ఇటీవలి వార్తాపత్రికలో వచ్చిన ఒక వార్తలో ఇద్దరు యుక్తవయస్సు అబ్బాయిలు తమ క్లాస్‌మేట్‌ను బెదిరింపులకు గురిచేస్తూ హతమార్చారు. ప్రతీకారంతో అతన్ని చంపేశారు. అఘోరమైనది!
1సమూయేలు 25:4-9లో, దావీదు వ్యక్తిగత ఖర్చుతో, నాబాలు మనుషులను మరియు పశువులను ఎలాంటి బెదిరింపుల నుండి కాపాడుతున్నాడని మనం మరింత తెలుసుకుంటాము.
దావీదు మరియు అతని మనుషుల రక్షణాత్మక ఉనికి కారణంగానే నాబాలు తన లాభాలను పెంచుకుంటూ సురక్షితంగా మరియు భద్రతతో జీవించగలిగాడు. ఈ సమయం వరకు, దావీదు ప్రతిఫలంగా ఏమీ అడగలేదు.
ఒకరోజు దావీదు తన కోసం మరియు తన మనుషుల కోసం కొన్ని వస్తువులు కోరాడు. దావీదు మరియు అతని మనుషులు తనకు మరియు అతని ప్రజలకు చేసిన వాటన్నిటికీ కృతజ్ఞతతో ఉండటానికి బదులుగా, అతడు దావీదు మరియు అతని మనుషులను అవమానించాడు. దావీదు దాని గురించి విన్నప్పుడు, అతడు బాధపడ్డాడు మరియు పగతో నిండిపోయి నాబాలు ఇంట్లో ఉన్న మగవాళ్లందరినీ చంపేస్తానని ప్రమాణం చేశాడు (1 సమూయేలు 25:21, 22).
అయితే, నాబాలు భార్య అబీగయీలు, ప్రతీకారం తీర్చుకోవడానికి దారిలో ఉన్న దావీదు మరియు అతని మనుషులను కలుసుకుంది. జ్ఞాని అయిన అబీగయీలు దావీదుకు ఇలా సలహా ఇచ్చింది, "మనస్తాపం చెంది ప్రతీకారం తీర్చుకోవద్దు. ఇప్పటి వరకు ప్రభువు నీ యుద్ధాలన్నింటినీ చేసాడు మరియు ప్రభువు దీనితో కూడా పోరాడాలి." (1 సమూయేలు 25:24-31 వివరించడానికి)
దావీదు తెలివిగా అబీగయీలు మాటలను లక్ష్యపెట్టి, ఆ విషయాన్ని దేవుని చేతుల్లోకి వదిలేశాడు. తరువాత, అబీగయీలు నాబాలుకు తాను చేసిన పనిని చెప్పినప్పుడు, "అతని హృదయము అతనిలో చచ్చిపోయి, అతడు రాయిలా అయ్యాడు. దాదాపు పదిరోజుల తర్వాత, ప్రభువు నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు" (1 సమూ. 25:37, 38).
దావీదు తరపున దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు.
దేవుడు పక్షపాతి చూపు వాడు కాదు. (అపొస్తలుల కార్యములు 10:34) ఆయన పక్షపాతి దేవుడు కాదు. (రోమీయులకు 12:11) ఆయన దావీదు కోసం ఏమి చేసాడో, ఆయన మీకు మరియు నాకు కూడా చేస్తాడు.
మనకు ఎవరైనా మనస్తాపం కలిగించే సందర్భాలు ఉన్నాయి మరియు మన మూల ప్రవృత్తులు మనలో సహజంగానే వస్తాయి. చలనచిత్రాలు మరియు గేమింగ్ యాప్‌లు మనకు "చెడ్డవారిని ఛేదించండి" అంతులేని ప్రేరణను అందిస్తాయి. మన శత్రువులు "న్యాయంగా శిక్షించబడినప్పుడు" లేదా "బయటకు తీయబడినప్పుడు" విజయం ఉంటుందని మన పడిపోయిన స్వభావం చెబుతుంది.
అయినప్పటికీ, దేవుడు తన ప్రజలను అలౌకికమైన కార్యము చేయమని ఆజ్ఞాపించాడు. "ప్రియులారా, ఎప్పటికీ పగతీర్చుకోవద్దు, కానీ దానిని దేవుని కోపానికి వదిలివేయండి, ఎందుకంటే "ప్రతీకారం నాది, నేను ప్రతిఫలం ఇస్తాను, అని ప్రభువు చెబుతున్నాడు" (రోమీయులకు 12:19) మరొకరి ద్వారా మనకు అన్యాయం జరిగినప్పుడు, పగను తీర్చడానికి దేవుని నమ్ముకుందాం.
ఇప్పుడు, మన కీర్తి, భౌతిక లేదా ఆర్థిక సంపదను మనం రక్షించుకోలేమని దీని అర్థం కాదు. పౌర అధికారులకు తప్పు గురించి తెలియజేయలేమని కూడా దీని అర్థం కాదు. ఇదంతా అనుమతించదగినది.
బైబిలు అర్థం ఏమిటంటే, మన బాధ, కోపంతో మరొకరిపై దాడి చేసి నాశనం చేయకూడదు. దేవుడు చివరికి అన్ని లెక్కలను పరిష్కరిస్తాడు.
యేసు సిలువపై ఉన్నప్పుడు, "ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు (తండ్రి) దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. (1 పేతురు 2:23)
Bible Reading: Job 24-29
ప్రార్థన
1. తండ్రీ, ప్రతీకార ఆలోచనలను కలిగి ఉన్నందుకు నన్ను క్షమించు. “పగ తీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి” అని చెప్పే నీ వాక్యంపై నమ్మకం ఉంచేందుకు నాకు సహాయం చేయి.
2. ప్రభువైన యేసయ్య, నీవు సమాధానకర్తవి. నీ శాంతి నా హృదయాన్ని మరియు నా జీవితంలోని ప్రతి రంగాన్ని పాలించును గాక. ఆమెన్.
Join our WhatsApp Channel

Most Read
● శీర్షిక: అదనపు సామాను వద్దు● 12 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● 06 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● అద్భుతాలలో పని చేయుట: కీ#1
● కోపంతో వ్యవహరించడం
● విశ్వాసం ద్వారా పొందుకోవడం
● మీరు సులభంగా గాయపరచబడుతారా?
కమెంట్లు