हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. మరచిపోవడం యొక్క ప్రమాదాలు
Daily Manna

మరచిపోవడం యొక్క ప్రమాదాలు

Wednesday, 3rd of September 2025
1 0 480
Categories : కృతజ్ఞత (Thanksgiving) నమ్మకస్తులు (Faithfulness) స్వభావం (Character)
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము 
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము (కీర్తనలు 103:2)


దేవుడు తన కోసం చేసిన మంచి ఉపకారములను ఎప్పటికీ మరచిపోకూడదని దావీదు ప్రార్థన మరియు నిబద్ధత చేశాడు. మనం కూడా మన జీవితంలో దేవుని ఉపకారములను మరచిపోకుండా ప్రార్థించాలి మరియు అదే నిబద్ధతతో ఉండాలి.

ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల యెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి. (సంఖ్యాకాండము 11:5-6)

ఇశ్రాయేలీయులు తమ చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు మరియు తెల్ల గడ్డలు ధరలను ఎంత త్వరగా మర్చిపోయారు. అమానవీయ పరిస్థితుల్లో బతుకుతున్న బానిసలుగా వారు భారీ వేల చెల్లించుకోవాల్సి వచ్చింది. వారు విమోచన కోసం తరచుగా ప్రభువుకు మొర పెట్టేవారు, ఎందుకంటే వారు అలాంటి ధరను చెల్లించడాన్ని భరించలేకపోయారు.

ప్రభువు వారిని విడిపించిన తర్వాత, ప్రభువు వారి కోసం ఏమి చేసాడో వారు చాలా హాయిగా మరచిపోయారు మరియు వారు ఐగుప్తులో వదిలిపెట్టిన 'మంచి విషయాలు' అని పిలవబడే వాటి కోసం మొఱపెట్టారు. వారు ఐగుప్తు ఆహారాన్ని జ్ఞాపకం చేసుకున్నారు కానీ ప్రభువు యొక్క శక్తివంతమైన విమోచనను గుర్తుంచుకోకపోవడం విచిత్రం కాదా?

దేవుడు మనకు చేసిన మేలును మరచిపోవడం పాపమని నేను నమ్ముతున్నాను.

1. మరచిపోవడం అవిశ్వాసం మరియు విద్రోహంకు దారితీస్తుంది
ఇశ్రాయేలీయులు అనేక అద్భుతాలను చూసినప్పటికీ, వారిపట్ల ఆయన చేసిన అనేక కృపాబాహుళ్యమును వారు త్వరలోనే మరచిపోయారు. బదులుగా, వారు ఎఱ్ఱ సముద్రము నొద్ద ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిరి." (కీర్తనలు 106:7)

2. మరచిపోవడం మనల్ని మూర్ఖంగా ప్రవర్తించేలా చేస్తుంది
అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి 
ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.(కీర్తనలు 106:13)

దేవుని కార్యములను మరచిపోవడం వల్ల మనం అసహనానికి గురవుతాము మరియు ఆయన దిశానిర్దేశం కోసం వేచి ఉండము. అసహనానికి గురైన వ్యక్తులు తెలివి తక్కువ పనులు చేస్తారు.

3. మర్చిపోవడం దేవుని కోపాన్ని రేకెత్తిస్తుంది
ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను
ఎఱ్ఱసముద్రము నొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన 
తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.
అప్పుడు ఆయననేను వారిని నశింపజేసెదననెను. 
అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు 
ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే 
ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను (కీర్తనలు 106:21-23)

నిశ్చయంగా ప్రభువు గతంలో నీ పట్ల మేలు చేసాడు. దానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం ఒక పనిగా చేసుకోండి. ప్రభువు కృపాబాహుళ్యమును ఎన్నటికీ మరువకు.


Bible Reading: Ezekiel 7-10
Prayer
తండ్రీ, యేసు నామంలో, నీవు నా కుటుంబ సభ్యుల పట్ల మరియు నా పట్ల చేసిన మంచి కార్యములను ఎప్పటికీ మరచిపోకుండా నాకు కృపను దయచేయి.

Join our WhatsApp Channel


Most Read
● మార్పుకై సమయం
● ఐదు సమూహాల ప్రజలను యేసుఅనుదినము కలుసుకున్నారు #1
● ఇది అధికార మార్పు  (బదిలి) యొక్క సమయం
● ఆయన చిత్తాన్ని చేయడం యొక్క ప్రాముఖ్యత
● 27 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 03 రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● వివేచన v/s తీర్పు
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2026 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login