english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. సరైన వ్యక్తులతో సహవాసం చేయుట
అనుదిన మన్నా

సరైన వ్యక్తులతో సహవాసం చేయుట

Thursday, 9th of January 2025
0 0 188
Categories : సంబంధాలు (Relationships)
నేను చిన్న పిల్లవాడిగా పెరిగిన ప్రదేశం నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. ఇది ఒక సుందరమైన గ్రామం. కొన్ని సంవత్సరాలుగా, కొంతమంది అబ్బాయిలు ఆట స్థలంలో కూర్చుని, వారి సమయానికి దూరంగా ఉన్నప్పుడు నేను చూసేవాడిని.

అలాంటి వ్యక్తియైన ఎంజో. అతడు ఈ అబ్బాయిల బృందంతో కలిసి చేరాడు. వారు కొత్తగా ఏదైనా చేయాలని అతని పట్ల సూచించినప్పుడల్లా, ఇతరులు అతన్ని ఎగతాళి చేసే వారు మరియు అతని పేరును ఎగతాళిగా పిలిచేవారు. ఈ బృందంలో భాగం కావడానికి, కాల్విన్ మౌనముగా ఉన్నాడు.

వెంటనే ఎంజో తన పాఠశాల విద్యను ముగించి మంచి కళాశాలలో చేరాడు. దేవుని కృప వలన అతడు సానుకూల మరియు మంచి ఉద్దేశ్యంతో నడిచే కొంత మంది వ్యక్తులను కలుసుకున్నాడు. దాదాపు వెంటనే, ఎంజో జీవితంలో పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి. అతడు లక్ష్యాలను నిర్దేశించుకోవడం మొదలుపెట్టాడు మరియు కష్టపడి పనిచేశాడు. నేడు, ఎంజో తన సొంత క్యాటరింగ్ కంపెనీని మరియు మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నాడు.

నేను కొంతకాలం క్రితం అతనిని కలిశాను, మరియు అది ఎలా జరిగిందని నేను అతనిని అడిగాను. సరైన స్నేహితులు మరియు సరైన సంబధాలు వలన ప్రతి వ్యత్యాసాలను కలిగించాయని అతడు నాకు ముందుగానే చెప్పాడు. తన క్రొత్త స్నేహితులు తనను ప్రభువు వద్దకు ఎలా నడిపించారో కూడా అతడు నాకు చెప్పాడు.

నేను అతని పట్ల చాలా సంతోషంగా ఉన్నాను, కానీ ఆ అబ్బాయిలకు కూడా ఏమి జరిగిందో తెలుసుకోవాలనే ఉత్సుకత నాకు కలిగింది. వారు ఇప్పటికీ అదే పరిసరాల్లో జీవిస్తున్నారని, ఏమీ చేయడం లేదని అతడు నాకు చెప్పాడు. అతడు ఇంకా చెపుతూ, "పాస్టర్ గారు, నేను ఆ కుర్రాళ్ల చుట్టూ ఉండి ఉంటే, నేను ఇంకా గల్లీ క్రికెట్ ఆడేవాడిని!" అని అన్నాడు. 

ఎంజో కథ మన జీవితాలపై ఇతరులు చూపే ప్రభావాన్ని గొప్పగా గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు, మనం కొంత మంది వ్యక్తుల చుట్టూ ఉండటం అలవాటు చేసుకుంటాం. అది మన పిలుపుపై, మన భవిష్యత్తుపై కలిగే పరిణామాల గురించి కూడా ఆలోచించదు.

మోసపోకుడి. దుష్టసాంగత్యము (ఐకమత్యము, సహవాసము) మంచి నడవడిని చెరుపును. (1 కొరింథీయులు 15:33)

మనము ప్రాపంచిక నైతికత కలిగిన వ్యక్తులతో సహవాసం చేసినప్పుడు లేదా ఆనందించినప్పుడు, మనము వారి ప్రవర్తనలను, వారి భాషను మరియు వారి అలవాట్లను అనుకరించే ప్రమాదం ఉంది.

ఈ సామెతను గురించి మీరు విన్నారా, "మీరు ఎవరితో తిరుగుతున్నారో చెప్పండి, మరియు మీరు ఏమి అవుతారో నేను మీకు చెప్తాను"

ఆ సాధారణ ప్రతిపాదనలో చాలా జ్ఞానం ఉంది. మీరు చిన్న పిల్లవాడిగా లేదా చిన్న అమ్మాయిగా ఎదిగే సమయాని గురించి ఒకసారి ఆలోచించండి. మనము ఎవరితో సాంగత్యము కలిగి ఉన్నామో మన తల్లిదండ్రులు ఎంత ఆందోళన చెందారో మీకు గుర్తుందా?

మన అమ్మ మరియు నాన్న మన స్నేహితులను కలవాలని మరియు వారి గురించి అంతా తెలుసుకోవాలని కోరుకునే వారు. ఇది మనకు కొంచెం క్రూరంగా అనిపించింది కానీ ఇప్పుడు ఒక తల్లిదండ్రిగా, వారు దీన్ని ఎందుకు చేశారో నేను గ్రహించాను. (మీరు బహుశా నాతో ఏకీభవిస్తారు) మన తల్లిదండ్రులకు స్నేహితుల ప్రభావం ఎవరి జీవితంపై ఉంటుందో తెలుసు కాబట్టి వారు మనను వెనుక నుండి బాగా చూశారు.

గమనించండి, బైబిలు 'దీవించబడిన వ్యక్తి' గురించి ఎలా వివరిస్తుంది
దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల 
మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు 
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. (కీర్తనలు 1:1)

ఆధునిక సాహిత్యం తరచుగా ప్రజలను 'విషపూరితమైన వ్యక్తులు' లేదా 'పోషించే వ్యక్తులు' గా వర్గీకరిస్తుంది.

విషపూరితమైన వ్యక్తులు ఎప్పుడు, ఎక్కడ వీలైతే అక్కడ విషం చిమ్ముతూ ఉంటారు. దీనికి విరుద్ధంగా, పోషించే వ్యక్తులు సానుకూలంగా మరియు చాలా సహాయకారిగా ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, వారు మీ ఆత్మను వృద్ధి పరుస్తారు మరియు మీతో సంతోషంగా ఉంటారు.

విషపూరితమైన వ్యక్తులు ఎల్లప్పుడూ మిమ్మల్ని వారి స్థాయికి లాగడానికి ప్రయత్నిస్తారు, అయితే పోషించే వ్యక్తులు మిమ్మల్ని ప్రయత్నించి, వారి స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తారు.

విషపూరితమైన వ్యక్తులు ఎల్లప్పుడూ మీరు అలాంటి మరియు ఇలాంటి పనిని ఎందుకు చేయలేరని, ఎందుకు సాధ్యం కాదని అని మీకు చెప్తారు. ఆర్థిక వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందనే దాని గురించి దిగులుగా ఉన్న ప్రకటనలతో వారు మీకు భారం కలిగిస్తారు. అలాంటి వ్యక్తుల మాట విన్న తర్వాత, మీరు శారీరకంగా మరియు మానసికంగా మీకు బాగా కృంగిపోయినట్లు అనిపిస్తుంది.

సంవత్సరాలుగా, విషపూరితమైన మరియు పోషించే వ్యక్తులతో నేను వారితో కలసి ఉన్నాను. నేను చెప్పగలిగేది ఏమిటంటే, మీ లక్ష్యాలను సాధించడం, మీకు దేవుడు ఇచ్చిన పిలుపును సాధించడం గురించి మీరు నిజంగా గంభీరంగా ఉంటే, బాధపెట్టు వంటి విషపూరితమైన వ్యక్తులను నివారించండి.

దీని అర్థము సోషల్ మీడియాలో కొంత మంది స్నేహితులను కోల్పోవడం, ప్రతికూలతను ప్రోత్సహించే యూట్యూబ్ ఛానెల్‌లకు సభ్యత్వాన్ని తీసివేయడం, కొన్ని పరిచయాలను తొలగించడం లేదా నిరోధించడం వంటివి ఉంటే, అలా చేయండి - దీనిని చేయండి.

మీరు దైవిక సంబంధాలను కలిగి ఉండటానికి ముందు, కొన్ని దైవిక అసంబంధాలను తొలగించాలి.

అబ్రాహామును ప్రభువు దీవించడానికి ముందు లోతు నుండి విడిపోయాడు (ఆదికాండము 13:5-13 చదవండి) 

యాకోబు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకునే ముందు ఏశావు నుండి విడిపోవలసి వచ్చింది. (ఆదికాండము 33:16-20 చదవండి)

Bible Reading : Genesis 27 - 29
ప్రార్థన
తండ్రీ, సరైన వ్యక్తులతో నన్ను బంధించు. వారి జీవితాలలో నేను చూసే దైవిక లక్షణాలు నాపై రుద్దబడతాయని నేను అంగీకరిస్తున్నాను మరియు నీ మహిమ కోసం నేను మంచి వ్యక్తిగా అవుతాను. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● ధైర్యము కలిగి ఉండుట
● ప్రభువు యొద్దకు తిరిగి వెళ్దాం
● 21 రోజుల ఉపవాసం: 17# వ రోజు
● వరుడిని కలవడానికి సిద్ధపడుట
● ఇతరులపై ప్రోక్షించడం (మేలు చేయడం) ఆపవద్దు
● దేవుని యొక్క 7 ఆత్మలు: బలము గల ఆత్మ
● దేవుని 7 ఆత్మలు: జ్ఞానం గల ఆత్మ
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్