हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. బైబిలును ప్రభావవంతంగా ఎలా చదవాలి
Daily Manna

బైబిలును ప్రభావవంతంగా ఎలా చదవాలి

Wednesday, 31st of January 2024
0 0 1357
Categories : దేవుని వాక్యం (Word of God) బైబిలు (Bible)
నేను వచ్చు వరకు చదువుటయందును జాగ్రత్తగా ఉండుము. (1 తిమోతికి 4:13)

అపొస్తలుడైన పౌలు తిమోతికి (అతను శిక్షణ ఇస్తున్నాడు) సరళమైన మరియు సమర్థవంతమైన సలహా ఏమిటంటే, క్రమంగా లేఖనాలను చదవడం.

బైబిలును పట్టుకొని యాదృచ్ఛికంగా తెరిచేవారు చాలా మంది ఉన్నారు. అప్పుడు వారు తమ కోసం ప్రభువు నుండి వచ్చిన సందేశమని నమ్మి, లేఖనంలోని భాగాన్ని చదవడం లేదా పొందుకొవడం చేయడం కొనసాగిస్తారు. ఇందులో తప్పు ఏమీ లేనప్పటికీ, పై అభ్యాసం చేయడం ద్వారా, మీరు దేవుని వాక్యాన్ని గురించిన మీ జ్ఞానాన్ని పొందలేరు. కాలక్రమేణా, మీరు అదే అధ్యాయం లేదా లేఖనంలోని భాగాన్ని తెరచిన దానితో ముగించవచ్చు.

మీరు ఈ పద్ధతిలో బైబిలు చదవడం మానేయడానికి మరొక కారణం,
"మీ వేలు వంటి పద్యం మీద పడ్డట్లయితే"
"..... యూదా వెళ్లి ఉరి వేసుకున్నాడు" (మత్తయి 27:5) "బేతేలుకు వచ్చి పాపము చేయి...." (ఆమోసు 4:4)

మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం మరియు ఇతరుల కోసం ఖచ్చితంగా మీరు అలాంటి వాక్యలను పొందుకొవడం చేయలేరు. ఇప్పుడు మీరు ఈ పద్ధతిలో చేస్తుంటే దయచేసి మిమ్మల్ని మీరు తగ్గించుకొకండి. నిజమేమిటంటే, చాలా మంది దేవుని గొప్ప దాసులు మరియు దాసీలు తమ జీవితంలో ఒకానొక సమయంలో ఇలా చేసారు, కానీ వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు - అలాగే మీరు కూడా చేయవచ్చు.

చాలా తరచుగా, ప్రజలు బైబిలు చదవడం ప్రారంభించి, దాని నుండి బయట పడతారని కూడా నేను కనుగొన్నాను. మీరు బైబిలు పఠన ప్రణాళికను కలిగి ఉంటే పైన పేర్కొన్నవన్నీ నివారించవచ్చు.

365 శిష్యుల ప్రణాళిక (నోహ్ యాప్‌లో ఉంది) వంటి బైబిలు పఠన ప్రణాళిక ఒక సంవత్సరంలో బైబిల్ను పూర్తి చేయడంలో మీకు సహాయం చేస్తుంది. ఇది మీరు ఏకాగ్రతతో ఉండడానికి సహాయం చేస్తుంది మరియు మీరు సులభంగా నిర్వహించగలిగే భాగాలలో మొత్తం బైబిల్ను చదవడానికి మీకు దోహదపడుతుంది. ఇది నేను దేవుని వాక్యంలో ఎదగడానికి కారణమైన ఒక విషయం, మరియు ఈ రోజు నేను ఈ సరళమైన కానీ ప్రభావవంతమైన రహస్యాన్ని మీతో పంచుకుంటున్నాను.

అందుకాయన మనుష్యుడు రొట్టెషవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. (మత్తయి 4:4)

క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన(నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి. (1 పేతురు 2:3)

మనం శారీరక ఆహారం తీసుకున్నప్పుడు, ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన పోషకాలు మనకు అందుతాయి. అలాగే, బైబిలును రోజూ ఒక క్రమపద్ధతిలో చదవడం వల్ల మీరు ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకుంటారు. ఇది మీరు త్వరగా ఎదగడానికి కూడా కారణమవుతుంది.

అలాగే, మీరు మీ బైబిల్ను పరిశీలిస్తున్నప్పుడు, నిశ్శబ్దంగా ఈ ప్రశ్నలను అడగండి
  • నేను ఆచరణలో పెట్టవలసిన ఆజ్ఞ ఇక్కడ ఉందా?
  • ఇది నా కోసం, నా కుటుంబం కోసం నేను పొందుకొవల్సిన వాగ్దానామా?
  • నేను ఈ వాక్యం నాకు, కుటుంబం, ఇతరుల కోసం ప్రార్థన అంశముగా ఉపయోగించవచ్చా?
ఎవరో ఇలా సరిగ్గా అన్నారు, "బైబిలు మనకు తెలియజేయడానికి మాత్రమే కాదు, మనల్ని మార్చడానికి ఇవ్వబడింది."
Prayer
తండ్రీ, నీ వాక్యం నుండి అద్భుతమైన విషయాలను చూడడానికి నా కళ్ళు తెరువు. యేసు నామంలో.
 
తండ్రీ, నేను రోజూ నీ వాక్యాన్ని చదివేటప్పుడు కూడా నాతో మాట్లాడుతున్న నీ స్వరం వినడానికి నా చెవులను తెరువు. యేసు నామంలో.
 
తండ్రీ, ప్రతిరోజూ వాక్యాన్ని చదవడానికి మరియు ఒక సంవత్సరంలో బైబిలు పూర్తి చేయడానికి నీ కృపను నాకు దయచేయి. యేసు నామంలో. ఆమెన్.



Join our WhatsApp Channel


Most Read
● పవిత్రునిగా చేసే నూనె
● ప్రాణముకై దేవుని ఔషధం
● మీరు ప్రభువును వ్యతిరేకిస్తున్నారా?
● మీరు సులభంగా గాయపరచబడుతారా?
● విజయానికి పరీక్ష
● మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు - 2
● వివేచన v/s తీర్పు
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login