हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. కార్యం చేయండి
Daily Manna

కార్యం చేయండి

Wednesday, 24th of September 2025
0 0 350
Categories : దీనమనస్సు (Humility) దేవుని వాక్యం (Word of God)
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున దేమనగా, ఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్థులు దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించియున్నాను. (2 రాజులు 22:19)

యోషీయా రాజు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, అతడు పశ్చాత్తాపానికి చిహ్నంగా తన బట్టలను చింపుకొన్నాడు.

అప్పుడు ప్రభువు ప్రవక్త హుల్దా ద్వారా మాట్లాడాడు. పదబంధాన్ని గమనించండి: "ఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్థులు దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించితివి".

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యోషీయా దేవదూతలను చూడలేదు లేదా వినతగ్గు గల స్వరం వినలేదు. అతడు శాస్త్రి అయిన షాఫాను బిగ్గరగా చదివే వాక్యాన్ని వింటున్నాడు, అయితే ప్రభువు ఇలా అన్నాడు, "నేను చెప్పిన మాటలను నీవు ఆలకించితివి"

మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా లేదా వాక్యాన్ని వింటున్నప్పుడల్లా, ప్రభువు మనతో నేరుగా మాట్లాడుతున్నాడని ఇది నాకు తెలియజేస్తుంది. మనకు ప్రత్యేక విచిత్రమైన పద్ధతులు అవసరం లేదు; ప్రభువు స్వయంగా మాట్లాడుతాడు మరియు మనం ఈ వాస్తవాన్ని గమనించాలి.

ఇంకా, ప్రభువు ప్రవక్త హుల్దా ద్వారా ఇలా అన్నాడు, "నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించియున్నాను."

మళ్ళీ, బైబిలు యోషీయా చేసిన ప్రత్యేక ప్రార్థనలను నమోదు చేయబడలేదు. అతడు కన్నీళ్లు విడిచాడు మరియు అతడు బట్టలు చింపుకొన్నాడు (తీవ్రమైన పశ్చాత్తాపానికి సంకేతం). మాటల కంటే కార్యాలు ఎక్కువగా మాట్లాడతాయని మనందరికీ తెలుసు. దేవుని వాక్యంపై ఆధారపడిన మన కార్యాలు ప్రభువు మన ప్రార్థన వినేలా చేస్తాయని ఇది నాకు తెలియజేపుతుంది.

కొంత మంది ప్రార్థనలకు సమాధానం లభించకపోవడానికి ఇది కూడా మరొక కారణం కావచ్చు? వారందరు కేవలం మాట్లాడుతారు గాని కార్యాలు చేయరు. విశ్వాసానికి నా నిర్వచనం: దేవుని వాక్యంపై ఆధారపడిన కార్య.

నా మిత్రమా, మీరు మీ ప్రార్థనలకు త్వరగా సమాధానం రావ్వాలని మీరు కోరుకునట్లైతే, మీరు విన్న వాక్యం ఆధారంగా కార్యం చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.

ఉదాహరణకు, మీకు విడుదల అవసరం.
యాకోబు 4:7 ఇలా సెలవిస్తుంది, "కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్ద నుండి పారిపోవును."

దేవుని వాక్యానికి లోబడి ఉండకపోతే, అపవాది పారిపోడు. కానీ మీరు లోబడినప్పుడు (కార్యం చేసినప్పుడు), అపవాదికి మీ జీవితం నుండి వన్-వే టికెట్ తీసుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు.

Bible Reading: Daniel 10-11
Confession
తండ్రీ, యేసు నామములో, నేను ఏమైయున్నానో అని బైబిలు చెబుతుందో నేను అదే అయి ఉన్నాన, నేను ఏమి చేయగలనని బైబిలు చెబుతుందో నేను అదే చేయగలను మరియు నేను ఏమి కలిగి ఉండాలని బైబిలు చెబుతుందో నేను అదే కలిగి ఉంటానని ప్రకటిస్తున్నాను.

తండ్రీ, యేసు నామంలో, నేను వెలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచు కొనుచున్నాని ప్రకటిస్తున్నాను. ఆమెన్.



Join our WhatsApp Channel


Most Read
● లైంగిక శోధనపై ఎలా విజయం పొందాలి
● దేవుడు సమకూరుస్తాడు
● నిరుత్సాహం యొక్క బాణాల మీద విజయం పొందడం - I
● మనస్తాపం ఆధ్యాత్మిక వృద్ధిని & విధిని అడ్డుకుంటుంది
● వ్యసనాలను ఆపివేయడం
● జీవన నియమావళి
● క్రీస్తు రాయబారి
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2026 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login