Daily Manna
1
0
1096
21 రోజుల ఉపవాసం: 18# వ రోజు
Wednesday, 29th of December 2021
Categories :
Fasting and Prayer
దేవుడు ఉద్దేశ్యము గల దేవుడు, ఆయన ఉద్దేశ్యము లేనిదే ఏది చేయడు. ఆయన ఒక ఉద్దేశ్యం కోసమే భూమిని సృష్టించాడు. కాబట్టి, మీ విమోచనకు (విడుదల) కూడా ఒక ఉద్దేశ్యం ఉంది.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. (కొలొస్సయులకు 1:13)
చాలా మంది క్రైస్తవులు తమ విమోచనను పొందడంలో లేదా ఉంచుకోవడంలో విఫలమయ్యారు ఎందుకంటే వారు తమ విమోచన యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి మీరు మీ విమోచన యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో మీరు గమనించగలరు.
యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని భార్య తల్లిని (అత్తను) చూచెను. తరువాత ఆయన ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. (మత్తయి 8:14-15)
ఆమె అనారోగ్యంతో ఉంది, కానీ ఆమె స్వస్థత పొందిన క్షణం, ఆమె లేచి వారికి సేవ (ఉపచారము) చేసెను. 'వారు' అంటే యేసు మాత్రమే కాదు, ఆయనతో ఉన్న ప్రజలు కూడా. మీ విమోచన యొక్క ఉద్దేశ్యం ఆయనకు సేవ చేయడమే.
ధ్యానించుటకు కొని లేఖనాలు
కీర్తనలు 34 (బిగ్గరగా చదవండి)
గలతీయులకు 5:1
కీర్తనలు 107:6-7
2 పేతురు 2:9
గమనిక:
మిమ్మల్ని, మీ ఇంటిని, మీ ఆస్తులను మరియు మీ కుటుంబ సభ్యులను నూనెతో అభిషేకించండి. మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటిని కూడా నూనెతో అభిషేకించండి.
స్తుతి మరియు ఆరాధనతో ప్రారంభించండి. ప్రభువును ఆరాధిస్తూ కొంత సమయం (కనీసం 10 నిమిషాలు) గడపండి. (ఆరాధనకు సంబంధించిన పాటలు పాడండి లేదా మీకు ఆరాధించడంలో సహాయపడటానికి కొన్ని మృదువైన ఆరాధన సంగీతాన్ని వినండి)
Prayer
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అంశమును పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అంశానికి వెళ్లండి.
1. యేసు నామంలో నన్ను వెంబడించేవారిని వెంబడించే మరియు నా మీద దాడి చేసేవారిపై దాడి చేసే శక్తిని నేను పొందుకుంటున్నాను.
2. దుష్ట బలిపీఠాల వద్ద నా కుటుంబ సభ్యులకు మరియు నాకు వ్యతిరేకంగా సేవ చేసే ప్రతి సాతాను యాజకుడు, అగ్ని యొక్క తీర్పును పొందుకొని, యేసు నామంలో బూడిదగా కాలిపోవును గాక.
3. ఓ దేవా, యేసు నామంలో నా కుటుంబ చరిత్రను తిరిగి వ్రాయడానికి నన్ను ఉపయోగించు.
4. పూర్వీకుల ఆత్మలచే దొంగిలించబడిన నా దీవెనలన్నీ యేసు నామంలో అగ్ని ద్వారా నాకు తిరిగి వచ్చును గాక.
5. చీకటి రాజ్యంలో నాకు లేదా నా కుటుంబ సభ్యులకు ప్రాతినిధ్యం వహించే ఏదైనా వస్తువు, యేసు నామంలో తగలబడి బూడిదలో వేయును గాక.
6. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని యేసు నామములో నా పునాదిని పరిశుద్ధపరచుము. యేసు రక్తం, యేసు నామంలో నా పునాదులను శుద్ధకిరించు.
7. చెడు యొక్క శక్తి, యేసు నామంలో నా కుటుంబం మరియు నా మీద నీ పట్టును కోల్పోవును గాక.
8. నా శరీరంలో లేదా నా కుటుంబ సభ్యుల శరీరాల్లోకి ప్రవేశించిన ఏదైనా చెడు ఆహారం లేదా పానీయం యేసు నామంలో పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ద్వారా పరిశుద్ధపరచబడును గాక. (కొంత సేపు ఇలా చెబుతూ ఉండండి)
9. నా జీవితంలో, నా కుటుంబంలో మరియు భారత దేశంలో దేవుని కదలికకు ఆటంకం కలిగించే దుష్టుని యొక్క ప్రతి పన్నాగం యేసు నామంలో కత్తిరించబడును గాక.
10. 21 రోజుల ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటున్నా వ్యక్తుల కోసం ప్రార్థిస్తూ కొంత సమయం గడపండి, తద్వారా వారు ప్రభువును సేవించడానికి ప్రతి చెడు బానిసత్వం నుండి విడుదల పొందును గాక.
Join our WhatsApp Channel

Most Read
● 16 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన● 21 రోజుల ఉపవాసం: 12# వ రోజు
● 40 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● తిరస్కరణ మీద వియజం పొందడం
● నిలువు మరియు సమాంతర క్షమాపణ
● 21 రోజుల ఉపవాసం: 1# వ రోజు
● ఆయనకు సమస్తము చెప్పుడి
Comments