english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. కలను చంపువారు
అనుదిన మన్నా

కలను చంపువారు

Monday, 13th of January 2025
0 0 197
Categories : కలలు (Dreams)
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను 10:10)

దేవుడు ఇచ్చిన కల మిమ్మల్ని తుఫాను మరియు వరద వరకు లాగగలదు. మీ చుట్టూ ఉన్న ప్రతిదీ పోతున్నట్లు అనిపించినప్పుడు ఇది చాలా అవసరమైన ఆశ మరియు ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

అయినప్పటికీ, చాలా మంది తమ కలలను మసకబారడానికి అనుమతించారు లేదా వాటిని చంపడానికి అనుమతించారు. మీ కల నుండి జీవితాన్ని హరించాలనుకునే కలలను చంపేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి. దయచేసి వాటిని ఏ ధరకైనా చేయడానికి అనుమతించవద్దు.

"యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరి పగపట్టిరి." (ఆదికాండము 37: 5) యోసేపు మొదట్లో అపరిపక్వత కలిగి ఉన్నాడు మరియు తన కలలను తప్పుడు వ్యక్తులతో పంచుకున్నాడు మరియు వారు యోసేపు కలలను హరించే ప్రయత్నం చేశారు. యోసేపు సోదరులు కలను చంపేవారుకు ఒక అద్భుతమైన ఉదాహరణ.

దేవుడు ప్రార్థనలో, కలలో, లేదా దేవుని దాసుని లేదా దాసురాలి ద్వారా ఏదైనా వెల్లడించినప్పుడు; ప్రతి చోటా చెబుతూ తిరుగవద్దు. అది అపరిపక్వత మరియు దాగి ఉన్న అహంకారాన్ని సూచిస్తుంది. ఆత్మలో పరిపక్వత ఉన్న వ్యక్తులకు మీకు‌‌ దేవుడిచ్చిన రహస్యాలను మాత్రమే ద్వారా మీ కలను బహిర్గతం చేయండి.

మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ కల నెరవేరాలని అనుకోరు. వారు అలా నటిస్తారు, కానీ చివరికి, మీకే తెలుస్తుంది. ఎలా? వారి మాటల ద్వారా. ఇది మీకు అసాధ్యమని, మీకు తగినంత జ్ఞానం లేదని లేదా ఇంతకు ముందు ఎన్నడూ చేయలేదని వారు మీతో చెప్పవచ్చు.

అలాగే, భయపడవద్దు; బెదిరింపు, సందేహం మరియు ఆర్థిక పరిస్థితి లేకపోవడం మీరు మీ కలను నెరవేర్చలేరని నిర్దేశిస్తాయి. ఈ కలను చంపేవారితో తిరిగి మాట్లాడండి. దావీదు గొలియాతుతో తిరిగి మాట్లాడాడు. ఆ కలను చంపేవారితో, "నేను క్రీస్తు యేసులో దేవుడిచ్చిన విధిని నెరవేరుస్తాను" అని చెప్పండి. మీరు ప్రతిరోజూ దీన్ని చేప్పవలసి ఉంటుంది, కానీ అది సరే. మీరు ఈ విధంగా ఎంత ఎక్కువగా మాట్లాడుతారో అంతగా మీలో కల అభివృద్ధి చెందుతుంది మరియు మీలో సురక్షితం అనేది ఉంటుంది.

ప్రభువు మనకు వాగ్దానం చేశాడు, "నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించు నట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు." (యిర్మీయా 29:10-11)

ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, దేవునితో కలలు కనడం ప్రారంభించడం లేదా దేవుడు మీకు ఇచ్చిన కలను కొనసాగించడం మరియు నెరవేర్చడం ఇప్పటికి ఏమీ ఆలస్యం కాలేదు. మీ కల కోసం పని చేయండి మరియు మీ వంతు కృషి చేయండి; దేవుడు ఆయన పని చేస్తాడు.

Bible Reading : Genesis 37 -39
ఒప్పుకోలు
నేను క్రీస్తు యేసులో దేవుడు ఇచ్చిన గమ్యాన్ని నెరవేరుస్తాను, ఎందుకంటే నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను.

Join our WhatsApp Channel


Most Read
● అభిషేకం పొందుకున్న తరువాత ఏమి జరుగుతుంది
● మాట్లాడే వాక్యం యొక్క శక్తి
● మీ విడుదలను ఎలా కాపాడుకోవాలి
● 39 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 01 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● క్రీస్తులో రాజులు మరియు యాజకులు
● 32 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్