అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, "నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడని" ఎలీషాకు మొఱ్ఱపెట్టగా." (2 రాజులు 4:1)
ఎలీషా ప్రవక్త బృందంలో పనిచేసిన ఒక వ్యక్తి యొక్క విధువారలు ఎలీషాను కోరింది. ఈ లేఖనం నుండి మనం నేర్చుకోగల కొన్ని విలువైన పాఠాలు ఉన్నాయి.
ఆమె కుటుంబంలో నిరాశ ఉంది:-
ఆమె ఎలీషాకు మొఱ్ఱపెట్టగా. "మొఱ్ఱపెట్టగా" అనే పదానికి అర్థం "ఏడవడం"; అణచివేయకుండా ఏడ్వడం; దుఃఖం నుండి కేకలు వేయడం." ఆమె విన్నపం సాధారణం కాదు కానీ విరిగి నలిగిన హృదయం నుండి తీవ్రమైనది. విరిగి నలిగిన హృదయం మనిషి తృణీకరించేది కాని ప్రభువును కాదు. మీ విరిగి నలిగిన హృదయాన్ని ప్రభువు వద్దకు తీసుకెళ్లండి మరియు ఆయనకు మొఱపెట్టండి. ఆయన ఖచ్చితంగా వేగంగా సమాధానం ఇస్తాడు. కీర్తనలు 51:17 ఇలా చెబుతోంది, "విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు."
ఆమె కుటుంబంలో మరణం ఉంది:-
ఆమె "ప్రవక్తల శిష్యులలో" ఒకరిని వివాహం చేసుకుంది. ఇశ్రాయేలులో ప్రవక్తలుగా మరియు బోధకులుగా ఉండేందుకు ఎలీషా ప్రవక్త ఆధ్వర్యంలో శిక్షణలో ఉన్నవారు వీరే. ఆమె భర్త, ఆమె ప్రేమికుడు, ఆమె స్నేహితుడు, ఆమె ప్రదాత, ఆమె రక్షకుడు, మరణంలో ఆమె నుండి తీసివేయబడ్డాడు. ఆమె పూర్తిగా విరిగిపోయిన స్త్రీ. దుఃఖించేవారిని ఓదార్చి, నీ బూడిదకు అందాన్ని, నీ దుఃఖానికి బదులుగా ఆనంద తైలాన్ని అందజేస్తాడు అని ఆత్మ చెప్పడం విన్నాను. భారమైన ఆత్మకు స్తుతి అనే వస్త్రాన్ని కూడా ఆయన మీకు ఇస్తాడు. (యెషయా 61:3) దానిని యేసు నామములో పొందుకొండి.
ఆమె కుటుంబంలో అప్పు ఉంది:-
భర్త చనిపోవడంతో బిల్లులు కట్టలేకపోతున్నారు. తత్ఫలితంగా, ఆమె అప్పు పుచ్చుకునే వారు ఆమె కుమారులను బానిసలుగా తీసుకెళ్లడానికి వస్తున్నారు, తద్వారా వారు అప్పు తీర్చవచ్చు. ఇది యూదుల చట్టం ప్రకారం అనుమతించబడింది (లేవీయకాండము 25:39). భర్తను కోల్పోయిన ఆమె ఇప్పుడు కుమారులను కూడా కోల్పోవాల్సి వస్తోంది. ఆమె తలకు మించిన అప్పుల్లో కూరుకుపోయింది, దాన్ని ఎలా తీర్చగలదో ఆమె చూడలేదు. ఇది చదివే మీలో కొందరు పెద్ద అప్పుల్లో ఉన్నారు. మీ పరిస్థితి మారబోతోంది.
ఆమె కుటుంబంలో భక్తి ఉంది:-
ఆమె అన్ని సమస్యలు ఉన్నప్పటికీ (నిరాశ, మరణం మరియు రుణం– 3Dలు)
ఆమె ప్రభువుపై తనకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంది. ఆమె దేవుని దూషించలేదు లేదా తాను ఉన్న గందరగోళాన్ని గురించి ఆయనను నిందించలేదు. బదులుగా, ఆమె తన విమోచకునిగా దేవుని చూసింది. ప్రియులారా, మీరు దేవుని శపించినా లేదా మీరు ఉన్న గందరగోళానికి ఆయనను నిందించినా, మిమ్మల్ని క్షమించమని ఆయనను అడగండి. మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించండి మరియు ఆయన శక్తివంతమైన హస్తం క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. యెహోవాతో ఎప్పుడూ సాధారణముగా ఉండకండి.
కొన్నిసార్లు, కొందరు నిరాశకు చేరుకున్నప్పుడు, ప్రపంచం, దేహం మరియు అపవాది అన్నీ దేవుడు చూడలేదని మరియు ఆయన పట్టించుకోలేదని మీకు చెప్తారు. వాస్తవం ఏమిటంటే, ఆయన శ్రద్ధ వహిస్తాడు. మీ అనుదిన భక్తిని మరియు మీ కుటుంబ భక్తిని అభివృద్ధి చేసుకోండి. కరుణా సదన్‌లో జరిగే ఆరాధనలకు హాజరు కావడాన్ని మిస్ అవ్వకండి. ఆయన రహస్యంగా చూసి మరియు బహిరంగంగా ప్రతిఫలమిచ్చే దేవుడు.
ఈ అనుదిన మన్నాని వీలైనంత ఎక్కువ మందితో పంచుకోండి. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ తరపున దేవుని చేయి కదలడాన్ని మీరు చూస్తారు.
Bible Reading: 2 Chronicles 23-25
                ప్రార్థన
                తండ్రీ, యేసు నామములో, నాకు ప్రయోజనము కలుగునట్లు నేర్పుము. నేను నడవవలసిన త్రోవలో నన్ను నడిపించు. (యెషయా 48:17)
        Join our WhatsApp Channel 
        
    
    
  
                
                
    Most Read
● ఆయన్ని వెతకండి మరియు మీ యుద్ధాన్ని ఎదుర్కోండి● మీ ఇబ్బందులు మరియు మీ వైఖరులు
● పాపముతో యుద్ధం
● మీ విశ్వాసముతో రాజీ పడకండి
● యేసు తాగిన ద్రాక్షారసం
● 09 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● ఆత్మ చేత నడిపించబడడం అంటే ఏమిటి?
కమెంట్లు 
                    
                    
                