అనుదిన మన్నా
                
                    
                        
                
                
                    
                        
                        0
                    
                    
                        
                        0
                    
                    
                        
                        335
                    
                
                                    
            ఎంత వరకు?
Saturday, 14th of June 2025
                    
                          Categories :
                                                
                            
                                అభిషేకం (Anointing)
                            
                        
                                                
                            
                                లోబడుట (Surrender)
                            
                        
                                                
                    
                            యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదువు? 
నిత్యము మరచెదవా?నాకెంతకాలము విముఖుడవై యుందువు?
ఎంత వరకు నా మనస్సులో నేను చింతపడుదును?
ఎంత వరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?
ఎంత వరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును? (కీర్తనలు 13:1-2)
కేవలం రెండు వచనాలలో నాలుగు సార్లు, దావీదు దేవుని "ఎంత వరకు?" అని అడిగాడు.
తొలినాళ్లలో, నేను, నా భార్య పరిచర్య కోసం రోడ్డు మార్గంలో వెళ్లినప్పుడు, ఆమె తరచుగా ఇలా అడిగేది, "ప్రయాణం ఎంత వరకు?" పది నిముషాలు గడిచిపోలేదు, ఆపై మళ్ళీ, "మనం ఎప్పుడు చేరుకుంటాము? ఎందుకు ఇంత సమయం తీసుకుంటోంది?" నేను తప్పక ఒప్పుకుంటాను, నేను ఆమెకు నిజమైన సమాచారాన్ని చెప్పను.
వేచి ఉండటం కొన్నిసార్లు దేవుడు మనల్ని మరచిపోయినట్లు అనిపించవచ్చు
నిరీక్షించడం కొన్నిసార్లు అయన ఇకపై పట్టించుకోనట్లు మరియు అయన ముఖాన్ని మన నుండి దాచినట్లు అనిపించవచ్చు.
నిరీక్షించడం విసుగు తెప్పిస్తుంది. దావీదు ఈ నిరీక్షణ ప్రక్రియను కొనసాగించాడు మరియు చివరికి, 'ఎంతవరకు' అని మొఱ్ఱపెట్టాడు? మీరు కూడా ఈ పద్ధతిలో “ఎంతవరకు ప్రభువా” అని మొఱ్ఱపెడుతూ ఉండాలి.
అపొస్తలుడైన పేతురు మనకు "కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు" (2 పేతురు 3:9). ఏదో ఒక సమయంలో, మనలో చాలామంది ఈ "కొందరు" సమూహంలో చేరారు. మనం తరచుగా ప్రభువుతో, “ఎందుకు ఇంత సమయం పడుతుంది? మీరు స్పందించడంలో ఎందుకు నెమ్మదిగా ఉన్నారు? ” నిజాయితీగా, నేను కూడా ఈ ప్రశ్నలను ఏదో ఒక సమయంలో అడిగాను.
మా ప్రయాణంలో మాకు సహాయపడే రెండు అద్భుతమైన వాగ్దానాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను: తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు. (యెషయా 64:4)
“దేవుడు తన కొరకు ఎదురుచూచువారి కొరకు ప్రవర్తించును” అని లేఖనము ఏమి చెబుతుందో గమనించండి.
ఈరోజు, "ప్రభువా, నేను ఈ సమస్యను నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను, మరియు దీనిని పరిష్కరించడానికి నేను వేచి ఉన్నాను మరియు నమ్ముతున్నాను" అని ప్రభువుతో చెప్పండి. ఈ వాగ్దానాన్ని ప్రతిరోజూ ఆయనకు గుర్తు చేస్తూ ఉండండి. ప్రభువు నమ్మకమైనవాడు మరియు ఖచ్చితంగా మీకు అనుకూలంగా వ్యవహరిస్తాడు.
సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్థులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. (యెషయా 40:29–31)
రెండవదిగా, ప్రార్థనలో ప్రభువు కోసం వేచి ఉండటం వలన మీ జీవితంపై వేగం మరియు త్వరణం యొక్క అభిషేకం వస్తుంది. వేగం మరియు త్వరణం యొక్క ఈ అభిషేకం ఏమిటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. దేవుని చెయ్యి ప్రవక్త ఏలీయా మీదికి వచ్చినప్పుడు, అతడు అహాబు రథం కంటే ముందు పరిగెత్తాడు. (1 రాజులు 18:46) మీరు సాధించడానికి సంవత్సరాలు పట్టింది కేవలం రోజులు మాత్రమే. దాన్ని పొందుకోండి.
ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి, వాగ్దాన దేశానికి ప్రయాణించవలసి వచ్చినప్పుడు, అది సాధారణంగా 11 రోజుల ప్రయాణం, కానీ ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు పట్టింది. ఇశ్రాయేలీయులు వాగ్దానం చేయబడిన దేశంలోకి ప్రవేశించే ముందు వారి నిరీక్షణ సమయంలో ప్రభువు వారికి బోధిస్తున్న విషయాలను నేర్చుకోకపోవడమే సమస్య.
ఇది చాలా మంది వ్యక్తుల విషయంలో తరచుగా జరుగుతుంది. వారి నిరీక్షణ కాలంలో ప్రభువు వారికి బోధించడానికి ప్రయత్నిస్తున్న విషయాలను వారు నేర్చుకోరు. మరియు దీని కారణంగా, వారు మళ్లీ మళ్లీ అదే పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటారు. యెహోవా ఇశ్రాయేలీయులతో ఏమి చెప్పాడో గమనించండి: "మీరు ఈ పర్వతాన్ని చాలా కాలం చుట్టుముట్టారు." (ద్వితీయోపదేశకాండము 2:3)
మీరు కేవలం వినేవారు కాకుండా ప్రభువు మీకు బోధిస్తున్న విషయాలను ఆచరణలో పెట్టినప్పుడు, మీ తదుపరి స్థాయికి హామీ ఇవ్వబడుతుంది.
Bible Reading: Esther 5-8
ఒప్పుకోలు
                సర్వశక్తిమంతుడైన తండ్రీ, నీ కోసం ఎదురుచూసేవారి కోసం నువ్వు తప్పకుండా కార్యం చేస్తావు. నేను నీ సన్నిధిలో ప్రతిదినము వేచియున్నందున, నా బలము పునరుద్ధరించబడుచున్నందున నేను నీకు కృతజ్ఞతస్తుతులు తెలుపుచున్నాను. 
నేను పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదును. నేను అలయక పరుగెత్తుదును మరియు సొమ్మసిల్లక నేను నడిచిపోవుదును.
        Join our WhatsApp Channel 
        
    
    
  
                
                
    Most Read
● ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యము● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #1
● 21 రోజుల ఉపవాసం: 7# వ రోజు
● 23వ రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● పరిశుద్ధాత్మ యొక్క ఇతర ప్రత్యక్షత వరములకు ప్రాప్యత పొందుట
● మీ లక్ష్యాలను సాధించే శక్తిని పొందుకోండి
● స్నేహితుని అభ్యర్థన: ప్రార్థన ద్వారా ఎన్నుకొనుట
కమెంట్లు 
                    
                    
                