हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. 12 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
Daily Manna

12 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన

Friday, 22nd of December 2023
3 0 1162
Categories : ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
ఇది నా అసాధారణమైన అభివృద్ధి యొక్క సమయము

11యెహోవా మందసము మూడునెలలు గిత్తీయుడగు ఓబేదె దోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటివారినందరిని ఆశీర్వదించెను. 12దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొని వచ్చెను. (2 సమూయేలు 6:11-12)

పాత నిబంధనలో, దేవుని మందసము ఆయన ప్రజల మధ్య దేవుని సన్నిధి గురించి సూచిస్తుంది. కొత్త నిబంధనలో, దేవుని సన్నిధి మందసానికి మాత్రమే పరిమితం కాలేదు; మన శరీరము ఇప్పుడు దేవుని యొక్క ఆలయం (1 కొరింథీయులకు 6:19-20). ఓబేదె దోము జీవితంలో దేవుని సన్నిధి మూడు నెలల్లో అతని జీవితాన్ని మార్చగలిగితే, మీ జీవితంలో దేవుని సన్నిధి మీకు అసాధారణమైన అభివృద్ధులను అందించగలదు. దేవుని సన్నిధి ఇప్పటికీ శక్తివంతమైనది మరియు ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు. క్రీస్తు కొత్త నిబంధనలో దేవుని సన్నిధి గురించి సూచించాడు మరియు ఆయన కనిపించినప్పుడల్లా, అసాధారణమైన అభివృద్ధి అక్కడ ఎల్లప్పుడూ ఒక నమోదు అనేది ఉంటుంది.

అసాధారణమైన అభివృద్ధిని ఆనందించడం అంటే ఏమిటి?

1. అసాధారణమైన అభివృద్ధి అనేది మీ జీవితంలో లేదా కుటుంబ వంశంలో ఇంతకు ముందెన్నడూ జరగని సంగతులు.
 
2. అసాధారణమైన అభివృద్ధి అంటే ఒక పరిస్థితిలో దేవుని యొక్క అద్భుత కార్యాలను ఆస్వాదించడం.

3. అసాధారణమైన అభివృద్ధి అనేది గుర్తించదగినది మరియు తిరస్కరించలేని విజయం, సాక్ష్యం మరియు సాధకం.

4. మార్గము లేని చోట దేవుడు ఒక మార్గాన్ని సృష్టించడం దీని యొక్క అర్థము.

అసాధారణ అభివృద్ధి యొక్క బైబిలు ఉదాహరణలు

1. అప్పు రద్దు కోసం ఆర్థిక సాధికారత
2 రాజులు 4:1-7లో, విధవరాలు అసాధారణమైన అభివృద్ధిని ఎదుర్కొంది మరియు అప్పు విముక్తురాలైంది. దేవుని అభిషేకం మిమ్మల్ని అప్పుల ఊబి నుండి బయటపడేసేంత శక్తివంతమైనది. నేను మీ జీవితము మీద ఆజ్ఞాపిస్తున్నాను; యేసు నామములో ఇది మీ అసాధారణ అభివృద్ధి యొక్క సమయం.

2. అవమానం కృపతో కప్పబడి ఉంటుంది
కొత్తగా పెళ్లయిన జంటలు మరియు వారి కుటుంబ సభ్యుల మీద పడే అవమానాన్ని యేసు సన్నిధి కప్పివేసింది. నీటిని ద్రాక్షారసముగా మార్చిన అద్భుతం అసాధారణమైన అభివృద్ధి. (యోహాను 2:1-12). దేవుని సన్నిధి వ్యత్యాసాన్ని కలిగిస్తుంది మరియు అది అవమానాన్ని మరియు నిందను తొలగిస్తుంది.

అసాధారణ అభివృద్ధిని ఎలా ఆనందించాలి?

1. ఏదైనా కార్యం జరిగే వరకు ప్రార్థించండి
ప్రార్థన ఒక పరిస్థితిలో దేవుని శక్తిని ఆహ్వానిస్తుంది; అది అసాధ్యాలను సుసాధ్యాలుగా మారుస్తుంది. ప్రార్థన చేయడానికి మనిషి ఉంటే, సమాధానం ఇవ్వడానికి దేవుడు కూడా ఉన్నాడు.


17ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 18అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్ష మిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. (యాకోబు 5:17-18)

2. దేవుని వాక్యానికి విధేయత చూపడం
విధేయత మిమ్మల్ని అసాధారణమైన అభివృద్ధికై సిద్దపరుస్తుంది. మీ విధేయత స్థాయి మీ అభివృద్ధి స్థాయిని నిర్ణయిస్తుంది.

సీమోను, "ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని" ఆయనతో చెప్పెను. (లూకా 5:5)

"ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను." (యోహాను 2:5)

మన దేవుడు దహించే అగ్ని, మరియు ఆయన అగ్ని ద్వారా సమాధానమిచ్చే దేవుడు (1 రాజులు 18:24, హెబ్రీయులకు 12:29). దేవుని నుండి సమాధానం అనుకోకుండా వస్తుంది. మీ ప్రార్థనలు మరియు ఉపవాసాలన్నీ వ్యర్థం కావు; యేసు నామములో మీ జీవితంలో దేవుని మహిమను ప్రకటించే సాక్ష్యాలను మీరు పొందుకుంటారు.

3. ఎన్నడూ వెనకడుగు వేయదు 
మీరు దేవుని యందు సమస్త సమకూర్చే దేవునిగా విశ్వసించకపోతే, మీరు అసాధారణమైన అభివృద్ధులను ఆస్వాదించలేరు. నిస్సహాయ పరిస్థితుల్లో కూడా, మీరు ఆశాజనకంగా ఉండాలి; జీవితాలను మార్చడానికి దేవుడు ఈ విధంగా చేయగలడు. విశ్వాసం ఎల్లప్పుడూ అసాధారణమైన అభివృద్ధి కోసం మిమ్మల్ని ఉంచుతుంది. ఎన్నడూ వెనకడుగు వేయదు.

 
18నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 19మరియు అతడు విశ్వాసమునందు బల హీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భéమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, 20అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక 21దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. (రోమీయులకు 4:18-21)
Prayer
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. తొందరపడకండి.

1. తండ్రీ, యేసు నామములో దాచి ఉంచబడిన అవకాశాల కొరకు నా కనులను తెరువు. (ఎఫెసీయులకు 1:18)

2. యేసు నామములో నా అభివృద్ధిని నిరోధించే ప్రతి కోటను నేను క్రిందకు పడవేయబడును గాక. (2 కొరింథీయులకు 10:4)

3. యేసు నామములో నా విధిని దెబ్బతీసే ప్రతి బంధం నుండి నన్ను నేను దురపరచుకుంటున్నాను. (2 కొరింథీయులకు 6:14)

4. ప్రభువా, యేసు నామములో అసాధారణమైన అభివృద్ధికై నాకు జ్ఞానము దయచేయి. (యాకోబు 1:5)

5. తండ్రీ, యేసు నామములో ఆర్థిక, వైవాహిక మరియు అసాధారణమైన అభివృద్ధి నాకు దయచేయి. (యిర్మీయా 29:11)

6. సాక్ష్యాలను నాకు నిరాకరించాలని కోరుకునే ఏ శక్తి అయినా పరిశుద్ధాత్మ అగ్నిచే నాశనం చేయబడును గాక. (యెషయా 54:17)

7. నా తదుపరి స్థాయికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏ బలమైన వ్యక్తి అయినా, యేసు నామములో నిర్బంధములో ఉండను గాక. (మత్తయి 12:29)

8. ప్రభువా, యేసు నామములో నా కుటుంబానికి మరియు నాకు ఆశీర్వాదం యొక్క నూతన తలుపులను తెరువు. (ప్రకటన 3:8)

9. యేసు నామములో ఈ సమయములో సమస్త అభివృద్ధిని నేను పొందుకుంటున్నాను. (కీర్తనలు 84:11)

10. నా సాక్ష్యాన్ని మరియు విధిని మళ్లించడానికి ఉండే ప్రతి శక్తి లక్ష్యంగా చేసుకుంటే, నేను నిన్ను యేసు నామములో నాశనం చేస్తున్నాను. (లూకా 10:19)

11. నా అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏదైనా బలిపీఠం యేసు నామములో పడవేయబడును గాక. (న్యాయాధిపతులు 6:25-27)

12. ఏ శక్తి అయినా, నా విధికి వ్యతిరేకంగా మాట్లాడితే, యేసు నామములో మౌనంగా ఉండను గాక. (యెషయా 54:17)

13. యేసు నామములో నా విధి రద్దు చేయబడదు. (యిర్మీయా 1:5)

14. యేసు నామములో నా మంచి నిరీక్షణలు తగ్గించబడవు. (సామెతలు 23:18)

15. ఓ దేవా, నన్ను, నా కుటుంబ సభ్యులను, పాస్టర్ మైఖేల్ గారిని మరియు బృందాన్ని యేసు నామములో అభిషేకం యొక్క ఉన్నత స్థాయికి తీసుకెళ్లు. (1 సమూయేలు 16:13)

16. తండ్రీ, యేసు నామములో అసాధారణమైన అభివృద్ధి కోసం నన్ను శక్తివంతం చేయి. (అపోస్తుల కార్యములు 1:8)

17. యేసు నామములో, ఇది నా అసాధారణమైన అభివృద్ధి యొక్క సమయం. (కీర్తనలు 75:6-7)

18. యేసు నామములో, నేను పోగొట్టుకున్నవన్నీ వెంబడిస్తున్నాను, విజయం పొందుతున్నాను మరియు తిరిగి పొందుకుంటాను, యేసు నామములో. (1 సమూయేలు 30:8)

19. ఓ దేవా, ఈ 40-రోజుల ఉపవాసములో నన్ను మరియు ప్రతి ఒక్కరినీ శక్తివంతం చేయి. (యెషయా 40:31)
 
20. నేను ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో నా మంచి కోసం ప్రతిదీ కలిసి పనిచేయడం ప్రారంభించబడును గాక. (రోమీయులకు 8:28)

Join our WhatsApp Channel


Most Read
● ఇటు అటు సంచరించడం ఆపు
● ధారాళము యొక్క ఉచ్చు
● యేసు శిశువుగా ఎందుకు వచ్చాడు?
● దేవుని కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండడం
● దేవుని మహిమపరచండి మరియు మీ విశ్వాసాన్ని ఉత్తేజపరచండి
● కృప ద్వారా రక్షింపబడ్డాము
● రక్తంలోనే ప్రాణము ఉంది
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login