english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. యేసు తాగిన ద్రాక్షారసం
అనుదిన మన్నా

యేసు తాగిన ద్రాక్షారసం

Saturday, 16th of November 2024
0 0 328
Categories : ప్రలోభం (Temptation)
వారు కపాల స్థలమను అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. (మత్తయి 27:33-34)

చిరకతో నిండియున్న యొక్క పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని "సమాప్తమైనదని!" చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. (యోహాను 19:29-30)

సిలువపై ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువుకు 'రెండుసార్లు' ద్రాక్షారసాన్ని అందించారని పై లేఖనాల నుండి మీరు స్పష్టంగా చూడవచ్చు. ఆయన మొదటిదాన్ని తిరస్కరించాడు కాని రెండవదాన్ని తీసుకున్నాడు. ఎందుకు అలా?

యేసుకు మొదటిసారి ద్రాక్షారసం అందించినప్పుడు, అది చేదుతో మిళితం చేయబడింది (మరియు బోళము - మార్కు 15:23) ఆయన పుచ్చుకొనలేదు.

పాత నిబంధన ప్రకారం, యెరూషలేము గౌరవనీయులైన స్త్రీలకు విపరీతమైన నొప్పికి సున్నితత్వాన్ని తగ్గించడానికి మరణశిక్షకు గురైన వారికి మత్తుమందు పానీయం అందించే వారు. యేసు ప్రభువు గొల్గొతాకు వచ్చినప్పుడు, ఆయనకి బోళము (చేదుతో) కలిపిన ద్రాక్షారసం అందించబడింది, కానీ ఆయన దానిని తిరస్కరించాడు.

ఈ మొదటి ద్రాక్షారసం కొంతవరకు నొప్పిని తగ్గించే ప్రతిపాదనను సూచిస్తుంది. యేసు ప్రభువు దీనిని తిరస్కరించాడు మరియు "తన కోసం నియమించబడిన బాధలను పూర్తి స్పృహతో భరించడం" ఎంచుకున్నాడు.

మత్తుమందు కలిపిన ఈ మొదటి ద్రాక్షారసాన్ని ఇయ్యడం అనేది దావీదు మహారాజు ఇచ్చిన ప్రవచనం యొక్క నెరవేర్పు. బాధాకరమైన విచారణలో ఉన్నప్పుడు, తన దాహం తీర్చడానికి తన శత్రువులు తనకు చేదును మాత్రమే ఇచ్చారని దావీదు మొఱ్ఱపెట్టాడు (కీర్తనలు 69:16-21)

పాత నిబంధనలో తాజా పానీయంగా పుల్లని ద్రాక్షారసము చిరకలో నీ ముక్క పేర్కొన్నట్లు బైబిలు పండితులు పేర్కొన్నారు (సంఖ్యాకాండము 6:13; రూతు 2:14). గ్రీక్ మరియు రోమా సామ్రాజ్యంలో కూడా, ఇది కార్మికులు మరియు సైనికులచే మెచ్చుకోదగిన ఒక సాధారణ పానీయం, ఎందుకంటే ఇది నీటి కంటే దాహాన్ని మరింత సమర్థవంతంగా ఉపశమనం చేస్తుంది మరియు చవకైనది.

యేసయ్యకు రెండవసారి ద్రాక్షారసము అందించబడింది, ఎందుకంటే వీలైనంత వరకు యేసయ్యను స్పృహలో ఉంచాలనే ఉద్దేశ్యంతో. 

ఖండించబడిన ఇతర నేరస్థులు మొదటివాడు (వాని శిక్షను తగ్గించడానికి) మరియు రెండోవానిపై (వాని భయంకరమైన బాధను పొడిగించకుండా ఉండటానికి) తీసుకునేవారు. కానీ యేసు మన విడుదలను భద్రపరచడానికి ఎలాంటి సత్వరమార్గము తీసుకోలేదు.

సిలువ వద్ద, మనము ఆయన తండ్రి ప్రేమ ద్రాక్షారసాన్ని ఆస్వాదించడానికి, గొర్రెపిల్ల వివాహ విందులో ఆయనతో చేరడానికి మరియు మమ్మల్ని రక్షించడంలో ఎలాంటి సత్వరమార్గము తీసుకోని వ్యక్తి యొక్క మహిమగల సన్నిధిలో శాశ్వతమైన విడుదల పొందడానికి యేసు ప్రభువు తన తండ్రి యొక్క కోపపు ద్రాక్షారసాన్ని తాగాడు.
ప్రార్థన
ప్రభువైన యేసయ్య, సిలువపై నా కోసం నీవు అనుభవించిన నొప్పి మరియు బాధకు వందనాలు. నేను ప్రస్తుతం అనుభవిస్తున్నదంతా నీవు పూర్తిగా అర్థం చేసుకున్నావు. నా కుటుంబ సభ్యులను మరియు నన్ను బలపరచుని, నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● లోకమునకు ఉప్ప లేదా ఉప్పు స్తంభం
● మీరు వారిని ప్రభావితం చేయాలి
● మీ మార్గములోనే ఉండండి
● యూదా పతనం నుండి 3 పాఠాలు
● అంతర్గత నిధి
● మానవుని హృదయం
● ఆర్థిక గందరగోళం నుండి ఎలా బయటపడాలి # 2
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్