हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. 10 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
Daily Manna

10 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన

Wednesday, 20th of December 2023
2 1 1052
Categories : ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
దైవ మార్గమును (నిర్దేశమును) ఆనందించుట

నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. (కీర్తనలు 32:8)

దేవుడు మనల్ని చీకట్లో వదిలిపెట్ట లేదు. మనల్ని సరైన మార్గములో నడిపించడానికి ఆయన పూర్తిగా కట్టుబడి ఉన్నాడు. ఆయన మనలను నడిపించాలని మనము కోరుకుంటే, మనము "సమ్మతించి మరియు విధేయతతో" ఉండాలి (యెషయా 1:19). ఆయన మనలను  మంచి ప్రవర్తన గల స్వేచ్ఛా ప్రతినిధిగా సృష్టించినందున ఆయన మార్గాన్ని వెంబడించుమని బలవంతం చేయడు. మనము కలిగి ఉండటానికి మంచి ఎంపికలు ఉన్నాయి మరియు ప్రతి ఎంపికకు పరిణామాలు లేదా ఆశీర్వాదాలు ఉంటాయి.

ప్రత్యామ్నాయాల మధ్య ఎంచుకోవడానికి మనందరికీ దైవ మార్గము అవసరం; దైవ మార్గము లేకుండా, మనము ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకోలేము. సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో, వ్యాపార పెట్టుబడులు పెట్టడంలో మరియు మన అనుదిన జీవితాన్ని గడపడంలో మనకు దైవ మార్గము అవసరం. దైవ మార్గము లేకపోవడంతో చాలామంది మరణపు ఉచ్చులోకి వెళ్లిపోయారు. విమాన ప్రమాదం నుండి తప్పించుకున్న ప్రజల గురించి నేను చాలా సంగతులు విన్నాను, ఎందుకంటే విమానమును వదలిపెట్టడానికి వారు నడిపించబడ్డారు.

దైవ మార్గము మీరు ఈ విషయములో ఉండేలా చేస్తుంది

సరైన స్థలములో
సరైన సమయంలో
సరైన పని చేయడంలో
సరైన వ్యక్తులను కలవడంలో 

దైవ మార్గము వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

1. మీరు మరణం మరియు చెడు నుండి తప్పించుకుంటారు
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను 
ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు 
నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును. (కీర్తనలు 23:4)

2. మీరు మరుగైన ధనమునుకై నడిపించబడుతారు
పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను 
నేనేయని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను 
రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను. (యెషయా 45:3)

3. మీరు అధిక అధికారంలో కార్యం చేస్తారు
దైవ మార్గమునకు మన విధేయత మనల్ని అధికార వ్యక్తులుగా ఉంచుతుంది. మీరు అధికారంలో లేకుంటే, మీరు అధికారాన్ని ఉపయోగించలేరు. మనం దేవునికి లోబడినప్పుడు అపవాది మన అధికారాన్ని గుర్తిస్తాయి. (యాకోబు 4:7), (మత్తయి 8:9-11)

దైవ నడిపింపును మనము ఎలా ఆనందించవచ్చు?

1. మీ చిత్తము దేవునికి లోబడి ఉండాలి
"ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతి దినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను." (లూకా 9:23)
నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. (యోహాను 5:30)

గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.(1 కొరింథీయులకు 9:27)

2. మీ ప్రణాళికలను దేవునికి అప్పగించండి మరియు ఆయనకై వేచి ఉండండి
మీరు వినాలనుకుంటే, మీరు వేచి ఉండటం నేర్చుకోవాలి. మీరు దేవునితో మాట్లాడటానికి తొందరపాటు చేయకండి. దేవుడు తన ప్రతిస్పందనను ఆలస్యం చేసినప్పుడల్లా, అది మీ సహనాన్ని పరీక్షిస్తుంది. దేవుడు తన ప్రతిస్పందనలో చాలా నెమ్మదిగా ఉన్నాడని భావించిన సౌలు తొందరపాటుతో వ్యవహరించాడు, అది కూడా అతని తిరస్కరణకు దోహదపడింది. (1 సమూయేలు 13:10-14)

ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును 
యెహోవా వాని నడతను స్థిరపరచును. (సామెతలు 16:9)

3. ఆత్మలో ప్రార్థించండి
మన బలహీనతలలో ఒకటి ఏమిటంటే, మనం తెలుసుకోవలసినది మనకు తెలియకపోవడం. మనము భాషలో ప్రార్థించినప్పుడల్లా, మన జ్ఞానము మరియు వివేకమునకు మించిన సంగతుల మీద పరిశుద్ధాత్మ సహాయం మీద ఆధారపడి ఉంటాము. మీకు దైవ నిర్దేశము అవసరమైనప్పుడల్లా, ఆత్మలో ప్రార్థిస్తూ కొంత సమయం గడపండి, మీ ఆత్మీయ మనిషికి స్పష్టత ఇవ్వబడుతుంది.

26 అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతొ 27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దుల కొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు. (రోమీయులకు 8:26-27)

దేవుడు మనలను నడిపించే వివిధ మార్గాలు

1. వాక్యము
దేవుని వాక్యమే ఆయన నడిపింపుకు ప్రధాన మూలం. వ్రాయబడిన వాక్యం మొదట మాట్లాడిన వాక్యం. దేవుడు దానిని గ్రంథకర్త హృదయాలతో మాట్లాడాడు. వ్రాయబడిన వాక్యం మాట్లాడే వాక్యము వలె శక్తివంతమైనది. వ్రాయబడిన వాక్యాన్ని అధ్యయనం చేయండి మరియు మీ ఆత్మ ప్రత్యక్షత వాక్యాన్ని (రీమా) పొందుతుంది. (యోహాను 1:1)

2. అంతర్గత సాక్ష్యం మరియు పరిశుద్ధాత్మ స్వరము
మీరు చేయబోయే నిర్ణయానికి సంబంధించి మీ ఆత్మలో అంతర్గత సాక్ష్యం అనేది ఒక నిశ్చయము. ఆంతరంగిక సాక్ష్యం మీ ఆత్మలో ఆకుపచ్చ లైట్, పసుపు లేదా ఎరుపు లైట్ వంటిది. కొన్నిసార్లు మీ నిర్ణయం పట్ల ప్రశాంతత ఉండవచ్చు; ఇతర సమయాల్లో, మీరు భయపడవచ్చు లేదా మీరు నిర్ణయించుకునే ముందు విశ్రాంతి తీసుకోవచ్చు. వీటిలో చాలా వరకు "అంతర్గత సాక్ష్యం" అని పిలువబడతాయి. ఆంతరంగిక సాక్ష్యాన్ని తెలుసుకోవడం మరియు పాటించడంలో మీరు నేర్చుకోవాలి మరియు శిక్షణ పొందాలి.

మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. (రోమీయులకు 8:16)
దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. (రోమీయులకు 8:14)

3. జ్ఞానము గల వ్యక్తి యొక్క సలహా
యిత్రో మోషేకు తెలివైన సలహా ఇచ్చాడు మరియు ప్రజలను నడిపించడములో అనుదిన ఒత్తిడిని అధిగమించడానికి అది అతనికి సహాయపడింది.

కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు తేవలెను. (నిర్గమకాండము 18:19)

4. దేవదూతల ప్రత్యక్షత
దేవదూతలు అప్పుడప్పుడు ఆదేశాలు ఇవ్వడానికి కనిపిస్తారు, కానీ దేవదూతల రూపాన్ని వెతకడంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనలను నడిపించాలని కోరుకునే ప్రాథమిక మార్గం ఆయన వాక్యము మరియు ఆయన ఆత్మ ద్వారా. ఏదైనా దేవదూతల ప్రత్యక్షత తప్పనిసరిగా దేవుని వాక్యం యొక్క అధికారానికి లోబడి ఉండాలి. దేవదూత చెప్పినది వాక్యంతో ఏకీభవించకపోతే, మనం అలౌకిక ప్రత్యక్షతను విస్మరించి, వాక్యానికి కట్టుబడి ఉండాలి. దేవదూతలు మనకు కనిపిస్తారా అని నిర్ణయించేది దేవుడు, దేవదూతల ప్రత్యక్షత కొరకు లేదా నడిపించడం కొరకు మనం ప్రార్థించకూడదు.
3 పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చికొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. 4 అతడు దూత వైపు తేరి చూచి భయపడిప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. 5 ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము; 6 అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను. 7 అతనితో మాటలాడిన దూతవెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి (అపొస్తలుల కార్యములు 10:3-7)

5. కలలు మరియు దర్శనాలు
మన ఆత్మ ఆయనతో సమ్మతము అయినప్పుడు మనం దేవుని నుండి దైవ నడిపింపును పొందగలము.
"తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును; 
మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; 
మీ ముసలివారు కలలుకందురు, మీ యవనులు దర్శనములు చూతురు." (యోవేలు 2:28)
 
నేటి నుండి, మీరు యేసు నామములో దైవ నిర్దేశాన్ని ఆనందించడం ప్రారంభించుదురు గాక.

తదుపరి అధ్యయనం: ద్వితీయోపదేశకాండము 32:12-14, సామెతలు 16:25,
Prayer
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. తొందరపడకండి.

1. ఓ దేవా, యేసు నామములో నీ ఆత్మ నాతో ఏమి చెబుతుందో వినడానికి నా చెవులు తెరవబడును గాక. (ప్రకటన 2:7)

2. తండ్రీ, నేను నిన్ను ఎక్కువగా తెలుసుకునేలా నీ జ్ఞానము మరియు వివేచన యొక్క ఆత్మను యేసు నామములో నాకు దయచేయి. (ఎఫెసీయులకు 1:17)

3. ప్రభువా, యేసు నామములో నీ చిత్తము నా జీవితములో నెరవేరును గాక. (మత్తయి 6:10)

4. ప్రభువా, వెంబడించడానికి సరైన మార్గాన్ని నాకు చూపించు. (మత్తయి 6:10)

5. ప్రభువా, నీ చిత్తానికి వెలుపల ఉన్న ఏదైనా తప్పుడు నిర్ణయం లేదా మార్గము నుండి తిరుగులేని నాకు యేసు నామములో సహాయం చేయి. (సామెతలు 3:5-6)

6. ప్రభువా, నా ఆధ్యాత్మిక కన్నులను మరియు చెవులను తెరువు, తద్వారా నేను నా జీవితంలో మంచి మరియు చెడు ఎంపికలను గుర్తించగలను. (ఎఫెసీయులకు 1:18)

7. నన్ను తప్పుదారి పట్టించాలనుకునే మరియు దేవుని నుండి నన్ను దూరం చేయాలనుకునే పొరపాటు ఆత్మ యొక్క కార్యాలను నేను కుంటిపడేలా చేస్తున్నాను. (1 యోహాను 4:6)

8. తండ్రీ, నేను ఏ రంగములోనైనా నీ స్వరమునకు అవిధేయత చూపి యుంటే దయచేసి నన్ను క్షమించు. (1 యోహాను 1:9)

9. నా కల జీవితము, యేసు నామములో సజీవంగా ఉండును గాక. (యోవేలు 2:28)

10. నేను నా కల జీవితంలో సాతాను యొక్క అవకతవకలను యేసు నామములో ఆపేస్తున్నాను. (2 కొరింథీయులకు 10:4-5)

11. తండ్రీ, దయచేసి నాకు అనుదిన క్రైస్తవ జీవనం కోసం జ్ఞానము మరియు వివేచన యొక్క ఆత్మను దయచేయి. (యాకోబు 1:5)

12. నా చెవులకు అడ్డుగా ఉన్న ఏదైనా, యేసు నామములో తొలగించబడును గాక. (మార్కు 7:35)

13. దైవ నడిపింపుకు భ్రమపరచు మరియు మొండితనము యొక్క ఆత్మను నేను యేసు నామములో వ్యతిరేకిస్తున్నాను. (1 కొరింథీయులకు 14:33)

14. ప్రభువా, నీ వెలుగు ద్వారా, నా దీవెనల స్థలములో నా మార్గములను యేసు నామములో ఆదేశించు. (కీర్తనలు 119:105)

15. ఓ దేవా, యేసు నామములో నన్ను తప్పుదారి పట్టించే అపవాది ద్వారా నా జీవితం చుట్టూ నాటిన ప్రతిదీ విధ్వంసము అవును గాక. (మత్తయి 15:13)


Join our WhatsApp Channel


Most Read
● మీ మనస్సును క్రమశిక్షణలో పెట్టండి
● మాదిరి కరంగా నడిపించబడుట
● క్రైస్తవులు వైద్యుల వద్దకు వెళ్లవచ్చా?
● కృపలో అభివృద్ధి చెందడం
● ఇతరుల పట్ల కృపను విస్తరింపజేయండి
● దేవుడు ఇచ్చుకల
● క్రైస్తవులు దేవదూతలను ఆజ్ఞాపించవచ్చా?
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login