हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. పతనం నుండి విముక్తికి ప్రయాణం
Daily Manna

పతనం నుండి విముక్తికి ప్రయాణం

Thursday, 5th of October 2023
0 0 1103
2 సమూయేలు 11:1-5 ఆత్మసంతృప్తి, ప్రలోభం మరియు పాపం యొక్క అంతర్గత శత్రువులతో మానవుని యొక్క శాశ్వతమైన పోరాటం గురించి చెబుతుంది. దావీదు యొక్క ప్రయాణం, వరుస పొరపాట్ల ద్వారా గుర్తించబడింది, సరైన స్థలంలో, సరైన సమయంలో, సరైన మనస్తత్వంతో, దేవుని వాక్యానికి కట్టుబడి ఉండటం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తుంది.

1. సరైన స్థలంలో ఉండటం యొక్క ప్రాముఖ్యత
ఇశ్రాయేలు చరిత్రలో ఒక కీలకమైన సమయంలో దేవుని హృదయానుసారుడైన వ్యక్తి దావీదు తప్పుడు స్థానంలో ఉన్నాడు. రాజులు యుద్ధానికి వెళ్లే సమయం ఇది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి, అయినప్పటికీ దావీదు తన రాజభవనంలోనే ఉన్నాడు, అతడు యుద్ధభూమిలో లేకపోవడం అతని దైవిక పిలుపు నుండి వైదొలగడాన్ని గురించి సూచిస్తుంది. (2 సమూయేలు 11:1).

దేవుడు మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో అక్కడి నుండి మనల్ని మనం దూరం చేసుకున్నప్పుడు, మన ఆత్మలను దుర్బలత్వానికి గురిచేస్తాము. ఎఫెసీయులకు 6:12 మనకు గుర్తుచేస్తుంది, "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహ ములతోను పోరాడుచున్నాము." మన సముచితమైన స్థానం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటుంది, దేవుని సర్వాంగ కవచమును ధరించుకుంటాము.

2. సమయం యొక్క ప్రాముఖ్యత
దావీదు "సాయంత్రం అలసిపోయి" లేచాడు, ఇది ఆత్మసంతృప్తి మరియు ఆధ్యాత్మిక నిద్రను గురించి సూచిస్తుంది. దేవుని వేకువనే  వెదికే దావీదు (కీర్తనలు 63:1) తన ఆధ్యాత్మిక కాపలా నుండి బయటపడ్డాడని లేఖనం సూచిస్తుంది, అతడు మెలకువగా మరియు దేవుని ఉద్దేశాలతో సమకాలీకరించాల్సిన సమయంలో మధ్యాహ్నం ఆలస్యంగా లేచాడు.

దేవుని సమయాన్ని అర్థం చేసుకోవడం మరియు ఘనపరచడం చాలా ముఖ్యమైనది. ప్రసంగి 3:1, "తిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు." అని ప్రకటిస్తుంది. మన ఆధ్యాత్మిక చురుకుదనం మరియు దేవుని సమయపాలనతో మనల్ని శత్రువుల వలల నుండి రక్షించి నీతిమార్గంలో నడిపిస్తుంది.

3. సరైన ఆలోచనలను పెంపొందించడం
స్నానం చేస్తున్న ఒక స్త్రీ బత్షెబ వైపు దావీదు చూపు అతనిని హానికరమైన ఆలోచనల సుడిగుండంలో నెట్టింది. ప్రజల కంటే ఉన్నత స్థానంలో ఉండి, అతని ఉన్నతమైన వైఖరి ప్రలోభాలకు వేదికగా మారింది మరియు అతని ఆలోచనలు క్రూరంగా సాగాయి.

లేఖనాలు ఆలోచనల శక్తిని మరియు మన మనస్సులను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను గురించి నొక్కి చెబుతాయి. సామెతలు 4:23 ఇలా సలహా ఇస్తుంది, "నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము." మన ఆలోచనలు మన క్రియలను ఆకృతి చేస్తాయి మరియు వాటిని దేవుని వాక్యానికి అనుగుణంగా ఉంచడం అనేది నీతివంతమైన నడకను కొనసాగించడంలో ప్రధానమైనది.

విముక్తికి మార్గం
పడిపోవడం ద్వారా గుర్తించబడినప్పటికీ, దావీదు ప్రయాణం కూడా దేవుని విమోచన కృపకు నిదర్శనం. నాథానును ప్రవక్త ఎదుర్కొన్నప్పుడు, దావీదు యొక్క తక్షణ ఒప్పుకోలు మరియు నిజమైన పశ్చాత్తాపం దేవుని విశ్వాసానికి ప్రతిస్పందించే హృదయాన్ని వెల్లడిస్తాయి (2 సమూయేలు 12:13).

మన మార్గం, దావీదు మాదిరిగానే, పతనాలు మరియు విచలనాలను ఎదుర్కోవచ్చు, కానీ దేవుని కృప అనేది నిరీక్షణ యొక్క మార్గదర్శిని, పునరుద్ధరణ యొక్క మూలం. 1 యోహాను 1:9 ఇలా సెలవిస్తుంది, "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును." మన నిష్కపటమైన పశ్చాత్తాపంలో, మనం దేవుని అపరిమితమైన కృపను ఎదుర్కొంటాము మరియు పునరుద్ధరణ మరియు పవిత్రీకరణ యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తాము.

ప్రయాణం కోసం పాఠాలు
దావీదు జీవితం అప్రమత్తత, వినయం మరియు పశ్చాత్తాపం గురించి కలకాలం పాఠాలను అందిస్తుంది. మన ఆధ్యాత్మిక రక్షణను కాపాడుకోవడం, దేవుడు నియమించిన సమయంలో సరైన స్థలంలో ఉండటం మరియు దేవుని వాక్యంపై కేంద్రీకృతమై ఉన్న మనస్సును పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను అతని పడిపోవటం గురించి నొక్కిచెప్పాయి.

ఈ భూమిపై మన ప్రయాణాన్ని సమర్థవంతంగా నడవడానికి, మనం నిరంతరం దేవుని వాక్యంలో లీనమై ఉండాలి, దానిని మన పాదాలకు దీపంగా మరియు మన మార్గానికి వెలుగుగా ఆలింగనం చేసుకోవాలి (కీర్తనలు 119:105). ప్రార్థన ద్వారా దేవునితో క్రమం తప్పకుండా సహవాసం చేయడం మన ఆత్మలను బలపరుస్తుంది, దేవుని స్వరం మరియు మార్గదర్శకత్వంతో మనల్ని ఉంచుతుంది

Prayer
తండ్రీ, నీ విస్తారమైన ప్రేమ మరియు దయను ఎప్పటికీ గుర్తిస్తూ, అప్రమత్తమైన హృదయాలతో, పవిత్రమైన మనస్సులతో మరియు విముక్తి పొందిన ఆత్మలతో మా ప్రయాణాన్ని నడవడానికి మాకు నీ కృపను దయచేయి. యేసు నామములో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● 01 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● సరైన బంధాలను ఎలా నిర్మించుకోవాలి
● ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
● మీ ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నూతనముగా చేయాలి - 1
● నిత్యమైన పెట్టుబడి
● నుండి లేచిన ఆది సంభూతుడు
● దొరికిన గొఱ్ఱెపిల్ల యొక్క ఆనందం
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login