हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. మధ్యస్తముపై ప్రవచనాత్మకమైన పాఠం - 1
Daily Manna

మధ్యస్తముపై ప్రవచనాత్మకమైన పాఠం - 1

Tuesday, 12th of August 2025
0 0 443
Categories : ప్రార్థన (Prayer) మధ్యస్త్యం (Intercession)
ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక, వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరల వెళ్లి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా, యూదా అతని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడ కూడదని మాతో గట్టిగా చెప్పెను (ఆదికాండము 43:1-3)

కరువు తీవ్రంగా ఉంది. యాకోబు కుమారులు తమ మొదటి ఐగుప్తు పర్యటన నుండి తెచ్చిన ఆహార ధాన్యాలు అయిపోయాయి. వారు ఇప్పుడు ఆకలితో మరణ విపత్తును ఎదురుకుంటున్నారు. యాకోబు, వారి తండ్రి, వారు ఐగుప్తుకు తిరిగి వెళ్లాలని, తద్వారా వారు ఆహారం పొందాలని పట్టుబట్టారు. గమనించండి, అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, అయితే యూదా తన తండ్రి యాకోబుతో తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ఇది మనకు సెలవిస్తుంది:
• తండ్రితో తన మనసులోని మాటను చెప్పేవాడు మధ్యస్తము (విజ్ఞాపన ప్రార్థన) చేయువాడు .
• మధ్యస్తము చేయువాడు అంటే పరిస్థితిని స్పష్టంగా తండ్రికి వివరించే వ్యక్తి.

యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము; నేను అతని గూర్చి పూటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీ యొద్దకు తీసికొనివచ్చి నీ యెదుట నిలువబెట్టని యెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును. మాకు తడవు కాక పోయిన యెడల ఈపాటికి రెండవ మారు తిరిగి వచ్చి యుందుమని చెప్పెను. (ఆదికాండము 43:8-10)

యూదా మాటలు గమనించండి. "నేను అతని గూర్చి పూటపడుదును....... ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును". సోదరులు ఎవరూ మాట్లాడటం లేదు. ఏం జరిగినా వారికి ఇబ్బంది లేనట్లుగా వ్యవహరించారు. అయితే ఇక్కడ వారందరి తరపున మధ్యలో యూదా నిలబడి ఉన్నాడు.

ఇది మళ్ళీ నాకు సెలవిస్తుంది:
మధ్యస్తము చేయువాడు అంటే మధ్యలో (వ్యక్తి తరపున) నిలబడటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి.

యూదా విజ్ఞాపన ప్రార్థన అతని కుటుంబాన్ని రక్షించడమే కాకుండా మొత్తం వంశాన్ని కరువు మరియు ఆసన్న మరణం నుండి రక్షించింది. అలాగే, మీ విజ్ఞాపన ప్రార్థన మీ కుటుంబాన్ని మాత్రమే రక్షించడమే కాక క్రీస్తు సంఘాన్ని కూడా పునరుజ్జీవింపజేస్తుంది.

దేవుడు నిజంగా పరిశోధిస్తున్న రెండు రకాల వ్యక్తులు ఉన్నారు

1. ఒక ఆరాధికుడు
యోహాను 4:23-24, ప్రభువు స్వయంగా నిజమైన ఆరాధకుల కోసం వెతుకుతున్నాడని సెలవిస్తుంది.

2. ఒక విజ్ఞాపన ప్రార్థన చేయువాడు
ప్రభువు స్వయంగా ఇలా అంటున్నాడు, "నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని... (యెహెజ్కేలు 22:30)

సందులలో నిలబడగల వ్యక్తి కోసం దేవుడు ఇంకా వెతుకుతున్నాడు. దేవుడు ఒక విజ్ఞాపన ప్రార్థన చేయువాని కనుగొనగలిగితే, దేవుడు తనతో కలిసి పని చేయగల వ్యక్తిని కలిగి ఉంటాడు.

నిజం ఏమిటంటే, మీరు ఇద్దరూ కావచ్చు - ఆరాధికుడు మరియు విజ్ఞాపన ప్రార్థన చేయువాడు. అబ్రహము ఒక ఆరాధికుడు మరియు విజ్ఞాపన ప్రార్థన చేయువాడు, దావీదు ఆరాధికుడు మరియు విజ్ఞాపన ప్రార్థన చేయువాడు.

Bible Reading: Jeremiah 5-6
Prayer
1. తండ్రీ, యేసు నామంలో, కరుణ సదన్‌తో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తిని ఈ సంవత్సరం వారి అతీంద్రియ మలుపు కోసం శ్రేష్ఠమైన ఆత్మతో శక్తివంతం చేయి.

2. కరుణా సదన్ పరిచర్యలో అనారోగ్యంతో బాధపడుతున్న మరియు బాధపడే ప్రతి ఒక్కరినీ యేసు నామంలో స్వస్థపరిచి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు.

3. తండ్రీ, యేసు నామంలో, కరుణ సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తిని దుష్టుని యొక్క సమస్త అణచివేతల నుండి విడిపించు మరియు ఈక్షణమే వారి విమోచనను స్థాపించు.


Join our WhatsApp Channel


Most Read
● నిరుత్సాహం యొక్క బాణాల మీద విజయం పొందడం - II
● ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 2
● దేవుని 7 ఆత్మలు: వివేకము గల ఆత్మ
● 07 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● అగాపే ప్రేమలో ఎలా వృద్ధి చెందాలి
● మీ కలలను మేల్కొలపండి
● మీరు ఆధ్యాత్మికంగా యుక్తముగా ఉన్నారా?
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2026 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login