हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. దోషము యొక్క శక్తిని విచ్ఛిన్నం చేయడం - I
Daily Manna

దోషము యొక్క శక్తిని విచ్ఛిన్నం చేయడం - I

Sunday, 17th of March 2024
2 0 986
Categories : పాపం (Sin)
ప్రతి కుటుంబానికి తమ కుటుంబ చరిత్రలో దోషము ఉంటుంది.

దోషము అంటే ఏమిటి?
దోషము అనేది పూర్వీకుల నుండి కుటుంబంలో పనిచేస్తున్న పాపాల ఫలితం. తరతరాలుగా ఒకే రకమైన పాపాలను మనం చూడడానికి ఇది ఒక ప్రధాన కారణం.

ఇప్పుడు బైబిల్లో పాపానికి చాలా పదాలు ఉన్నాయి, కానీ నేను ముఖ్యమైన మూడింటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

#1 "హమార్టియా" అంటే "గుర్తు (చిహ్నం) మిస్ అవ్వడం"
ఒక విలువిద్య పోటీలో షూటింగ్ మరియు లక్ష్యం యొక్క గురి తప్పడం వల్ల, బహుమానం లేదా ఆశీర్వాదం పొందడంలో విఫలమయ్యాడు. ఇది పాపానికి సంబంధించిన సాధారణ గ్రీకు పదం మరియు కొత్త నిబంధనలో దాదాపు 221 సార్లు ఉపయోగించబడింది.

"పాపం (హమార్టియా) చాలా తేలికగా మనల్ని చుట్టుముట్టింది". (హెబ్రీయులకు 12:1). మనము దేవుని ఉత్తమమైన వాటిని లక్ష్యంగా చేసుకున్నాము, కానీ దానిని కోల్పోతున్నాము.

#2 "పరాబాసిస్" అంటే "అతిక్రమము"
అతిక్రమించడం అంటే ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని (ధర్మశాస్త్రాన్ని) ఉల్లంఘించడం. దేవుడు "ఇసుకలో గీత గీసినప్పుడు", ఉద్దేశపూర్వకంగా "అడుగు వేయడం" ద్వారా మనం గొప్ప బహుమానములు మరియు ఆశీర్వాదాలను కోల్పోవచ్చు.

"ప్రతి అతిక్రమమును (పరాబాసిస్) మరియు అవిధేయతయు (పారాకో) న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా". (హెబ్రీయులకు 2:2)

అలవాటుగా అతిక్రమించడం పాపాన్ని మీలో సగభాగం చేస్తుంది; మీ స్వభావంలో ఒక భాగం; మీ DNAలో ఒక భాగం. ఈ దశలో, అది దోషము అవుతుంది.

#3 "అనోమియా" అంటే అధర్మం
"సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించడానికి, యేసయ్య తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను." (తీతుకు 2:14)
అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో, "ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రదుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను" (ఆదికాండము 12:10-13)

శారయి తన సోదరి అని చెప్పడానికి అబ్రాహాము ఒక పథకం వేశాడు, తద్వారా అతడు చంపబడకుండా తప్పించుకున్నాడు. ఇది ఒక్కసారి కాదు, అబ్రాహాము రెండవసారి చేసాడు.

అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారాను, "గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను." (ఆదికాండము 20:2)

అబ్రాహాముకు ఉన్న భయమే అతడు అలా చేయడానికి కారణమైంది. ఇలా చేయడం ద్వారా శారాను రాజ్య ప్రజలు తమ భార్యగా చేసుకోవాలనుకునే ప్రమాదకరమైన స్థితిలో ఉంచాడు.

శారా రక్షించబడకపోతే, ఆమె విత్తనం అపవిత్రమయ్యేది. అయినప్పటికీ, శారాను సమస్త హాని నుండి రక్షించినవాడు ప్రభువే. అబ్రాహాము వివాహమును రక్షించినవాడు ప్రభువే.

చాలా సంవత్సరాల తర్వాత, ఇస్సాకు జన్మించిన తర్వాత, అతడు కూడా అదే పాపం చేయడం మనం గమనించగలము.

ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ తోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె యెవరని అడిగినప్పుడు అతడు, "ఆమె నా సహోదరి అని చెప్పెను;" ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ తోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. (ఆదికాండము 26:6-7)

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అబ్రాహాము అవకతవకలను చేసినప్పుడు ఇస్సాకు అప్పటికి ఇంకా పుట్టలేదు అయినను అతడు అదే తప్పును పునరావృతం చేశాడు.

ఉపదేశించబడకుండా, ఏ విధంగానూ సహజంగా ప్రభావితం చేయబడకుండా లేదా ఒప్పించబడకుండా, ఇస్సాకు తన తండ్రి చేసిన అదే పాపాలకు బలైపోతాడు. అతడు తన తండ్రి చేసిన పాపాలను పునరావృతం చేస్తాడు.

దోషము చేసేది ఇదే. తరతరాలుగా తండ్రుల పాపాలు మళ్లీ మళ్లీ పునరావృతం అయ్యేలా చేస్తుంది. తండ్రి బాటలో పడిన అదే పాపాలతో వరుసగా తరాలను ప్రలోభపెట్టే అధికారయుక్తమైన హక్కును ఇది దుష్టునికి కలుగజేస్తుంది.

ఈ రోజు యేసు నామంలో మీ జీవితం మీద ఉన్న దోషము యొక్క శక్తి విచ్ఛిన్నమవుతుంది.
Confession
ఆయన చిందించిన రక్తం ద్వారా నా పాపాలకు ప్రాయశ్చిత్తము కలుగడానికి మరియు కల్వరి సిలువపై గాయపడి మరియు రక్తం కారుతున్న అయన శరీరం ద్వారా మన పాపాలకు మరియు దోషాలకు శిక్షను భరించడానికి: నా స్థానంలో చనిపోవడానికి నీ ఏకైక కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును పంపినందుకు వందనాలు, తండ్రీ. 

నేను ఇప్పుడు నన్ను మరియు నా కుటుంబ సభ్యులందరినీ యేసు యొక్క విలువైన రక్తంతో కప్పుతున్నాను.

నాకు తెలిసిన మరియు తెలియని విగ్రహారాధనకై, అలాగే నా కుటుంబం మరియు పూర్వీకుల చీకటి శక్తులతో ప్రమేయం ఉన్నట్లు నేను అంగీకరిస్తున్నాను మరియు త్యజిస్తున్నాను.

యేసుక్రీస్తు నామంలో, నేను ఇప్పుడు నా కుటుంబం మరియు నా ద్వారా సాతాను పట్ల ప్రతి చెడు ప్రమాణాలు, రక్త నింబంధనలు, దుష్ట సమర్పణలు మరియు ప్రతి రక్త బంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాను.


Join our WhatsApp Channel


Most Read
● మర్చిపోయిన ఆజ్ఞా
● యేసయ్య యొక్క అధికారమును ఒప్పుకోవడం
● విశ్వాసం ద్వారా కృప పొందడం
● నమ్మే సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి
● సర్పములను ఆపడం
● విశ్వాసపు జీవితం
● ప్రవక్త ఎలీషా జీవితం- ఆధ్యాత్మిక పెరుగుదల యొక్క నాలుగు ప్రదేశాలు - III
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login