అనుదిన మన్నా
14 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
Thursday, 5th of December 2024
0
0
100
Categories :
ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
నా మీద కటాక్షము (కృప) చూపబడును
జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు. (నిర్గమకాండము 3:21)
కటాక్షము అనేది దేవుడు మానవుని మీద లేదా మనిషి నుండి మనిషి మీద చూపించే కృప. మనమందరం ఇతరుల నుండి మంచి విషయాలను మరియు కటాక్షమును కోరుకుంటున్నాము. మనుష్యులు దీవెనలకు సాధనం, దేవుడు ఆశీర్వాదం మరియు కృపకు మూలం. దేవుడు ఒక వ్యక్తి మీద కటాక్షము కలిగి ఉంటే, ప్రజలు అతనిని ఆదరించడం ప్రారంభిస్తారు. ఈ రోజు మన లేఖనం నుండి, ప్రజలకు కటాక్షము ఇచ్చేది దేవుడని లేఖనాలు వెల్లడిస్తున్నాయి: "నేను ఈ ప్రజలకు కటాక్షము కలుగజేసెదను...” ఈ రోజు, మీరు దేవుని కటాక్షము కోసం ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఎవరినైనా మీ పై కటాక్షము చూపేలా చేయగలడు; వారు స్నేహితులు లేదా మీకు తెలిసిన వ్యక్తులకు మాత్రమే పరిమితం కాదు. దేవుడు మీ మీద కటాక్షము కలుగజేయడానికి అపరిచితుడిని మరియు శత్రువును కూడా ఉపయోగించవచ్చు. యేసు నామములో మీపై కటాక్షము ఉండాలని నేను మీ జీవితం మీద ఆజ్ఞాపిస్తున్నాను.
జీవితంలో చాలా మంది వ్యక్తులు ఖాళీగా ఉన్నారు; వారు శారీరికంగా లేదా ఆధ్యాత్మికంగా దోచుకోబడ్డారు లేదా మోసం చేయబడ్డారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తును ఖాళీ చేతులతో విడిచిపెట్టేవారు, కానీ దేవుని కృప ద్వారా వారు సంపద, మహిమ మరియు స్వాధీనంతో విడిచిపెట్టారు. దేవుని కృప మీ వృధా సంవత్సరాలన్నింటికీ దైవికంగా మీకు పరిహారమును అందజేస్తుంది.
దేవుని కటాక్షము మానవుని జీవితంలో ఏమి చేయగలదు?
1. దేవుని కటాక్షము ప్రజలు మిమ్మల్ని గమనించేలా చేస్తుంది.
ఇది జాగృతిని సృష్టిస్తుంది మరియు మనుష్యులు మీ పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉంటారు.
అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొనిఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్య ముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా.(రూతు 2:10)
2. దేవుని కటాక్షము పదోన్నతికి హామీని ఇస్తుంది
వారి బలమునకు అతిశయాస్పదము నీవే
నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. (కీర్తనలు 89:17)
3. కటాక్షము మీకు దేవుని సహాయాన్ని భద్రపరుస్తుంది
మనకు సహాయం అవసరమైనప్పుడల్లా, దేవుని కటాక్షముకై ప్రార్థించవచ్చు. దైవ కటాక్షము పెరగడం వల్ల మరింత సహాయం అందుతుంది.
యెహోవా, నీ ప్రజలయందు నీ కున్న దయచొప్పున
నన్ను జ్ఞాపక మునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. (కీర్తనలు 106:4)
4. వైవాహిక పరిష్కారానికి దేవుని కటాక్షము అవసరము
అందం, సంపద లేదా శారీరక రూపాన్ని బట్టి కాకుండా దేవుని కటాక్షము ద్వారా మీరు సరైన భాగస్వామిని పొందుకుంటారు.
భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు
యెహోవా వలన అనుగ్రహము పొందిన వాడు. (సామెతలు 18:22)
5. దేవుని కటాక్షము ద్వారా, మీరు దేవుని నుండి ఏదైనా అడుగవచ్చు
ప్రార్థనలో మన విన్నపములు దేవుని కటాక్షము ద్వారా పొందుపరుస్తాడు. కటాక్షము లోపిస్తే, ప్రార్థనలకు సమాధానం ఉండదు. ప్రార్థనా స్థలంలో కటాక్షము అనేది చాలా ముఖ్యం.
అందుకతడు నా యెడల నీకు కటాక్షము కలిగిన యెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము. (న్యాయాధిపతులు 6:17)
6. దేవుని కటాక్షము మనలను ఆయన కరుణను ఆనందింపజేస్తుంది
కృప, కనికరము, అనుగ్రహం మరియు దేవుని ప్రేమ ఎలా పనిచేస్తాయో మీరు అర్థం చేసుకున్నప్పుడు, మీరు దేవుని ఉత్తమమైన వాటిని ఆనందిస్తారు. కటాక్షము లేకుండా, కనికరము లభించదు మరియు కనికరము లేకపోవడం వలన తీర్పుకు దారి తీస్తుంది. కనికరము ఉన్నప్పుడు, అది తీర్పు మీద విజయం సాధిస్తుంది.
"అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు
వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు
ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని
కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. (యెషయా 60:10)
కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును. (యాకోబు 2:13)
కటాక్షమును సంతోషించిన వారి యొక్క బైబిలు ఉదాహరణలు
- యేసయ్య
లూకా 2:52 ప్రకారం, కటాక్షము మరియు జ్ఞానము కూడా పెరుగుతుందని మనం స్పష్టంగా చూస్తున్నాము. భూమి మీద తన నియామకాన్ని నెరవేర్చడానికి యేసయ్యకు కటాక్షము అవసరమైతే, అది మీకు ఎందుకు అవసరం కాకూడదు? కటాక్షము జీవితానికి అవసరం; అది మానవునికి జీవితాన్ని సులభతరం చేస్తుంది.
- మరియ, యేసయ్య తల్లి
దేవుని కటాక్షము వల్ల మరియను ఎంపిక చేశారు. నగరంలో అనేక ఇతర కన్యలు ఉన్నారు, కానీ దేవుని మరియ ఆమెను ఎంపిక చేసింది. ఆ ఇతర కన్యలు కూడా ఆదరించబడ్డారు, అయితే మరియ “దయాప్రాప్తురాలైంది" అని లేఖనాలు చెబుతున్నాయి. కటాక్షము స్థాయిలలో ఉంది మరియు "అధిక కటాక్షము" అని పిలవబడటానికి కూడా ఉంది, మీరు యేసు నామములో అధిక కటాక్షమును పొందదురు గాక. (లూకా 1:28, 30)
కటాక్షమును ఆనందించడానికి ఏమి చేయాలి?
- దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి
వాక్యానికి విధేయత చూపడం వల్ల మీరు ఎంత దేవుని కటాక్షమును పొందగలరో నిర్ణయిస్తుంది.
నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము
నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము.
2 అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు
సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును.
3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము
వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము.
నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.
4 అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టి యందును
నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. (సామెతలు 3:1-4)
- దీనమనస్కులై ఉండండి
కృప యొక్క మరొక పదం "కటాక్షము." దీనమనసు మనం దేవుని కటాక్షమును పొందేలా చేస్తుంది. గర్వం గల వ్యక్తి తాను సమర్థుడని మరియు స్వతంత్రుడని భావిస్తాడు; అలాంటి వ్యక్తి నెబుకద్నెజరు లాంటివాడు, అతని విజయం, జయం, కీర్తి మరియు సంపద అతనికి దేవుడు ఇచ్చాడని అ జ్ఞాని గల వ్యక్తి. గర్వం దేవుని కటాక్షమును దోచుకోగలదు.
పండుకొనునప్పుడు నీవు భయపడవు
నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. (సామెతలు 3:24).
- ఇతరుల పట్ల మంచిగా ఉండండి
మీ దయ మీకు నచ్చిన వ్యక్తులకు లేదా మీకు మంచి చేసే వారికి మాత్రమే పరిమితం కాకూడదు. మీరు మీ పరలోకపు తండ్రిలా ఉండాలి మరియు ఇతరులను బేషరతుగా ప్రేమించాలి.
సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును
దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీర్చును. (సామెతలు 12:2)
43 నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు మని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; 44 నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. 45 ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. 46 మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. 47 మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. (మత్తయి 5:43-48)
- కటాక్షముకై ప్రార్థించండి
కటాక్షము అనేది దైవ ఆశీర్వాదం యొక్క ఒక రూపం; మీరు ఏ పరిస్థితిలోనైనా అనుకూలంగా అడగవచ్చు. దేవుడు మనుష్యుల యెదుట మీకు కటాక్షము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే
కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. (కీర్తనలు 5:12)
తదుపరి అధ్యయనం కోసం: ఆదికాండము 6:8, 1 సమూయేలు 16:22, అపొస్తలుల కార్యములు 7:10
Bible Reading Plan : John 1- 5
ప్రార్థన
1. తండ్రీ, యేసు నామములో నా జీవితంలో నీ కటాక్షము హెచ్చించేలా చేయి.
2. ప్రభువా, యేసు నామములో వారు నన్ను తిరస్కరించిన స్థలములో నన్ను అంగీకరించేలా చేయి.
3. ఈ సమయంలో మరియు ఈ నెల యేసు నామములో నా మీద కటాక్షము చూపబడును.
4. తండ్రీ, యేసు నామములో మనుష్యులు నా మీద కటాక్షము చూపేలా ప్రారంభించు.
5. తండ్రీ, నేను ఇతరులను కూడా ఆశీర్వదించేలా ఆర్థికంగా నన్ను ఆశీర్వదించు.
6. యేసు నామములో నా జీవితంలో ప్రతి అనుకూల కటాక్షము నాశనము అవును గాక.
7. దేవా, యేసు నామములో నా వ్యాపారం మీద నీ కటాక్షము ఉండును గాక.
8. తండ్రీ, యేసు నామములో ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర నుండి నీ కటాక్షము నన్ను గుర్తించేలా చేయి.
9. ఆశీర్వాదం, పదోన్నతి, సంపద మరియు అవకాశం యొక్క ప్రతి మూసి ఉన్న తలుపు యేసు యేసు నామములో అగ్ని ద్వారా తెరవబడాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను.
10. యేసు నామములో ఎదగకుండా నన్ను అడ్డుకునే ప్రతి దుష్టశక్తిని నేను విచ్ఛిన్నం చేస్తున్నాను.
11. తండ్రీ, నీ కటాక్షము ద్వారా, నేను ప్రతి ఆశీర్వాద వ్యతిరేక ప్రణాలికను మరియు అవరోధమును దాటుతున్నాను.
12. ప్రభువా, యేసు నామములో నీ మహిమకై ఈ 40 రోజుల ఉపవాసములో పాల్గొనే ప్రతి వ్యక్తిని మరియు నన్ను వాడుకో.
Join our WhatsApp Channel
Most Read
● వివేచన v/s తీర్పు● కేవలం ఆడంబరము కొరకు కాకుండా లోతుగా వెదకడం
● నరకం నిజమైన స్థలమా
● క్రీస్తుతో కూర్చుండుట
● 13 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఒక విషయం: క్రీస్తులో నిజమైన ధనమును కనుగొనడం
● క్షమించటానికి క్రియాత్మక పద్ధతులు
కమెంట్లు