియు ఆరోగ్యం మీద ఆధ్యాత్మిక దాడి. పాత నిబంధనలో, దుష్ట శక్తుల కార్యాలు కనిపించాయి కానీ అర్థం కాలేదు. క్రొత్త నిబంధనలో, క్రీస్తు చీకటిలో దాగి ఉన్న పనులను బహిర్గతం చేశాడు మరియు ఈ దుష్ట శక్తుల మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు (లూకా 10:19). ఆధ్యాత్మిక బాణాలు ప్రతిరోజూ ఎగురుతూ ఉంటాయి మరియు దేవుని సహాయం లేకుండా, ప్రజలు ఎప్పుడైనా ప్రాణాపాయం కావచ్చు. "5 రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను నీవు భయపడకుందువు." (కీర్తనలు 91:5)
ఆధ్యాత్మికం భౌతికాన్ని నియంత్రిస్తుంది మరియు భౌతిక క్షేత్రములో ఏదైనా జరగడానికి ముందు, దానిని ఆధ్యాత్మిక రంగంలో ముగించాలి మరియు అమలు చేయాలి. మరణం యొక్క దాడుల నుండి బయటపడటానికి శక్తి కావాలి. దావీదు మహారాజు సౌలు నుండి అనేక మరణ ఉచ్చులను తప్పించుకున్నాడు, కానీ హేబెలు నిర్దోషి మరియు అయినను కయీను చేత చంపబడ్డాడు. (1 సమూయేలు 18:11-12; ఆదికాండము 4:8). నిర్దోషులు శక్తిహీనులుగా, అజ్ఞానులుగా ఉన్నప్పుడు చనిపోవచ్చు.
ఈ రోజు, మనల్ని చంపడానికి రూపొందించబడిన ప్రతి చెడు కార్యములను నాశనం చేయబోతున్నాము మరియు మనము ప్రార్థించబోతున్నాము. నేను మీ జీవితం గురించి ప్రవచిస్తున్నాను: మీరు చనిపోరు కానీ యేసు నామములో మీ దైవిక లక్ష్యాలను నెరవేరుస్తారు. మీ జీవితంలో ఏదీయు యేసు నామములో చనిపోదు.
Bible Reading Plan : Matthew 13 -18
ప్రార్థన
1. నా తండ్రి, నా సృష్టికర్త, నీవు నాకు ఇచ్చిన ఈ జీవితానికై నేను మీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను మరియు సన్నుతించెదను. దేవా నేను నిన్ను ఆరాధిస్తాను.(కీర్తనల గ్రంథము103:1-5,1 థెస్సలొనీకయులకు 5:18)
2. తండ్రీ, నా కుటుంబ సభ్యులకు మరియు నాకు నీ మార్గములో నడవడానికి మరియు నీ శాసనాలను పాటించడానికి నీ కృపను దయచేయి. యేసు నామములో, దయచేసి మేము జీవిస్తున్న ఈ దేశములో మా దినాలను పొడిగించు.(ద్వితీయోపదేశకాండము 5:33,గ్రంథము 91:16)
3. యెహోవా ఎబెనెజరు, నేను జీవించు కాలమంతా నీ యందు భయము కలిగే కృపను నా కుటుంబ సభ్యులకు మరియు నాకును దయచేయి. యేసు నామములో.( సామెతలు 9:10, గ్రంథము128:1)
4. ప్రతి అనారోగ్యం మరియు వ్యాధి నా కుటుంబ సభ్యులను మరియు నన్ను చంపడానికి చేయబడిన ఆలోచన యేసు నామములో నాశనం అవును గాక.(యెషయా54:17, నిర్గమకాండము 15:26)
5. నా శరీరంలో నాటబడిన ఏదైనా చెడు, నన్ను అకాలంగా చంపడానికి రూపొందించబడిన కార్యము, అది పరిశుద్ధాత్మ యొక్క అగ్నిచే నాశనం అవును గాక.(మత్తయి సువార్త 15:13,యెషయా 10:27)
6. నా జీవితాన్ని తగ్గించే ప్రతి విచిత్రమైన నిబంధనలు మరియు శాపాలు; నా కుటుంబ సభ్యుల జీవితం, యేసు రక్తం ద్వారా, యేసు నామంలో నాశనం అవును గాక.(గలతీయులకు3:13, కొలస్సయులకు 2:14)
7. చీకటిలో సంచరించు మరణం మరియు తెగులు యొక్క ఏదైనా బాణం నన్ను మరియు నా ప్రియమైన వారిని యేసు నామంలో ఎన్నటికీ తాకదు.(కీర్తనల గ్రంథము 91:5-6,యెషయా 54:17)
8. యేసు నామములో జీవించుచున్న దేశములో దేవుని మహిమను ప్రకటించడానికి నేను చనిపోను కానీ జీవించెదను.( కీర్తనల గ్రంథము118:17,యోహాను సువార్త 10:10)
9. దేవుని పునరుత్థాన శక్తి, యేసు నామంలో నా జీవితంలో ఏదైనా చనిపోయిన స్వభావానికి జీవము వచ్చును గాక.(రోమీయులకు 8:11,యోహాను సువార్త11:25-26)
10. యేసు నామంలో నా జీవితంలో చనిపోయిన మరియు నిస్సహాయ పరిస్థితులపై జీవమును పలుకుతున్నాను (మీ ఆర్థిక విషయాలు, పిల్లలు, వ్యాపారం మొదలైన వాటి గురించి పలకండి)(యెహెఙ్కేలు 37:4-6,రోమీయులకు 4:17)
11. మీ ప్రార్థనలకు సమాధానాలు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పండి. (యోగ్యమైన సమయాన్ని ఇక్కడ గడపండి)
Join our WhatsApp Channel
Most Read
● ఐదు సమూహాల ప్రజలను యేసు అనుదినము కలుసుకున్నారు #3● ఆయన బలం యొక్క ఉద్దేశ్యం
● దొరికిన గొఱ్ఱెపిల్ల యొక్క ఆనందం
● కోతపు కాలం - 1
● కాలేబు యొక్క ఆత్మ
● ఎంత వరకు?
● స్తుతి అనేది దేవుడు నివసించే స్థలం
కమెంట్లు