हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. దేవుని అత్యంత స్వభావము
Daily Manna

దేవుని అత్యంత స్వభావము

Thursday, 2nd of October 2025
0 0 369
Categories : స్వభావం (Character)
అయితే ఆత్మ ఫలమేమనగా (ఆయన సన్నిధి సమక్షంలో నెరవేర్చబడే గొప్ప కార్యము), ప్రేమ, సంతోషము (ఆనందం), సమాధానము, దీర్ఘశాంతము (సమానత్వం, సహనం), దయాళుత్వము, మంచితనము (పరోపకారం), విశ్వాసము, సాత్వికము (సౌమ్యత, వినయం), ఆశా నిగ్రహము (స్వీయ నిగ్రహం, నిర్బంధం). ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు (అది కార్యము చేయగలదు) లేదు.

ఆ తొమ్మిది లక్షణాలు, ఆత్మ ఫలం, దేవుని స్వభావం మరియు స్వరూపం. అవి మన ప్రభువైన యేసుక్రీస్తు స్వభావం మరియు స్వరూపం.

ఆయన నడిచే, మాట్లాడే విధానం ఆత్మ ఫలం యొక్క వ్యక్తీకరణం. ఆత్మ ఫలం క్రీస్తు యొక్క "సారూప్యము".

ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. (రోమీయులకు 8:29)

వాస్తవానికి, దేవుని వాక్యం మరియు అభిషేకం యొక్క అంతిమ ఉద్దేశ్యం మనలను మార్చడం మరియు మన స్వభావం ఆయన వలె మార్చబడటం. 

గుర్తుంచుకోండి, ప్రభువైన యేసయ్య ఇలా అన్నాడు, "మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఘనపరచబడును మరియు మహిమపరచబడును, మరియు మీరు నా నిజమైన శిష్యులగా నిరూపించబడతారు మరియు నిరూపించుకుంటారు." (యోహాను 15:8)

ప్రజలు ఆత్మ ఫలం లేకుండా పరిశుద్ధాత్మ వరముతో పనిచేయడానికి ప్రయత్నించినప్పుడు, వరము చివరికి భ్రష్టమైపోవును మరియు దాని సంపూర్ణతతో పనిచేయదు.

అలాంటి వరాలను దుర్వినియోగం చేయడం వల్ల తండ్రికి ఎలాంటి మహిమ పొందుకోడు. అందువల్ల, మీరు ఆయన సన్నిధిలో చేరి ఉండడం మరియు ఫలించడం చాలా అవసరం. పరిశుద్ధాత్మ యొక్క వరములు ఎల్లప్పుడూ ఆత్మ ఫలం యొక్క శక్తివంతమైన ప్రభావంతో సమానంగా ఉపయోగించబడతాయి.

కఱ్ఱ యొక్క కథ సంఖ్యాకాండము 17లో చదువుతాము; దేవుడు ఒక ప్రధాన యాజకుడిని ఎన్నుకున్నాడు మరియు ప్రతి గోత్రం నుండి ఒక వ్యక్తి తన కఱ్ఱను తీసుకువచ్చి ప్రత్యక్షపు గుడారం తలుపు ముందు ఉంచమని మోషేకు ఆజ్ఞాపించాడు. చిగిరించిన కఱ్ఱ యాజకుని కోసం తన ఎంపికకు సూచనగా ఉంటుందని దేవుడు చెప్పాడు.

మరునాడు మోషే సాక్ష్యపు గుడారము లోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కఱ్ఱ చిగిర్చి యుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లుగలదాయెను. (సంఖ్యాకాండము 17:8)

ప్రభువైన యేసయ్య ఇలా అన్నాడు, "వారి ఫలములను బట్టి మీరు వారిని తెలిసికొందురు..." (మత్తయి. 7:16). ప్రధాన యాజకుని దేవుడు ఎన్నుకున్నాడని కఱ్ఱ మీద పండు ద్వారా తెలిసింది.

Bible Reading: Micah 4-7; Nahum 1 
Confession
నేను తల (ప్రభువైన యేసు క్రీస్తు)తో అనుసంధానించబడి ఉంది. కాబట్టి, నా జీవితం మరి ఎక్కువగా ఫలిస్తుంది మరియు తండ్రికి ఘనతను తెస్తుంది.



Join our WhatsApp Channel


Most Read
● ఇతరుల కోసం ప్రార్థించడం
● నమ్మకమైన సాక్షి
● సంబంధాలలో సన్మాన నియమము
● ప్రభువా, కలవరము నుండి నన్ను విడిపించు
● పోరాటం చేయుట
● మరణించిన వ్యక్తి జీవించడం కోసం ప్రార్థిస్తున్నాడు
● ఐదు సమూహాల ప్రజలను యేసుఅనుదినము కలుసుకున్నారు #1
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2026 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login