हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. దేవుడు ఎలా సమకూరుస్తాడు #1
Daily Manna

దేవుడు ఎలా సమకూరుస్తాడు #1

Friday, 13th of September 2024
0 0 685
Categories : కృతజ్ఞత (Thanksgiving) పొందుబాటు (Provision)
నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు. (కీర్తనలు 37:25)

దావీదు తన జీవితపు చివరి అంచున ఉన్న సాక్ష్యం ఇది. ఈ సాక్ష్యం యేసు నామంలో మీది మరియు నాది కూడా అవును గాక.

దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడూ ఒక పద్ధతిలో మరియు మార్గాల్లో సమకూరుస్తాడు, ఇది మీరు మరియు నేను కూడా అర్థం చేసుకోలేము. ఆయన నమ్మకమైన దేవుడు.(ద్వితీయోపదేశకాండము 7:9)

ఐగుప్తులో 430 సంవత్సరాల బందిఖానాలో ప్రభువు ఇశ్రాయేలీయులను బయటకు తీసుకువచ్చినప్పుడు, వాగ్దానం చేసిన భూమి వైపు నడుస్తున్నప్పుడు వారు ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్ళలో ఒకటి ఆహారం.

వారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరియు వారు అరణ్యం గుండా వెళుతున్నారనేది మరింత సవాలుగా మారింది. దేవుని దాసుడైన మోషే కూడా ఒకసారి ప్రభువును అడిగాడు, "అందుకు మోషే నేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులువారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి. వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొఱ్ఱలను పశువులను చంప వలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేప లన్నియు వారి నిమిత్తము కూర్చవలెనా? అనెను." (సంఖ్యాకాండము 11:21-22)

అయినప్పటికీ, సమయం కాని సమయంలో, దేవుడు తన ప్రజలకు అరణ్యంలో మానవఅతీతంగా సమకూర్చాడు. దేవుడు ఎడారి మధ్యలో వేలాది మంది ఇశ్రాయేలీయులకు సమకూర్చగలిగితే, ఆయన మీ కోసం మరియు మీ ప్రియమైనవారి అవసరాలను ఖచ్చితంగా సమకూర్చగలడు.

కానీ దేవుని మానవఅతీత సదుపాయంతో కూడా, ఇశ్రాయేలీయులు ఇప్పటికీ ఎడారిలో సణుగుతు గొణుగుతున్నారు. వారు ఐగుప్తులో వదిలిపెట్టిన ఆహారం కోసం ఎంతో ఆశపడ్డారు.

కాబట్టి ఇశ్రాయేలీయులు కన్నీళ్లు కారుస్తూ ఇలా అన్నారు:
"వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధి కముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చిమాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి." సంఖ్యాకాండము 11:4-6)

ప్రతి రోజుకు సరిపోయే అంత - దేవుడు పరలోకం నుండి మన్నాను సమకూరుస్తూన్నాడు - కాని వారు ఆయనకు భిన్నంగా కోరుకున్నారు. వారు తమ సొంత మార్గాన్ని కోరుకున్నారు. 

బహుశా మీరు కూడా ఒక నిర్దిష్ట ఉద్యోగం కోసం ప్రార్థిస్తూ ఉండవచ్చు మరియు మీకు నిజంగా కావలసిన ఉద్యోగం రాలేదు, సణుకొకండి మరియు చిరాకు పడకండి. మీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వండి!

మీ కార్యాలయంలో విషయాలు కొంచెం కఠినంగా ఉండవచ్చు, బాధాకరంగా ఉండకండి. వేలాది మంది కోల్పోతున్న నేటి కాలంలో మీకు ఉద్యోగం ఉన్నందుకు కనీసం కృతజ్ఞతతో ఉండండి.

మీరు దేవుని పొందుబాటు నిరంతరం చూడాలనుకుంటే, దేవుడు మీకు తగినట్లుగా భావించే విధంగా మీ కోసం అందించమని మీరు దేవుడిని అడగాలి. దేవుని మానవఅతీతంగా, ఉహించని మార్గాలకు వ్యతిరేకంగా చింతించకండి.

అలాగే, సణుగుతు మరియు గొణుగుతూ ఉండే బదులు, ప్రభువు యొక్క సదుపాయానికి కృతజ్ఞతలు చెప్పాలి.

ప్రతి విషయమునందును (దేవునికి) (పరిస్థితులు ఎలా ఉన్నా, కృతజ్ఞతతో మరియు కృతజ్ఞతలు చెప్పండి] కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. (1 థెస్సలొనీకయులకు 5:18)

కృతజ్ఞత అనేది అధిక ఎత్తుకు వెళ్ళడానికి మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. మీరు కృతజ్ఞతతో, సమర్పణతో కూడిన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు, తాజా ప్రభావానికి తాజా అభిషేకం మీపైకి వస్తుంది మరియు విషయాలు వృద్ధి చెందడానికి మరియు గుణించటానికి కారణమవుతాయి.
Prayer
తండ్రి దేవా, నీవే నా దాతవు. దయచేసి నీకు సరిపోయే విధంగా నాకు సమకూర్చు. విశ్వాసం ద్వారా, నేను ముందుగానే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● మాకు కాదు
● ఏ కొదువ లేదు
● పందెములో పరుగెత్తడానికి ప్రణాళికలు
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #1
● సంపూర్ణ బ్రాండ్ మేనేజర్
● ధైర్యము కలిగి ఉండుట
● ఆయన వెలుగులో బంధాలను పెంపొందించడం
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login