english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ప్రేమ కోసం వెతుకుట
అనుదిన మన్నా

ప్రేమ కోసం వెతుకుట

Sunday, 12th of January 2025
0 0 179
Categories : ప్రేమ (Love)
యేసు ఆమెతో ఇట్లనేను, " ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే; నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను." (యోహాను 4:17-18)

ఒకరోజు యేసు ప్రభువు యూదయ నుండి గలిలయకు వెళ్లేను. ఆయన సమారియా గుండా వెళ్ళవలసి వచ్చెను. తన ప్రయాణంలో, ఆయన సుకారు అనే సమరయ నగరానికి వచ్చాడు. అక్కడ, ఒక సమరయ స్త్రీ (ఆమె పేరు మనకు ఎప్పటికీ తెలియదు) మధ్యాహ్నం సమయంలో బావి వద్ద నీరు చేదుకోనుటకు వచ్చింది.

అప్పటికి, స్త్రీలు సాధారణంగా బావి చల్లగా ఉన్నప్పుడు నీటిని చేదుకోనుటకు వచ్చేవారు. ఈ స్త్రీ, బహుశా తన చెడిపోయిన ప్రతిష్ట గురించి బాగా తెలుసుకున్నది, ఉద్దేశపూర్వకంగా రోజులో కనీసం జనాదరణ పొందిన సమయాన్ని నీళ్లు చేదుకోనుటకు ఎంచుకుంది, గుసగుసలు, ఎగతాళి మరియు ఆమె పొరుగువారి పట్ల అసహ్యం కలిగించకుండా జాగ్రత్త వహించెది - జీవితంలో ఎంత దు:ఖకరమైన సంఘటన.

ఆమె జీవితంలోకి అప్పటికే ఆరుగురు పురుషులు వచ్చారు, కానీ ఆమె కోరుకున్నది వారు ఆమెకు ఇవ్వలేకపోయారు - నిజమైన ప్రేమ. వారు ఆమెను దూషించి, ఆమెను వదిలేసి ఉండవచ్చు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె జీవితంలోకి వచ్చిన ఏడవ వ్యక్తి ప్రభువైన యేసు.

యేసు సంపూర్ణమైన వ్యక్తి. ఆయన ఆమెను ఏ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించాలనుకోలేదు. ఆయన ప్రేమ పరిశుద్ధమైనది మరియు పవిత్రమైనది. ఇది ఆమె వెతుకుతున్న నిజమైన ప్రేమ. ఇతర పురుషులు ఆమెకు ఇచ్చిన తప్పుడు ప్రేమతో ఆమె విసిగిపోయింది. ఆమె యేసు ప్రేమను పొందిన తరువాత, ఆమె సమాజాన్ని ఎదుర్కోగలదు మరియు అతను ఆమె కోసం చేసిన దాని గురించి మాట్లాడగలడు. అదేవిధంగా, మీరు యేసు స్నేహితునిగా మారినప్పుడు, ఇతరులు ఇవ్వలేని ఈ నిజమైన ప్రేమను మీరు అనుభవిస్తారు.

ఒక యువతి తన ప్రేమికుడు చాలా సంవత్సరాలుగా తనను విడిచిపెట్టాడని, ఇప్పుడు ఆమె ఆత్మహత్య గురించి మాత్రమే ఆలోచిస్తుందని నాకు ఈ-మెయిల్ రాసింది. చాలా మంది వారు కేవలం వివాహం చేసుకోగలిగితే, అది వారి చాలా సమస్యలను పరిష్కరిస్తుందని భావిస్తారు.

వివాహం అన్నింటినీ పరిష్కారం కాదు. వివాహం చేసుకున్న జంటలు తాము ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పడం కూడా నేను తరచుగా వింటాను. అది కూడా పరిష్కారం కాదు.

మీరు ఇప్పుడు నెరవేర్పును కనుగొనగలిగితే - మీ ప్రస్తుత స్థితిలో, మీరు ఒక వివాహితుడు లేదా ఒంటరి వ్యక్తిగా తప్పకుండా నెరవేర్పును పొందుతారు. ఈ నెరవేర్పు యేసులో మాత్రమే కనుగొనబడింది. సమరయ స్త్రీ యేసులో ఆమె నెరవేర్పును కనుగొంది, కాబట్టి ఈ ప్రియమైన స్త్రీని మనము ఈ రోజు వరకు గుర్తుంచుకుంటున్నాము. ఇప్పుడు మీ వంతు.

Bible Reading : Genesis 34 -36
ప్రార్థన
పరలోకపు తండ్రీ, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించినందుకు నేను నీకు వందనాలు చెల్లిస్తుతున్నాను. నీ ప్రేమ స్వార్థం లేనిది. నీ ప్రేమ షరతులు లేనిది. నీవు నన్ను ఎంతగానో ప్రేమించావు, నీవు నీ కుమారుడైన ప్రభువైన యేసును నా కొరకు పంపించావు. నీ ప్రేమలో ఎదగడానికి నాకు సహాయం చేయి దేవా. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● ముందుగా యూదా వంశస్థులను వెళ్లనివ్వండి
● 17 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● దేవుని స్వరాన్ని విశ్వసించే శక్తి
● ప్రభువు యొక్క సలహా చాలా అవసరము
● కృప చూపించడానికి క్రియాత్మకమైన మార్గాలు
● అంతిమ రహస్యము
● కార్యం చేయండి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్