english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. శత్రువు రహస్యంగా ఉంటాడు
అనుదిన మన్నా

శత్రువు రహస్యంగా ఉంటాడు

Friday, 21st of February 2025
0 0 156
Categories : ఎస్తేరు యొక్క రహస్యం: క్రమము (Secrets of Esther:Series)

"నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు." (1 పేతురు 5:8)

బైబిలు ఇలా చెబుతోంది, "ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి యెదుటను భయాక్రాంతుడాయెను." (ఎస్తేరు 7:6) హామాను గురించిన సత్యాన్ని ఎస్తేరు బహిర్గతం చేసింది - అతడు నమ్మకమైనవాడు రాజు సేవకుడు కాదు, అతడు బదులుగా విరోధి మరియు శత్రువు, రాజు ప్రయోజనం కంటే తన స్వంత మహిమ మరియు హోదా మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి రాజు అహష్వేరోషు ఎస్తేరు రాణితో ఇలా అన్నాడు, "వాడెవడు, వాడేడి ఎక్కడ ఉన్నాడు?

శక్తివంతమైన మరియు బహుశా అనేక రహస్య గూఢచారులతో ఉన్నప్పటికీ, రాజు ఇప్పటికీ నిజమైన శత్రువు గురించి తెలియదు. శత్రువు ఎంత రహస్యంగా ఉంటాడో ఇది మనకు తెలియజేస్తుంది. రాజు దేవుని ప్రజల విరోధితో ఎప్పుడూ భోజనం చేస్తూ ఉండేవాడు, అయినా అతనికి తెలియదు. అతడు పథకం యొక్క పూర్తి వివరాలను రాజుకు చెప్పకుండా యూదులను చంపే శాసనంపై సంతకం చేసేలా రాజును మోసం చేశాడు. అతని ప్రణాళికలన్నీ స్వార్థపూరితమైనవి, మరియు అతడు సంవత్సరాలుగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు.

మనం జాగ్రత్తగా ఉండాలి. శత్రువు రాజును చుట్టుముట్టాడు, అయినప్పటికీ అతనికి తెలియదు. మీరు ఇప్పటికే శత్రువులుతో చుట్టుముట్టారు మరియు బహుశా వారు ముఖ్యమైన మరియు వ్యక్తిగత సహాయకుడు లేదా కార్యదర్శి అని అంటారేమో? నిజమేమిటంటే, అసలైన విరోధి మానవుడు కాదు, వాడు మానవుడిగా మన ముందుకు వస్తాడు. అపవాది నిజమైన విరోధి. పైన ఉన్న మన వచనం, "మీ విరోధియైన అపవాది" అని చెబుతోంది. అయినప్పటికీ, వాడు మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మనపై దాడి చేస్తాడు. వాడు మన జీవితాల చుట్టూ రహస్యంగా దాగి ఉన్నాడు మరియు చొచ్చుకుపోవడానికి స్థలం లేదా సమయం కోసం చూస్తున్నాడు. ఎఫెసీయులకు 6:12 ఇలా చెబుతోంది, "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహ ములతోను 

వాడు పేతురులోకి ప్రవేశించాడు మరియు యేసయ్య తిరిగి, "సాతానా, నా వెనుకకు పొమ్ము ."కాబట్టి శత్రువుల పన్నాగాల మీద విజయం పొందే ఆత్మతో మనం సున్నితంగా ఉండాలి. 

నెహెమ్యా 6:10-13లో, "అటు తరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయా యొక్క యింటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండ నిర్భందింపబడెను. అతడురాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయములోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము రండని చెప్పగా, నేనునావంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింప వచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబీయాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై యీ ప్రకటన చేసెననియు తేటగ కనుగొంటిని, ఇందు వలన నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని, నామీద నింద మోపు నట్లుగా నన్నుగూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి యుండిరి."

నెహెమ్యా శత్రువులు అతని వద్దకు ఒక గూఢచారిని పంపారు, అతడు సాధారణంగా ప్రేక్షకులకు నచ్చేవాడు. వారు అతని దృష్టిని ఆకర్షించడానికి అనేక మార్గాలు ప్రయత్నించారు, కానీ అతడు నిరాకరించాడు, కాబట్టి వారు శత్రువులచే నియమించబడిన షెమయాను అతని వద్దకు పంపారు. కానీ నెహెమ్యా ఆత్మలో సున్నితత్వం ఉన్నందున, అతడు శత్రువుల ఉచ్చులో పడలేదు. అతడు తప్పించుకొని తన పనిని కొనసాగించాడు.

మీరు సున్నితత్వం కానందున మీరు ఎన్నిసార్లు శత్రువుల వలలో పడ్డారు? మీరు ఎంత తరచుగా శత్రువులను మీ మనస్సులోకి చొప్పించడానికి మరియు మీ క్రియలను నియంత్రించడానికి అనుమతించారు? వణికి వ్యతిరేకంగా బలీయమైన రక్షణను అభివృద్ధి చేయడానికి ఇదే సమయం. దేవుని నుండి ఏదీ దాచబడదు, కాబట్టి దేవునితో సన్నిహితంగా ఉండండి.

మీ చుట్టూ ఉన్న శత్రువులను కనబరచుమని దేవుని అడగండి, తద్వారా మీరు బంధిగా ఉండరు. యోబు 27:7లో బైబిలుచెప్తుంది, "నాకు శత్రువులైనవారు దుష్టులుగా కనబడుదురు గాక నన్నెదిరించువారు నీతిలేనివారుగా కనబడుదురు గాక."

దేవుడు మీ జీవితానికి వ్యతిరేకంగా ఉన్న విరోధులందరినీ కనబరుస్తాడని నేను ప్రవచిస్తున్నాను.


Bible Reading: Numbers 18-20

ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నేను నీకు లోబడి యుంటాను మరియు నీవు నన్ను చెడు నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను. శత్రువులు నా మీద పన్నుతున్న ప్రలోభాలకు వద్దు అని చెప్పే కృప కొరకు ప్రార్థిస్తున్నాను. నా జీవితం చుట్టూ శత్రువుల పనులను చూడడానికి నీవు నా కళ్ళు తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో. ఆమెన్

Join our WhatsApp Channel


Most Read
● గొప్ప విజయం అంటే ఏమిటి?
● మాట్లాడే వాక్యం యొక్క శక్తి
● మీరు ఆధ్యాత్మికంగా యుక్తముగా ఉన్నారా?
● విశ్వాసం: ప్రభువును సంతోషపెట్టడానికి ఖచ్చితమైన మార్గం
● ఇతరులను సానుకూలంగా ఎలా ప్రభావితం చేయాలి
● వారి యవనతనంలో నేర్పించండి
● కార్యాలయంలో ఒక ప్రసిద్ధ వ్యక్తి - I
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్