అనుదిన మన్నా
అలాంటి శోధనలు ఎందుకు?
Wednesday, 8th of January 2025
0
0
103
Categories :
పరీక్ష (Testing)
ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. (1 పేతురు1:6)
తీవ్రమైన మరియు సుదీర్ఘమైన బాధలు మరియు పరీక్షలు కొంత మంది క్రైస్తవులను కూడా నిరాశకు గురిచేస్తాయి. యోబు వంటి కోరికలు గర్భం నుండి సమాధికి కొనిపోబడును (యోబు 10:19)
1. 'కొంత కాలము' అనే పదబంధాన్ని
గమనించండి శోధనలు తాత్కాలికమైనవి."మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని" మనం నిరంతరం గుర్తు చేసుకోవాలి (రోమీయులకు 8:18).
అలాగే, "క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది" అని మనం చూడాలి (2 కొరింథీయులకు 4:17)
2. "అవసరమును బట్టి" అనే పదబంధాన్ని
గమనించండి అవసరమైతే మాత్రమే శోధనలు మనకు వస్తాయి. దేవుడు, తన అనంతమైన జ్ఞానంతో, మన స్వంత ఆధ్యాత్మిక వాతావరణానికి అవసరమైన పెరుగుదలను ప్రేరేపించడానికి ఎలాంటి శోధనలను రూపొందించాలో ఖచ్చితంగా తెలుసు.
ఉదాహరణకు, పాలుకు "శరీరంలో ముల్లు" పెట్టడానికి దేవుడు సాతానును అనుమతించాడు. కానీ అది తన మంచి కోసమే, మరియు ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం అతడు అహంకారానికి గురికాకుండా ఉండటానికి. (2 కొరింథీయులకు 12:7-10 చూడండి).
3. మళ్లీ, 'నానా విధములైన శోధనలచేత' అనే పదబంధాన్ని చూడండి
శోధనలు వివిధ ఆకారాలు మరియు పరిమాణాలలో వస్తాయి. కొన్నిసార్లు అవి మన శరీరాలను, మరికొన్ని సార్లు మనస్సులను బాధపెడతాయి. చాలా సార్లు వారు మన అనువయిన ప్రదేశాలను మరియు ఇతర సమయాల్లో మన ప్రియమైన వారిని బాధపెడతాయి. వాటి మూలం ఏమైనప్పటికీ, శోధనలు క్రైస్తవత్వం వైపు మమ్మల్ని క్రమశిక్షణ పరచడానికి దేవుడు వాటిని ఉపయోగిస్తున్నందున దైవభక్తిలో శిక్షణ పొందే అవకాశాలను అందిస్తుంది (హెబ్రీయులకు 12:6,11).
నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. (1 పేతురు 1:7)
దేవుడు మిమ్మల్ని వైఫల్యం కోసం ఏర్పాటు చేయడానికి పరీక్షలను నిర్దేశించలేదు, కానీ మీ విశ్వాసం యొక్క "సువర్ణము అగ్నిపరీక్షను" నిరూపించడానికి.
ప్రపంచ ప్రమాణాల ప్రకారం బంగారం విలువైన లోహంగా పరిగణించబడుతుంది. బంగారాన్ని శుద్ధి చేయడానికి, వారు దానిని అగ్ని గుండాములో వెస్తారు, తద్వారా బంగారంలో దాగి ఉన్న మలినాలను వేరు చేసి స్వచ్ఛమైన బంగారాన్ని నిలుపుకోవచ్చుని.
అదేవిధంగా, పరీక్షలు మీ విశ్వాసం యొక్క కొలిమిని వేడి చేస్తాయి, దేవుని ద్వారా శుద్ధి చేయడానికి మరియు మీ విశ్వాసం "బంగారం కంటే విలువైనది" అని నిరూపించడానికి అవకాశాన్ని ఇస్తుంది (యోబు 23:10).
Bible Reading : Genesis 25 - 26
ఒప్పుకోలు
నేను శోధనలో స్థిరంగా ఉండే దీవించబడిన వ్యక్తిని. నేను ప్రతి శోధన నుండి మునుపటి కంటే బలంగా బయటకు వస్తాను. దేవుడు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవికిరీటాన్ని నేను పోందుకుంటాను. (యాకోబు 1:12)
Join our WhatsApp Channel
Most Read
● మధ్యస్తము యొక్క ముఖ్యమైన వాస్తవాలు● ఆధ్యాత్మిక గర్వము మీద విజయం పొందే 4 మార్గాలు
● కృతజ్ఞత అర్పణలు
● మనుష్యుల పారంపర్యాచారము (సంప్రదాయాలు)
● 02 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● శీర్షిక: ఆయన చూస్తున్నాడు
● దేవుడు ఈరోజు నాకు పొందుపర్చగలడా?
కమెంట్లు