हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. ఇది అధికార మార్పు  (బదిలి) యొక్క సమయం
Daily Manna

ఇది అధికార మార్పు  (బదిలి) యొక్క సమయం

Saturday, 22nd of February 2025
0 0 215
Categories : ఎస్తేరు యొక్క రహస్యం: క్రమము (Secrets of Esther:Series)
"తూర్పు నుండియైనను పడమటి నుండియైనను అరణ్యము నుండియైనను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును." (కీర్తనలు 75:6-7)

శత్రువు ఓడిపోయిన తర్వాత, పరిశుద్ధులు రాజసములోకి అడుగుపెడుతారు. బైబిలు ఎస్తేరు 8:1-2లో ఇలా చెబుతోంది, "ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణియైన ఎస్తేరున కిచ్చెను ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావలెనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసికొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను."

మొర్దెకై రాజు యొక్క స్వంత చిహ్నపు ఉంగరానికి ప్రాప్యత కలిగి ఉండటం వలన అతనికి లభించిన నమ్మకం మరియు అధికారాన్ని మరియు అతని కార్యాలయముకు చిహ్నాన్ని సూచిస్తుంది. అధికారం యూదులకు బదిలీ చేయబడింది. ఇప్పుడు రాజభవనం మరియు దేశం యొక్క మంత్రివర్గంలో యూదులు రెండవ అధికారం కలిగి ఉన్నారు. వధ కోసం చంపబడిన అదే వ్యక్తులు సజీవంగా మాత్రమే కాకుండా ఇప్పుడు దేశం యొక్క నాయకత్వ నిర్మాణంలో పూర్తిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొర్దెకై ఇప్పుడు రాజు భవనంలోని మరొక పెద్ద వ్యక్తి మాత్రమే కాదు; అతడు రాజు పక్కనే ఉన్నాడు.

రాజు అతనికి తన ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ రోజుల్లో, ఒక రాజు శాసనం వ్రాసిన తర్వాత చేయాలనుకున్నప్పుడు, ఆ పత్రాన్ని స్టాంప్ చేయడానికి రాజు యొక్క చిహ్నపు ఉంగరాన్ని ఉపయోగించారు. ఇది అధికారానికి సంకేతం. ప్రజలు ఆ స్టాంపు ఉన్న ఏదైనా రచనను చూసినప్పుడు, ఆ సూచనలను పాటించవలసి ఉంటుంది. రాజు మొర్దెకైకి ఇచ్చిన ఉంగరం ఇదే. ఇప్పుడు భూమి మీద ఆయనకున్న అధికార పరిమాణాన్ని మీరు ఊహించవచ్చు. ఒకప్పుడు బందీగా ఉన్న వ్యక్తి రెండవ స్థానంలోకి వచ్చాడు. అతడు రాజు పక్కనే ఉన్నాడు.

పదోన్నతి ప్రభువు నుండి వస్తుందని బైబిలు చెబుతోంది. ఎవరు మిమ్మల్ని బహిష్కరించారు లేదా వారు మిమ్మల్ని ఎంతవరకు మరచిపోయారు అనేది ముఖ్యం కాదు; సమయం వచ్చినప్పుడు, అధికారం మీకు బదిలీ చేయబడుతుంది. ప్రశ్న ఏమిటంటే, ఇతర మంత్రివర్గం సభ్యులు ఎక్కడ ఉన్నారు? హామాను తర్వాతి స్థానంలో ఎవరు ఉన్నారు? రాజు తనతో కొంతకాలం ఉన్నందున అతని స్థానంలో ఒకరిని ఎంపిక చేసుకోలేకపోయారా? దేశ రాజకీయ మంత్రివర్గంలోకి కొత్త వ్యక్తిని రాజుకు రెండవ వ్యక్తిగా ఎందుకు తీసుకురావాలి? వారిలో కొందరు రాజు చేతిలోని చిహ్నపు ఉంగరాన్ని మాత్రమే చూశారు కానీ బహుశా దానిని ఎప్పుడూ ముట్టుకోలేదు. మరియు వారి సమక్షంలోనే, మొర్దెకైకి అధికారం ఇచ్చాడు.

నా మిత్రమా, దేవుడు మీ కొరకు గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. మీరు పైకి మీ మార్గం నుండి రావడం అవసరం లేదు; పదోన్నతి పొందేందుకు ఎవరిని చంపకూడదు, మోసం చేయకూడదు. జీవితంలో ఎదగడానికి మరియు పరివర్తనను ఆస్వాదించడానికి మీరు హామాను వంటి చెడు పన్నాగం చేయవలసిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్నారో దేవునికి తెలుసు, మరియు ఆయన మీ కోసం గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ఒకరిని దించి మరొకరిని ఏర్పాటు చేయడంలో ఆయన నిష్ణాతుడు. ఆయన హామానును పడగొట్టినట్లే, ఆయన నీ శత్రువులను పడగొట్టి వారి స్థానంలో నిన్ను నిలబెడతాడు.

మీరు ఆయన సనాతనము, మరియు మీరు రాజసము కోసం విమోచించబడ్డారు. మీరు బానిసలు కాదు రాజులు. ప్రకటనలు 1:6 ఇలా చెబుతోంది, "మహిమయు ప్రభావ మును యుగయుగములు కలుగును గాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను." మనం పరిపాలించడానికి మరియు నడిపించడానికి విమోచించబడ్డాము, బానిసలుగా ఉండటానికి కాదు. ఇప్పుడు మీరు ఎదగడానికి కష్టపడుతున్నావా? చింతించకండి; దేవుడు మీ కోసం వస్తున్నాడు. ఆయన ఇప్పటికే మీకు స్థానం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన మీకు బదిలీ చేయబడే ఉంగరాన్ని సిద్ధం చేస్తున్నాడు.

కాబట్టి, సరైన వైఖరిని కొనసాగించండి. మీరు ఇప్పటికీ అగ్రస్థానంలో లేనందున అణగారిన మరియు తక్కువ అనుభూతి చెందడం సులభం. శత్రువు మీ కోసం మాత్రమే ఆ స్థానాన్ని ఉంచుతున్నాడని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి, మీరు ఎక్కడ ఉన్నారో ఉత్సాహంగా ఉండండి. దేవుని సేవించండి మరియు మీ పనికి కట్టుబడి ఉండండి. మరియు తగిన సమయంలో, దేవుని హస్తం మిమ్మల్ని పైకి లేవనెత్తుతుంది.



Bible Reading: Numbers 21-22
Prayer

తండ్రీ, యేసు నామములో, నీవు నా కోసం కలిగి ఉన్న గొప్ప ప్రణాళికలకు వందనాలు. నేను తప్పు చేయనందున నేను నీకు కృతజ్ఞత స్తుతులు తెలుపుతున్నాను. నీ బలమైన హస్తం నన్ను భూమి నుండి పైకి లేపాలని ప్రార్థిస్తున్నాను. నేను వెళ్ళే మార్గంలో నీవు నన్ను నడిపించాలని ప్రార్థిస్తున్నాను. సరైన వైఖరిని కొనసాగించడానికి నీ ఆత్మ ద్వారా నాకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో. 


Join our WhatsApp Channel


Most Read
● విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ
● తేడా స్పష్టంగా ఉంది
● మీరు ఎవరితో నడుస్తున్నారు?
● ఆధ్యాత్మిక విధానాలు: సహవాస విధానము
● దైవ క్రమము - 2
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #2
● మాదిరి కరంగా నడిపించబడుట
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login