हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. ఆత్మలో తీవ్రతతో ఉండుట
Daily Manna

ఆత్మలో తీవ్రతతో ఉండుట

Friday, 14th of March 2025
0 0 211
Categories : ఆధ్యాత్మిక యుద్ధం (Spiritual Warfare) దేవుని అగ్ని (Fire of God)
ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి" (రోమీయులకు ​​12:11)

తరువాతి తరాన్ని ఓడించడానికి సాతాను సామూహిక బానిసత్వ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు, ఎందుకంటే తదుపరి విమోచకుడు ఎవరో తెలియదు - బహుశా తదుపరి మోషే, యెహొషువ, దానియేలు, దెబోరా, రాహేలు, రిబ్కా - లేదా దేశాన్ని దాని నుండి బయటకు తీసుకువచ్చే తదుపరి గొప్ప నాయకుడు, శ్రద్ధలేని, ఆధ్యాత్మిక బద్ధకం లాంటి వాడు ఎవరో వానికి తెలియదు. నిజం చెప్పాలంటే ఈరోజు కష్టపడుతున్న పెద్దలు నిన్నటి పిల్లలే. వ్యసనాలు మరియు బంధనాలతో పోరాడే చాలా మంది మొదట చిన్నతనంలో శత్రువుల వలలను చిక్కుకున్నారు. కానీ ఏది స్థానంలో ఉంచబడలేదు.

బైబిలు మనకు ప్రకటన 12:1-4లో ఒక శక్తివంతమైన విషయాన్ని తెలుపుతుంది, "అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రిందచంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుటనిలుచుండెను."

అపవాది ఎంత త్వరగా మరియు అప్రమత్తంగా ఉంటాడో మీరు గమనించారా? ఆ స్త్రీకి బిడ్డ పుట్టడం కోసం అతడు ఓపికగా ఎదురు చూశాడని బైబిలు చెబుతోంది, తద్వారా అతడు ఆమె విత్తనాన్ని మ్రింగివేసాడు. అతడు స్త్రీలు గర్భం దాల్చడాన్ని పట్టించుకోలేదు, కడుపులో ఉన్న బిడ్డను ప్రభావితం చేయలేదు, కానీ అతడు పుట్టబోయే అద్భుతమైన విధిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న విత్తనం ప్రసవించే వరకు వేచి ఉన్నాడు. నేటికీ నరకం యొక్క కార్యము ఇదే.

శత్రువు తన బాధితులను పిల్లలుగా ఉన్నప్పుడు ఎంపిక చేసుకుంటాడు. ఆదిమ బోధన యొక్క ప్రాముఖ్యత గురించి శత్రువుకు పూర్తిగా తెలుసు, మరియు అతడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మన విత్తనానికి వ్యతిరేకంగా వ్యూహాలను ప్రణాళిక కలిగి ఉంటాడు. చిన్న వయస్సులోనే పిల్లలు మానసికంగా చాలా సున్నితంగా ఉంటారు మరియు మానసికంగా ఆకట్టుకుంటారు. అందుకే మనకు ఇలా ఉపదేశించబడింది: "బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" (సామెతలు 22:6).

కాబట్టి, మన పిల్లలలో దేవుని మార్గాలను వెలిగించాలి. పాఠశాలలు లేదా మాల్స్‌లో అపవాదిని వారికి మార్గం చూపడానికి అనుమతించడం మానకు సాధ్యం కాదు; మనము ముందుగానే ప్రారంభించాలి. ప్రకటన 3:14-17లో బైబిలు ఇలా చెబుతోంది, "లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్‌ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను." వారు ఆత్మలో తీవ్రతగ (వెచ్చగా) మరియు ఉత్సాహంగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. అప్పుడు తమపై వచ్చిన ఎలాంటి వ్యతిరేకతనైనా తట్టుకోగలుగుతారు.

సమయం, పరిస్థితులు మరియు లోకము నుండి వచ్చే ఒత్తిళ్లు వారి హృదయము మారకముందే సువార్త యొక్క విత్తనాలు పిల్లల హృదయాలలోని లేత నేలలో నాటాలి. దానియేలు 1:8లో దానియేలు అనే యువకుడి గురించి బైబిలు ఇలా చెబుతోంది, "రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడుకొనెను."

అతను చెరసాలలో వేయబడ్డాడు, అక్కడ దేవుని నామము ఉచ్చరించుట నిషిద్ధం. ఈ యువకుడు పూర్తిగా విగ్రహారాధన చేసే దేశంలో తనను తాను కనుగొన్నాడు. అబద్ధం, దొంగతనం, అవినీతి మరియు మద్యపానం సాధారణమైన వ్యవస్థలో మీ బిడ్డ తనను తాను కనుగొన్నట్లు ఊహించుకోండి. అదిదానియేలు తనను తాను కనుగొన్న వ్యవస్థ, కానీ అతడు అప్పటికే ఉద్వేగభరితమైన ఆత్మను కలిగి ఉన్నాడు; అతడు అప్పటికే ప్రభువు కోసం తీవ్రతతో ఉన్నాడు. శోధనను ఎదిరించడం అతనికి సులువుగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. దానియేలు వలె, ఈ యువకులను దేవుని వాక్యంతో మరియు ప్రార్థనలతో ఉత్తేజపరిచే సమయం వచ్చింది, తద్వారా వారు దేవునితో సన్నిహితంగా ఉండగలరు.

Bible Reading: Joshua 3-5
Prayer
తండ్రీ, యేసు నామములో, నీ కృపలో నా బిడ్డను (పిల్లలను) ఇప్పటివరకు ఉంచినందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. నేను అతనిని/ఆమెను/వారిని ప్రభువు మార్గాలలో పెంచే కృపకై ప్రార్థిస్తున్నాను. వారిలో నీ ఉద్రేకము ఎప్పటికీ చల్లారకూడదని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● భయపడే ఆత్మ
● ప్రతి ఒక్కరికీ కృప
● ఆలోచనల రాకపోకల మార్గాన్ని దాటుట
● 06 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ప్రవక్త ఎలీషా జీవితం- ఆధ్యాత్మిక పెరుగుదల యొక్క నాలుగు ప్రదేశాలు - III
● యేసు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు?
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #2
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login