english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 17 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
అనుదిన మన్నా

17 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన

Sunday, 8th of December 2024
0 0 286
Categories : ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)

అగ్ని బాప్తిస్మము

సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు య్యవనస్థులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. (యెషయా 40:29-31)

పాత నిబంధనలో, దేవుని శక్తిని లేదా సన్నిధిని సూచించడానికి కొన్నిసార్లు అగ్నిని ఉపయోగించవచ్చు. ఇశ్రాయేలు యొక్క నిజమైన దేవుడు యెహోవా అని నిరూపించాలనుకున్నప్పుడు, యెహోవాయే నిజమైన దేవుడని దేశానికి నిరూపించడానికి ఆయన అగ్ని పరీక్షను ఉపయోగించాడు. "ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము" అన్నాడు. (1 రాజులు 18:24). అగ్ని యొక్క బాప్తిస్మము శక్తి (సామర్థ్యము) యొక్క బాప్తిస్మము లేదా తాజా అగ్ని బాప్తిస్మము అని కూడా సూచించవచ్చు. శత్రువు అర్థం చేసుకునే భాష శక్తి; మీరు చీకటి శక్తులను ఎదుర్కొన్నప్పుడల్లా, సామర్థ్యమును విడుదల చేయాలి.

ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉండవచ్చు. అతనికి దేవుని శక్తి యొక్క అపారమైన గొప్పతనం అందుబాటులో ఉన్నప్పటికీ, దేవుని గురించి అతని జ్ఞానం పెరగకుండా మరియు ప్రార్థనలో యోగ్యమైన సమయాన్ని వెచ్చించకుండా, ఆ విశ్వాసి శక్తిహీనుడై ఉంటాడు.

దేవుని ఆత్మ "అభిషేకం, అగ్ని మరియు దేవుని శక్తి"గా సూచించబడింది. పరిశుద్ధాత్మ కొలతలలో ఇవ్వబడిందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను, కాబట్టి మీరు అగ్ని బాప్తిస్మము కోసం ప్రార్థించినప్పుడల్లా, మీరు అభిషేకం, అగ్ని మరియు దేవుని శక్తి యొక్క గొప్ప కొలతలను వెతుకుతున్నారు. క్రీస్తు పరిశుద్ధాత్మను కొలమానం లేకుండా పొందాడు, కానీ విశ్వాసిగా, మనం ఆత్మను కొలమానంగా పొందుకున్నాము మరియు మనం క్రీస్తు యొక్క సంపూర్ణ స్థాయికి ఎదుగుతున్నంత వరకు మనం ఆత్మను మరి ఎక్కువగా పొందుతాము.

"ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును." (యోహాను 3:34)

బాప్తిస్మము యొక్క రకాలు
1. నీటి బాప్తిస్మము
నీటి బాప్తిస్మము మనలను క్రీస్తు శరీరంలోకి చేర్చుతుంది.
ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతివి. (1 కొరింథీయులకు 12:13)

2. అగ్ని బాప్తిస్మము
అగ్ని బాప్తిస్మము క్రీస్తు యొక్క శక్తి వైపు మనలను కలుపుతుంది. అగ్ని బాప్తిస్మము భాషలలో మాట్లాడటానికి రుజువుతో పరుస్తుంది.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను. (అపొస్తలుల కార్యములు 1:8)

మీకు అగ్ని బాప్తిస్మము ఎందుకు అవసరం?
1. మీరు క్రీస్తు సువార్తను ప్రభావవంతంగా చూడగలిగేలా మీకు అగ్ని బాప్తిస్మము అవసరం. (అపొస్తలుల కార్యములు 1:8)

2. మీరు శత్రువు యొక్క దాడుల మీద విజయం పొందడానికి మీకు అగ్ని బాప్తిస్మము అవసరం.
ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. 
నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమునుబట్టి 
నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. (కీర్తనలు 66:3)

3. మీరు దేవుని రాజ్యము కొరకు గొప్ప కార్యములు చేయుటకు మీకు అగ్ని బాప్తిస్మము అవసరము.
నేను తండ్రి యొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను 14:12)

4. మీరు రాజ్యాలను జయించడానికి, చీకటి కార్యములను రద్దు చేయడానికి మరియు చెడు కాడిని విచ్ఛిన్నం చేయడానికి మీకు అగ్ని బాప్తిస్మము అవసరం.
33 వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి; 34 అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి. 35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి. (హెబ్రీయులకు 11:33-35)

5. మీరు బంధింపబడిన వారిని విడిపించడానికి మీకు అగ్ని బాప్తిస్మము అవసరం.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు 
బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింపబడుదురు 
భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో 
నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను. (యెషయా 49:25)

6. మీరు దయ్యాలను వెళ్లగొట్టి, వారి రాజ్యానికి భీకరులుగా మారడానికి మీకు అగ్ని బాప్తిస్మము అవసరం.
17 నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్య ములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడు దురు, 18 పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకర మైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. (మార్కు 16:17-18)
 
7. శక్తి లేకుంటే దెయ్యాలు రహస్య స్థలములో దాక్కుంటాయి. అధికారం ద్వారానే వారు తమ దాగి ఉన్న స్థలము నుండి వెలివేయబడుతారు. బ్రతకడానికి మరియు విజయం కొరకు శక్తి అవసరము.
44 నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు 
అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు
45 అన్యులు నిస్త్రాణగలవారై వణకుచు 
తమ దుర్గములను విడచి వచ్చెదరు.. (కీర్తనలు 18:44-45)

ఆత్మ యొక్క అగ్నిని ఆర్పే గల విషయాలు ఏమిటి?
  • “ఆత్మను ఆర్పకుడి...” (1 థెస్సలొనీకయులు 5:19)

 
1. మోహము మరియు పాపపు ఆలోచనలు (మత్తయి 15:10-11, 17-20)
2. ఈ జీవితానికి సంబంధించిన చింతలు (మార్కు 4:19)
3. ప్రార్థన చేయకపోవడం (లూకా 18:1)
4. క్షమించకపోవడం (ఎఫెసీయులకు 4:30)
5. అబద్ధాలు, భయం, సందేహాలు మరియు అవిశ్వాసం (రోమీయులకు 14:23)

మీరు ఆధ్యాత్మిక శక్తిని ఎలా ఉత్పత్తి చేయగలరు
  • ఉపవాసం మరియు ప్రార్థన
ఉపవాసం మిమ్మల్ని ఆధ్యాత్మిక అధికారం యొక్క ఉన్నత రంగాలలోకి ప్రవేశపెడుతుంది.
మనం ఉపవాసం ఉన్నప్పుడల్లా, దేవునితో ఒక తాజాదనం యొక్క సంబంధం కోసం మనల్ని మనం కలిగి ఉంటాము. మీరు దేవునితో తాజాగా కలుసుకోలేరు మరియు బలహీనంగా ఉండలేరు. ప్రతి సంబంధం తాజా అగ్నిని ఉత్పత్తి చేస్తుంది.
 
  • దేవుని వాక్యము
దేవుని వాక్యం శక్తితో నిండి ఉంది, మీరు అధ్యయనం చేసిన ప్రతిసారీ, మీరు నూతన శక్తి నిక్షేపాన్ని పొందుతారు.
 
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది. (హెబ్రీయులకు 4:12)

దేవుని వాక్యంలో అగ్ని మరియు శక్తి ఉన్నాయి. దేవుని వాక్యము దేవుని ఆత్మతో అభిషేకించబడినది. మీరు వాక్యం కొరకు సమయాన్ని వెచ్చిస్తే, మీరు ఆధ్యాత్మిక శక్తిని ఉత్పత్తి చేస్తారు.

ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? 
అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; 
నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు. (యిర్మీయా 20:9)

  • వ్యక్తిగత మరణం
వ్యక్తిగత మరణం లేకుండా, ఆత్మ యొక్క శక్తి మీ జీవితంలో పెరగదు. దేవుని శక్తిని దేవుని ప్రయోజనం కోసం ఉపయోగించాలి. వ్యక్తిగతంగా సిలువ వేయబడనప్పుడు, దేవుని శక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.
 
అందుకు యేసు వారితో ఇట్లనెను, గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును. (యోహాను 12:24)

Bible Reading Plan : John 15-19
ప్రార్థన
1. తండ్రీ, యేసు నామములో నాకు అగ్ని బాప్తిస్మము దయచేయి.

2. తండ్రీ, యేసు నామములో శూర కార్యముల కొరకు నాకు అధికారం దయచేయి.

3. తండ్రీ, యేసు నామములో సంపదను పొందే శక్తిని నాకు దయచేయి.

4. యేసు నామములో సాతాను కోటలను మరియు పరిమితులను విచ్ఛిన్నం చేసే శక్తిని నేను పొందుతున్నాను.

5. తండ్రీ, యేసు నామములో ఆత్మల సంపాదనకై నాకు తాజా అగ్ని దయచేయి.

6. తండ్రీ, యేసు నామములో నా జీవితంలో ఆత్మ యొక్క తొమ్మిది వరములు కార్యం చేయాలని నేను కోరుకుంటున్నాను. (1 కొరింథీయులకు 12:4-11)

7. తండ్రీ, యేసు నామములో, దయచేసి అగ్ని బాప్తిస్మము పొందకుండా నన్ను నిరోధించే నా జీవితంలో ప్రతిదీ యేసు నామములో నాశనమవును గాక.

8. దేవా, నీ అగ్ని ద్వారా, పాపపు కోరికలు మరియు అలవాట్లు యేసు నామములో నా జీవితం నుండి నాశనం అవును గాక.

9. తండ్రీ, నీ పరిశుద్దాత్మ అగ్ని యేసు నామములో నా ప్రాణం, ఆత్మ మరియు శరీరాన్ని శుద్ధిపరచును గాక.

10. తండ్రీ, యేసు నామములో నీ పరిశుద్ధాత్మను నూతనంగా నింపాలని నేను కోరుకుంటున్నాను.

11. యేసు నామములో వ్యర్థమైన జీవితాన్ని నేను గడపను.

12. శ్రేష్ఠతకై అభిషేకం, నా మీద మరియు ఈ 40 రోజుల ఉపవాసంలో పాల్గొనే ప్రతి ఒక్కరి మీద యేసు నామములో ఉండును గాక.

Join our WhatsApp Channel


Most Read
● దైవ క్రమము -1
● అంత్య దినం - ప్రవచనాత్మక కావలివాడు
● 07 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● విశ్వాసం లేదా భయంలో
● విశ్వాసం ద్వారా కృప పొందడం
● వ్యక్తిగత మహిమ యొక్క ఉచ్చు
● 35 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్