हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. మీ స్వంత కాళ్ళను నరుకొవద్దు
Daily Manna

మీ స్వంత కాళ్ళను నరుకొవద్దు

Saturday, 6th of September 2025
0 0 408
Categories : పాపం (Sin) విడుదల (Deliverance)
​అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. (సంఖ్యాకాండము 25:1-3)

బిలాము ఇశ్రాయేలును శపించుటకు ప్రయత్నించాడు కానీ జరగరలేదు; కానీ ఇప్పుడు, వారు యెహోవాకు వ్యతిరేకంగా చేసిన పాపం కారణంగా శపించబడ్డారు.

హిందీ భాషలో "కోడవలితో మీ స్వంత కాళ్ళను నరుకొవద్దు" అని చెప్పే ఒక ప్రసిద్ధ నీతి వాక్యం ఉంది. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా శత్రువు ఏమి సాధించలేకపోయాడు, ఇశ్రాయేలు వారి అవిధేయత ద్వారా తమ మీదికి తెచ్చుకున్నారు. నేటికీ దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అదే సూత్రం వర్తిస్తుంది. మనపై సాతాను చేసే అత్యంత శక్తివంతమైన దాడి మన స్వంత పాపం మరియు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినంత నష్టాన్ని ఎన్నటికీ చేయదు.

బిలాము ఇశ్రాయేలును శపించుటకు తన వంతు కృషి చేసాడు - కాని విఫలమయ్యాడు. అయినప్పటికీ, డబ్బుపై అతనికి ఉన్న ప్రేమ, మోయాబు రాజు అయిన బాలాకు తనను నియమించిన వ్యక్తిని సంతోషపెట్టకుండా విషయాన్ని ముగించలేదు.

ఇశ్రాయేలీయుల పట్ల బిలాము ఏమి చేసాడో ప్రభువు స్వయంగా బయటపెట్టాడు, "అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, [వారిని ప్రలోభపెట్టడానికి] విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము [లైంగిక దుర్మార్గాలకు తమను తాము అప్పగించుకోవడం] చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను (సిద్ధాంతానికి) అనుసరించువారు నీలో ఉన్నారు." (ప్రకటన 2:14)

ముఖ్యంగా, ఇశ్రాయేలీయులను శపించడంలో విఫలమైన తర్వాత, బిలాము బాలాకుతో ఇలా అన్నాడు: "నేను ఈ ప్రజలను శపించలేను. కానీ నీవు వారి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి వారిని ప్రలోభపెట్టడం ద్వారా తమను తాము శపించుకునేలా చేయవచ్చు. మీ అందమైన అమ్మాయిలను వారి మధ్యకు పంపించి, ఇశ్రాయేలు పురుషులను అనైతికత మరియు వ్యభిచారమునకు ప్రలోభపెట్టమని చెప్పు." మరియు అది పనిచేసింది.

బిలాము, బాలాకు తన చెడ్డ సలహా ద్వారా అతడు కోరుకున్నది పొందాడు - కానీ అతడు దేవుని శత్రువుల మధ్య మరణించాడు (సంఖ్యాకాండము 31:7-8). అతడు తన డబ్బును కొద్దికాలం మాత్రమే అనుభవించాడు.

Bible Reading: Ezekiel 17-18
Prayer
తండ్రీ, యేసు నామంలో, నా అవిధేయత స్థితులను పాపంగా అంగీకరిస్తున్నాను. (అవిధేయత యొక్క స్థితులు ఏమిటో ప్రభువుకు తెల్పండి) నన్ను క్షమించు ప్రభువా, నీ రాకడ పర్యంతం వరకు నన్ను కాపాడు. ఆమెన్. [1 థెస్సలోనియన్లు 5:23-24]

Join our WhatsApp Channel


Most Read
● ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 2
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 2
● మీ విడుదల మరియు స్వస్థత యొక్క ఉద్దేశ్యం
● పరిపక్వత బాధ్యతతో మొదలవుతుంది
● కార్యం చేయండి
● ఆత్మ చేత నడిపించబడడం అంటే ఏమిటి?
● విశ్వాసం యొక్క సామర్థ్యము
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2026 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login