మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి. (మత్తయి 5:16)
మీరు ప్రతిరోజూ ప్రభువు సన్నిధిలోకి ప్రవేశించడం నేర్చుకున్న తర్వాత, మీరు మళ్లీ అదే విధంగా ఉండలేరు. పరిస్థితులు మరియు సంగతులు ప్రభువు దృక్కోణం నుండి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇది మీరు ప్రవర్తించే విధానం, మీరు మాట్లాడే విధానం మొదలైనవాటిని మారుస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఇది మీరు ఇప్పటివరకు జీవించిన విధానాన్ని మారుస్తుంది. ఎస్తేరు, సాధారణ రైతు అమ్మాయి రాజుతో ఒక రాత్రి కలుసుకోవడం కోసం ఒక సంవత్సరం మొత్తం సిద్దపడింది.
ఆ ఒక్కసారి కలుసుకున్న తర్వాత మళ్లీ అతన్ని చూస్తానన్న గ్యారెంటీ ఆమెకు లేదు. ఫలితం గురించి ఆలోచించకుండా, ఆమె తనను తాను సిద్ధం చేసుకుంది. ఆమె సిద్ధపడిన సమయం ముగిసిన క్షణం, ఆమె రాజు సమక్షంలోకి ప్రవేశించింది మరియు ఆ రోజు నుండి, ఆమె ఇకపై 'జయించిన దేశం' నుండి 'రైతు అమ్మాయి' గా కాకుండా, రాణిగా ఉంది. ఆ రోజు నుండి, ఆమె తను మారిన రాణిలా నడిచింది, మాట్లాడింది మరియు ముందుకు సాగింది. ఆమె సిద్ధపాటు ఆమె జీవనశైలిగా మారింది.
గుర్తుంచుకోండి, ఆరాధన అనేది ప్రార్థనా కూడికలో లేదా సంఘ ఆరాధనలో ఒకటి లేదా రెండు గంటలు లేదా మనం దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపినప్పుడు జరిగేది కార్యము కాదు. అది మన జీవన విధానంగా మారాలి. ఎక్కడికెళ్లినా, పరిస్థితులు ఎలా ఉన్నా - ఏమి చేసినా అందులో ఆరాధన యొక్క పరిమళం తప్పక ఉండాలి. మహారాజు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉంటాడు కాబట్టి, మనం ఎక్కడికి వెళ్లినా ఆయన సన్నిధి మనతో తీసుకువెళతాము. అందువలన, ప్రతి రోజు ప్రతి క్షణం ఆరాధనకు అవకాశం మరియు కారణం అవుతుంది.
ఆరాధన అనేది మనం చేసేది కాదు; అది మనం ఎవరని తెలియజేసేది! సహజముగా స్వభావరీత్యా మనం ఆరాధికులము. రాజుగారికి ఇష్టమైన విధముగా, మన జీవితమంతా ఆరాధనలో కొనసాగాలి! మత్తయి 5లో, ప్రభువైన యేసు ఆరాధకుని గల స్వభావమును గురించి వివరించాడు. ఆత్మవిషయమై దీనులని, దుఃఖపడువారు, సాత్వికులు, నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు, కనికరముగలవారు, హృదయశుద్ధిగలవారు మరియు సమాధానపరచువారు అని అన్నారు. నీతి నిమిత్తము హింసింపబడుతారని అని కూడా అన్నారు. సంక్షిప్తంగా, వారు తమ తండ్రి, మహారాజు స్వభావమును ప్రదర్శిస్తారు.
మరో మాటలో చెప్పాలంటే, మనం చేసే లేదా చెప్పే ప్రతిదీ అయన నామము మరియు స్వభావము యొక్క మహిమను ప్రతిబింబించాలి. ఈ ప్రశ్నను మీకై మీరు ప్రశ్నించుకోండి: నా అనుదిన జీవితం నిరంతర ఆరాధనా పరంగా ఉందా? నా మాటలు మరియు ప్రవర్తన ప్రజలను యేసు ప్రభువు వైపుకు ఆకర్షిస్తున్నాయా లేదా వారిని దూరం చేస్తున్నాయా? మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి!
Bible Reading: Numbers 26-28
ప్రార్థన
                
                    తండ్రీ, నేను నిన్ను వేడుకుంటున్నాను, నా పూర్ణ హృదయంతో, మనస్సుతో మరియు శక్తితో నిన్ను ఆరాధించడానికి ప్రేరేపించు. ఆరాధనా జీవనశైలిలో నన్ను నడవడానికి ప్రేరేపించు. ప్రజలు యేసు ప్రభువు వైపుకు ఆకర్షితులయ్యేలా నేను చేసే లేదా మాట్లాడేదంతా నీ మహిమ మరియు స్వభావాన్ని ప్రతిబింబించాలి. నా వెలుగును ప్రకాశింపజేయుము. యేసు నామములో. ఆమెన్.
                
                                
                
        Join our WhatsApp Channel 
        
    
    
  
                
                
    Most Read
● దేవుని వాక్యాన్ని చదవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు● మీ భవిష్యత్తుకు పేరు పెట్టడానికి మీ గతాన్ని అనుమతించవద్దు
● యేసయ్య యొక్క అధికారమును ఒప్పుకోవడం
● మీరు ఒక ఉద్దేశ్యం కొరకై జన్మించారు
● ఎదురుదెబ్బల నుండి విజయం వరకు
● వాగ్దాన దేశములోని బలగాలతో వ్యవహరించడం
● మీ సౌలభ్యము నుండి బయటపడండి
కమెంట్లు 
                    
                    
                