हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. శక్తివంతమైన మూడు పేటల త్రాడు
Daily Manna

శక్తివంతమైన మూడు పేటల త్రాడు

Thursday, 21st of November 2024
1 0 344
Categories : ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు. (ప్రసంగి 4:12). వధువు, వరుడు మరియు దేవుని మధ్య ఐక్యత యొక్క బలాన్ని సూచించే వివాహ వేడుకల సమయంలో ఈ వాక్యం సాధారణంగా ఉల్లేఖించబడుతుంది. ఏది ఏమైనప్పటికీ, మూడు పేటల త్రాడు యొక్క ప్రాముఖ్యత వైవాహిక సంబంధాలకు మించి విస్తరించింది, బైబిలు అంతటా గుర్తించగలిగే చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది.

విశ్వాసి జీవితంలో, 1 కొరింథీయులలు 13:13లో వివరించినట్లుగా, విశ్వాసం, నిరీక్షణ మరియు ప్రేమ ద్వారా మూడు పేటల త్రాడు వ్యక్తీకరణను తెలియజేస్తుంది. ఈ సద్గుణాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు స్థితిస్థాపకతకు చాలా అవసరం, మరియు అవి కలిసి, దేవుడు మరియు ఇతరులతో క్రైస్తవుని బంధానికి ప్రధానమైనవి. ఈ మూడు పేటల త్రాడు యొక్క ప్రతి అంశం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటుంది మరియు ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది, ఇది బలంగా మరియు శాశ్వతంగా ఉంటుంది.

విశ్వాసి ఆచరణాలు

మత్తయి 6 లో, యేసు తనను వెంబడించే వారికి  దేవుని బిడ్డగా జీవించడానికి అవసరమైన అంశాలను బోధించాడు, ఇవ్వడం, ప్రార్థించడం మరియు ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను గురించి నొక్కి చెప్పాడు.
  • మీరు ధర్మము చేయునప్పుడు... (మత్తయి 6:2)
  • మీరు ప్రార్థన చేయునప్పుడు.... (మత్తయి 6:5)
  • మీరు ఉపవాసము చేయునప్పుడు... (మత్తయి 6:16)
ఇది 'అయితే' అని చెప్పలేదు కానీ చేయునప్పుడు అని గమనించండి. యేసు ప్రభువు ఈ క్రియలను  ఐచ్ఛికంగా కాకుండా విశ్వాసి జీవితంలోని సమగ్ర అంశాలుగా అందజేశాడు.

క్రైస్తవులు స్వచ్ఛమైన హృదయంతో ఇచ్చినప్పుడు, మానవాళిని రక్షించడానికి తన ఏకైక కుమారుడిని ఇచ్చిన దేవుని ప్రేమ మరియు దాతృత్వాన్ని వారు ప్రతిబింబిస్తారు (యోహాను 3:16).

 ఇతరులను ఆకట్టుకోవడానికి లేదా కేవలం ఖాళీ పదాలను పఠించడానికి కాదు, నిజాయితీగా మరియు దీనత్వముతో ప్రార్థించాలని ప్రభువైన యేసు మనకు బోధించాడు. ప్రార్థన ద్వారా, మనం దేవునితో సన్నిహిత బంధాన్ని పెంపొందించుకుంటాము మరియు మన అవసరాలన్నిటికీ ఆయన మీద ఆధారపడటం నేర్చుకుంటాము. 

ఉపవాసం మన ఆధ్యాత్మిక ఎదుగుదల మీద దృష్టి పెట్టడానికి, ప్రాపంచిక పరధ్యానాల నుండి విముక్తి పొందేందుకు మరియు ఆయన చిత్తాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

మూడు పేటల త్రాడు బలం

కలిసి ఆచరించినప్పుడు, ఇవ్వడం, ప్రార్థించడం మరియు ఉపవాసం ఒక శక్తివంతమైన మూడు పేటల త్రాడును సృష్టిస్తాయి, అది క్రైస్తవు విశ్వాసాన్ని మరియు దేవునితో బంధాన్ని బలపరుస్తుంది (ప్రసంగి 4:12).

మార్కు 4:8, 20లో, ప్రభువైన యేసు ముప్పై దంతలు, అరవై దంతలు మరియు నూరంతలుగాను ఫలించడం గురించి చర్చిస్తున్నాడు, విశ్వాసులు ప్రార్థన, ఇవ్వడం మరియు ఉపవాసం చేయడంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు విశేషముగా అభివృద్ధి చెందుతాయని వివరిస్తుంది.

నూరంతల ప్రతిఫలం

ఒక విశ్వాసి ప్రార్థన చేసినప్పుడు, వారు దేవుని మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదాలకు తమ హృదయాలను తెరుస్తారని నేను నమ్ముతున్నాను, ముప్పై దంతలుగా ఫలించే అవకాశం ఉంటుంది. ఇవ్వడంతో ప్రార్థనను కలపడం అనేది దేవుని ఏర్పాటుపై విశ్వాసి యొక్క నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది మరియు అరవై దంతలుగా ఆశీర్వాదం పొందవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఒక క్రైస్తవుడు ప్రార్ధన మరియు ఇవ్వడంతో పాటు ఉపవాసాన్ని చేర్చినప్పుడు, వారు అసమానమైన ఆధ్యాత్మిక సమృద్ధి మరియు వృద్ధిని తెరుస్తారు నూరంతలుగా ఫలించే వాతావరణాన్ని సృష్టిస్తారు. "100 దంతలుగా ఫలించడానికి సిద్ధంగా ఉండండి" అని ఆత్మ చెప్పడం నేను విన్నాను. 

కొర్నేలీ చరిత్ర

అపొస్తలుల కార్యములు 10:30-31లోని కొర్నేలి కథ, ప్రార్థన, ఇవ్వడం మరియు ఉపవాసాన్ని ఏకగ్రీవంగా ఆచరించే శక్తిని గురించి ఉదహరిస్తుంది. భక్తుడైన కొర్నేలి ఉపవాసం ఉండి, ప్రార్థించాడు మరియు అవసరమైన వారికి దాతృతంగా ఇచ్చాడు. ఈ ఆధ్యాత్మిక విభాగాలకు అతని అంకితభావం దేవుని దృష్టిని ఆకర్షించింది, అపొస్తలుడైన పేతురును వెతకడానికి దేవదూతల దర్శనం మరియు దైవ సూచనలకు దారితీసింది.

కొర్నేలి యొక్క నమ్మకత్వం ఫలితంగా, పేతురు కొర్నేలి ఇంటికి మార్గనిర్దేశం చేయబడ్డాడు, అక్కడ అతడు కొర్నేలి మరియు అతని కుటుంబంతో సువార్తను పంచుకున్నాడు. ఈ సహవాసం కొర్నేలి యొక్క మొత్తం కుటుంబ సభ్యుల రక్షణానికి మరియు బాప్తిస్మముకు  దారితీసింది, ప్రార్థన, ఇవ్వడం మరియు ఉపవాసం వంటి జీవనశైలి వల్ల కలిగే అద్భుతమైన ఆశీర్వాదాలు మరియు ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. దేవుడు వ్యక్తుల పట్ల పక్షపాతం చూపే వాడు కాదు. మీరు ఈ సిధ్ధాంతాన్ని స్వీకరించినట్లయితే, మీరు కూడా అదే అద్భుతమైన ఫలితాలను చూస్తారు.


సమర్థవంతమైన 40 రోజుల ఉపవాసం కోసం మార్గదర్శకత్వం

ఉపవాసం వ్యవధి:
ఉపవాసం అర్ధరాత్రి (00:00 గంటలు) ప్రారంభమవుతుంది మరియు ప్రతిరోజూ 14:00 గంటలకు (మధ్యాహ్నం 2:00) ముగుస్తుంది.
ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన మరియు సామర్థ్యం ఉన్నవారు, ఉపవాసాన్ని 15:00 గంటల వరకు (మధ్యాహ్నం 3:00) వరకు పొడిగించవచ్చు.

ఆహార నిబంధనలు:
ఉపవాస సమయాలలో (00:00 నుండి 14:00 గంటల వరకు), నీరు తప్ప టీ, కాఫీ, పాలు లేదా మరే ఇతర పానీయాలను తీసుకోకుండా ఉండండి. జలయోజితగా ఉండటానికి ఉపవాస సమయం అంతా పుష్కలంగా నీరు త్రాగడానికి ప్రోత్సహించబడుతుంది.

ఉపవాసం తర్వాత భోజనం:
ఉపవాస సమయం ముగిసిన తర్వాత (14:00 లేదా 15:00 గంటల తర్వాత), మీరు మీ సాధారణ భోజనం తీసుకోవచ్చు.

ఆధ్యాత్మిక దృష్టి:
ఈ ఉపవాసం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందడానికి, సోషల్ మీడియా వంటి ప్రాపంచిక పరధ్యానాలను తగ్గించడానికి ప్రయత్నించండి. ఈ సమయాన్ని ప్రభావం, ప్రార్థన లేదా ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాల కోసం ఉపయోగించాలి.

గుర్తుంచుకోండి, ఉపవాసం అనేది శారీరక క్రమశిక్షణతో పాటు ఆధ్యాత్మిక పోషణకు సంబంధించినది. మీ దేహాన్ని వినడం మరియు తదనుగుణంగా సర్దుబాటు చేయడం ముఖ్యం.
ఈ 40-రోజుల ప్రార్థన కార్యక్రమంలో, మన ప్రార్థనలు మానవులను ఉద్దేశించి చేయలేదని అర్థం చేసుకోవడం ముఖ్యం. బదులుగా, వారు వివరించిన విధంగా ఆధ్యాత్మిక అస్తిత్వాలను లక్ష్యంగా చేసుకున్నారు

ఎఫెసీయులకు 6:12. "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహ ములతోను పోరాడుచున్నాము." (ఎఫెసీయులకు 6:12).

ప్రార్థన చేయడానికి అత్యంత ప్రభావవంతమైన సమయం:
మత్తయి 24:43 బోధనలలో, మనం ఒక లోతైన రూపకాన్ని కనుగొంటాము: "ఏ జామున దొంగవచ్చునో యింటి యజ మానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు." ఈ భాగం అప్రమత్తత మరియు సంసిద్ధత యొక్క ప్రాముఖ్యతను గురించి నొక్కి చెప్పే ఆధ్యాత్మిక సారూప్యతగా పనిచేస్తుంది.

అర్ధరాత్రి ఎందుకు?

ఒక దొంగ తరచుగా రాత్రిపూట, ఊహించని మరియు కనిపించని విధంగా వస్తాడు, అలాగే మనం ఎదుర్కొనే సవాళ్లు కూడా ఉంటాయి (2 పేతురు 3:10). ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి, అర్ధరాత్రి సమయం ఆధ్యాత్మికంగా ముఖ్యమైనది.

00:00 నుండి 01:30 వరకు (మధ్యరాత్రి 12 నుండి మధ్యరాత్రి 1:30 వరకు), ప్రార్థనకు వాతావరణం అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయములో, చీకటి శక్తులు అత్యంత చురుకుగా ఉంటాయని నమ్ముతారు, ఇది ఆధ్యాత్మిక విజ్ఞాపన ప్రార్థనకు కీలకమైన సమయం.

దీనికి విరుద్ధంగా, ఉదయం తరచుగా దినచర్య కోసం సన్నాహాలతో హడావిడిగా ఉంటాయి మరియు ప్రాపంచిక శ్రద్ధలు మన ఆలోచనలపై ఆధిపత్యం చెలాయిస్తాయి, లోతైన ఆధ్యాత్మిక అనుబంధానికి ఆటంకం కలిగిస్తాయి.

ఆరోగ్యం మరియు భద్రతా జాగ్రత్తలు:
ఈ ప్రార్థన కార్యక్రమంతో అనుబంధించబడిన ఉపవాసాన్ని ప్రారంభించే ముందు, మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం, ప్రత్యేకించి మీరు మందులు తీసుకుంటుంటే, ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే లేదా మీరు గర్భవతిగా ఉన్నట్లయితే లేదా నర్సింగ్ చేస్తున్నట్లయితే.

మీ శరీరాన్ని వినండి మరియు అవసరమైన విధంగా సర్దుబాట్లు చేయండి. మీ శారీరక ఆరోగ్యం ముఖ్యం మరియు మీ ఆధ్యాత్మిక అభ్యాసాలతో పాటుగా పరిగణించాలి.
Prayer
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. తొందరపడకండి.

1. ఈ 40-రోజుల ప్రార్థన మరియు ఉపవాస కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయకుండా నన్ను వ్యతిరేకించే ప్రతి శక్తి యేసు నామములో మరియు యేసు రక్తం ద్వారా తీసివేయబడును గాక.

2. తండ్రీ, యేసు నామములో, ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలను నా విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు నన్ను నీకు దగ్గరగా తీసుకురావడానికి ఉపయోగించండి. ఉపవాస ప్రార్థన యొక్క ప్రతి రోజు నీతో మరింత సన్నిహిత సంబంధానికి నన్ను తీసుకురావాలి, ప్రేమ, అవగాహన మరియు భక్తిలో పెరుగును గాక.

3. తండ్రీ, యేసు నామములో, ఈ ఉపవాస సమయములో తలెత్తే ఏదైనా ఆధ్యాత్మిక దాడుల నుండి రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నీ దేవదూతలతో నన్ను చుట్టుముట్టు మరియు నీ సన్నిధి నా చుట్టూ ఒక కవచంగా ఉండును గాక, నా మనస్సు, శరీరం మరియు ఆత్మను కాపాడును గాక.




Join our WhatsApp Channel


Most Read
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 4
● 21 రోజుల ఉపవాసం: 2# వ రోజు
● గొప్ప ప్రతిఫలము ఇచ్చువాడు
● మీ గురువు (బోధకుడు) ఎవరు - I
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 3
● 09 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● విశ్వాసపు పాఠశాల
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login