हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు - 6
Daily Manna

గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు - 6

Monday, 13th of May 2024
1 0 1284
Categories : జీవిత పాఠాలు (Life Lessons) మనస్సు ఆలోచనలు (Mind Thoughts) విడుదల (Deliverance)
ఇది మన అంశంలోని చివరి విడత "గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పడిపోతారు".

దావీదు జీవితం నుండి, మనం మన మనస్సులో ఉంచుకున్నది మనం ఆలోచించేదానిపై ప్రభావం చూపుతుందని స్పష్టంగా చూడవచ్చు.

తప్పుడు ఆలోచన తప్పుడు భావాలకు దారి తీస్తుంది మరియు త్వరలోనే ఆ భావాలు మనపై ప్రభావం చూపేలా అనుమతిస్తాము. మనము అప్పుడు మన భావాలను బయటపెడతాము - మనము మునిగిపోతాము. మరియు త్వరలో, మన జీవితం విడిపోతుంది!

సామెతలు 23:7 మన ఆలోచనలను అదుపులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి చెబుతోంది: "[ఒక వ్యక్తి] తన హృదయంలో తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను."

అపవిత్రమైన (చెడు) ఆలోచనలు ఒక వ్యక్తిని అపవిత్రం చేస్తాయని ప్రభువైన యేసయ్య మనకు స్పష్టంగా తెలియజేశాడు.

దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచును.. (మత్తయి 15:19-20) కాబట్టి మన ఆలోచనా జీవితాన్ని నిర్దేశించడానికి సరైన చర్యలు తీసుకోవడం చాలా అత్యవసరం.

ఇది మనల్ని ఒక ప్రశ్న దగ్గరకు తీసుకువస్తుంది, "మన స్వతంత్రతో, క్రీస్తు మనకు వాగ్దానం చేసిన విజయంలో అనుదినం నడవడానికి మనం తీసుకోవలసిన కార్యాలు ఏమిటి?"

[మనం] మేము వితర్కములను, దేవుని గూర్చిన [నిజమైన] జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు (మెస్సీయ, అభిషిక్తుడు) లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండనచేయ సిద్ధ పడియున్నాము. (2 కొరింథీయులు 10:5)

మన ఆలోచనలను బంధించడం అంటే మన గురించి మరియు జీవితం గురించి మనం ఏమనుకుంటున్నామో దానిపై నియంత్రణ సాధించడం. మన కొనసాగుతున్న విశ్వాస నడకలో స్వతంత్ర మరియు విజయాన్ని కొనసాగించడానికి ఇది మనకు చాలా కీలకం.

ఆలోచనలను చూడలేనప్పటికీ, తూకం వేయలేము లేదా కొలవలేము, అవి నిజమైనవి మరియు శక్తివంతమైనవి. అపవిత్రమైన ఆలోచనలను అధిగమించడానికి కొన్ని ఆత్మ నడిపింపు కార్యాలను పంచుకోవడానికి నన్ను అనుమతించండి.

1. నీ ప్రవర్తనే కాదు నీ మనసు కూడా మారాలి.
మన జీవితాలు ఎల్లప్పుడూ మన అత్యంత ఆధిపత్య ఆలోచనల దిశలో కదులుతాయి. తనను ఘనపరచని పాపపు ప్రవర్తనను మార్చుకోమని దేవుడు మనలను పిలుస్తున్నాడు. అది జరగాలంటే, ఈ ప్రవర్తనలు ఉత్పన్నమయ్యే మన మనస్సులను క్రమశిక్షణలో ఉంచుకోవడంలో మనం పని చేయాలి.

మీ మనస్సును నూతన పరచడం ద్వారా దేవుడు మిమ్మల్ని మార్చడానికి అనుమతించండి మీరు మీ మనస్సును ఎలా నూతన పరచుకుంటారు? మీరు ఆలోచించకుండా మీ సంస్కృతికి సరిపోయేంత సర్దుబాటు చేసుకోకండి. బదులుగా, మీ దృష్టిని దేవుని మీద ఉంచండి. మీరు లోపల నుండి మార్చబడతారు. ఆయన మీ నుండి ఏమి కోరుకుంటున్నారో వెంటనే గుర్తించండి మరియు దానికై త్వరగా ప్రతిస్పందించండి. (రోమీయులకు 12:2) దేవుని వాక్యానికి అనుగుణంగా లేని ఆలోచనలను అలరించడానికి నిరాకరించండి. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఆలోచనలను జ్ఞానంతో తిరస్కరించండి.

2. మీ ఆలోచనల కంటే బిగ్గరగా మాట్లాడండి
ప్రతి ఆలోచనకు ఒక స్వరం ఉంటుంది. ప్రారంభ దశలో, ఆలోచనలు సున్నితమైన స్వరంతో ఉండవచ్చు, కానీ మీరు ఆ ఆలోచనలను వింటూనే, అవి రాను రాను బిగ్గరగా మారతాయి.

అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: "ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టనియుడి (2 కొరింథీయులకు ​​10:5) దీన్ని చేయడానికి ఒక మార్గం ఏమిటంటే, మీరు మీ మనస్సులో వింటున్న చెడు ఆలోచనకు విరుద్ధంగా దేవుని వాక్యాన్ని ఒప్పుకోవడం లేదా అంగీకరించడం.

ఉదాహరణకు, ఒక చెడు ఆలోచన ఇలా చెబుతుంది, "మీరు అందరిలాగే త్వరలో అనారోగ్యం పాలవుతారు". బిగ్గరగా చెప్పండి, "నా శరీరం పరిశుద్ధాత్మ ఆలయము , కాబట్టి ఏ అనారోగ్యం కూడా నా శరీరాన్ని తాకదు. నా జీవితమంతా నేను ఆరోగ్యంగా ఉంటాను. యేసు నామంలో." మళ్ళీ అదే ఆలోచన వస్తే మళ్ళీ చెప్పండి. మీ బలహీనత ఆలోచనలను ఎదుర్కోండి. నిష్క్రియంగా ఉండకండి. మీ ఆలోచనలు మీ మనస్సులోకి వచ్చిన ప్రతిసారీ వాటిని బందీగా ఉంచడానికి కొంత సమయం పడుతుంది. అయితే ప్రభువు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు.

3. కేంద్రీకృత ఆలోచన (ధ్యానం ఉంచవలసిన ఆలోచన)
సరైన విషయాల మీద మీ ఆలోచనలను కేంద్రీకరించడానికి ఎంచుకోండి. లేఖనం మనకు ఇలా చెబుతోంది, "మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటి మీద ధ్యాన ముంచుకొనుడి." (ఫిలిప్పీయులకు 4:8) మనం ఈ విషయాల మీద జ్ఞానంతో దృష్టి పెట్టడం ప్రారంభించినప్పుడు, దేవుడు మనకు తన శాంతిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తాడు.

ఒక సలహా మాట; మీకై మీరు ఓపికగా ఉండండి. మీరు మీ ఆలోచనా విధానాలను మార్చుకోవడం నేర్చుకున్నప్పుడు మిమ్మల్ని మీరు కఠినంగా మరియు విమర్శించుకోకండి. మీరు విరిగి నలిగిన బలమైన అబద్ధాల గురించి ఆలోచించడం ప్రారంభించినట్లయితే, మీరు దాని గురించి తెలుసుకున్న వెంటనే పశ్చాత్తాపపడండి.

పశ్చాత్తాపం ఒక జీవనశైలిగా మార్చుకోండి, కాబట్టి ఏదీ పాతుకుపోయే అవకాశం లేదు. మీ స్వేచ్ఛలో ముందుకు సాగండి. మీరు ఆలోచించడానికి కొత్త మార్గాలను నేర్చుకునేటప్పుడు అసహనానికి గురికాకండి.
Prayer

నన్ను కప్పివేయాలనుకునే ఆందోళన మరియు నిరాశ యేసు నామంలో వెళ్లిపోవును గాక. 


ప్రతి ఆలోచనలను అధిగమించే దేవుని సమాధానము క్రీస్తుయేసులో నా హృదయాన్ని మరియు మనస్సును కాపాడుతోంది.


Join our WhatsApp Channel


Most Read
● నుండి లేచిన ఆది సంభూతుడు
● మార్పు చెందడానికి ఇంకా ఆలస్యం చేయకు
● అత్యంత సాధారణ భయాలు
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు - 3
● మీ నిజమైన విలువను కనుగొనండి
● 20 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఒత్తిడిని జయించడానికి 3 శక్తివంతమైన మార్గాలు
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login