हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us Contact us Listen on Spotify Listen on Spotify Download on the App StoreDownload iOS App Get it on Google Play Download Android App
 
Login
Online Giving
Login
  • Home
  • Events
  • Live
  • TV
  • NoahTube
  • Praises
  • News
  • Manna
  • Prayers
  • Confessions
  • Dreams
  • E-Books
  • Commentary
  • Obituaries
  • Oasis
  1. Home
  2. Daily Manna
  3. మనుష్యుల పారంపర్యాచారము (సంప్రదాయాలు)
Daily Manna

మనుష్యుల పారంపర్యాచారము (సంప్రదాయాలు)

Monday, 31st of March 2025
0 0 210
Categories : నమ్మకాలు (Beliefs) మనస్సును నూతనపరచుట (Renewing the Mind) మార్పుకు (Transformation)
"అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు." మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. (మత్తయి 15:6)

మనమందరం మన కార్యాలకు మరియు బంధాలకు మార్గనిర్దేశం చేసే సంస్కృతులు మరియు సంప్రదాయాలను కలిగి ఉన్నాము. ఈ సంప్రదాయాలలో కొన్ని, కొన్ని ప్రదేశాలకు మరియు ప్రాంతాలకు ప్రత్యేకమైనవి. కొంతమంది వ్యక్తులు కొన్ని సందర్భాలలో ప్రత్యేక పద్ధతిలో దుస్తులు ధరిస్తారు; కొన్ని సంప్రదాయాలు మీరు మీ చేతితో కొంత ఆహారాలను తినాలని కోరుకుంటాయి, అయితే కొందరు తినడానికి చెక్క కర్రలను ఉపయోగిస్తారు. కొన్ని సంప్రదాయాలు కొన్ని వివాహ ఆచారాలతో బాగానే ఉంటాయి, మరికొన్ని చోట్ల ఇది నిషిద్ధం.

మన అనుదిన జీవితంలో సంప్రదాయాలు ఎంతగా ముడిపడి ఉన్నాయో, కొన్నిసార్లు అవి దేవుని వాక్యం కంటే వాటికి ఎక్కువ ప్రాధాన్యత   ఇచినప్పుడు దేవుని ఆశీర్వాదాలను పొందకుండా అడ్డంకిగా నిలుస్తాయి. మత్తయి 15:3-6లో, దేవుని ఆజ్ఞల కంటే మనుష్యుల సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు యేసు పరిసయ్యులను గద్దించాడు. ఈ సంప్రదాయాలు తరచుగా కేవలం సంప్రదాయంగా కాకుండా సత్యంగా మారతాయి మరియు దేవుని వాక్యం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడతాయి. ఇవి దేవుని సత్యాన్ని గురించిన మన అవగాహనకు ఆటంకం కలిగిస్తాయి మరియు ఆయన ఆశీర్వాదాలను అనుభవించకుండా నిరోధిస్తాయి. భూమి కూడా దేవుని వాక్యం ద్వారా రూపొందించబడిందని మనం మరచిపోతాము, కాబట్టి మనం దేవుని వాక్యం యొక్క సత్యాన్ని పట్టుకోకుండా ఈ మానవ సంప్రదాయానికి లోబడి మన జీవితాలను నడుపుతున్నాము.

దేవుడు ద్వితీయోపదేశకాండము 12:29-32లో ఇశ్రాయేలీయులను ఇలా హెచ్చరించాడు, "నీవు వారి దేశమును స్వాధీనపరచు కొనుటకు వెళ్లుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ యెదుట నుండి నాశముచేసిన తరువాత, నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని, వారి దేశములో నివసించునప్పుడు, వారు నీ యెదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్లి చిక్కుబడి, వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని అనుకొనకుండ జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవు డైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కూమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి వేయుదురు గదా. నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలో నుండి ఏమియు తీసివేయకూడదు."

వారు తమ భూమిని స్వాధీనం చేసుకునేందుకు తరలిస్తున్న ప్రజల జీవన విధానాలు మరియు సంప్రదాయాల గురించి అంతగా ఆసక్తి చూపవద్దని ఆయన వారికి చెప్పాడు. వారి సంప్రదాయం గురించి విచారించవద్దు అని దేవుడు చెప్పాడు; బదులుగా, నా ఆజ్ఞకు కట్టుబడి ఉండండి. మీ జీవితం నా మాటలతో పరిపాలించబడును గాక. అపొస్తలుడైన పౌలు కొలొస్సయులకు 2:8లో కూడా ఇలా హెచ్చరించాడు, "ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి." కాబట్టి, దేవుని యొక్క అనేక విధాల శక్తిని పొందకుండా మిమ్మల్ని అడ్డుకుంటున్న ఏ సంప్రదాయాన్ని మీరు కలిగి ఉన్నారా?

చాలామంది క్రైస్తవులు ప్రభువును లోతుగా ప్రేమిస్తున్నప్పటికీ, 1 కొరింథీయులకు 12:7-10లో జాబితా చేయబడిన పరిశుద్దాత్మ యొక్క తొమ్మిది వరములు నేటికీ కార్యములో ఉన్నాయని కొందరు నమ్మరు. చివరి అపొస్తలుడైన యోహాను మరణించిన తర్వాత అద్భుత స్వస్థత ఆగిపోయిందని వారిలో కొందరు నమ్మవచ్చు. ఈ విశ్వాసులు బైబిల్ను విశ్వసిస్తున్నారని చెప్పినందున వారు "అవిశ్వాస విశ్వాసులు"గా పరిగణించబడవచ్చు, కానీ మానవ నిర్మిత వేదాంత సంప్రదాయాలకు కట్టుబడి ఉండటం వలన పరిశుద్దాత్మ శక్తిని పూర్తిగా స్వీకరించకుండా నిరోధించే ఆధ్యాత్మిక అవరోధం ఏర్పడుతుంది.

ఈ అడ్డంకి హీబ్రూ ప్రజలు ఎదుర్కొన్న ప్రాకారము గల నగరాల మాదిరిగానే ఉంది, ఇది వారి వాగ్దాన భూమిని పొందుకోకుండా  నిరోధించింది. అవరోధం నుండి ముందుకు సాగడం కంటే, నిష్క్రియంగా మారడం మరియు ఆధ్యాత్మిక వరములు వారి "ఒక కప్పు టీ" కానందున వాటిని కొట్టివేయడం సులభం అవుతుంది. కాబట్టి, ఇప్పటి నుండి, ప్రతి సంప్రదాయాన్ని మరియు సాంస్కృతిక విలువను దేవుని వాక్యంతో తూకం వేయండి. దేవుని సంతోషపెట్టి, ఆయన చిత్తం నెరవేర్చిన తర్వాత మీ హృదయం ఉపొంగును గాక. మీరు అలా చేసినప్పుడు, మీ జీవితం అలౌకిక ప్రత్యక్షతకు ఒక వేదిక అవుతుంది.

Bible Reading: Ruth 2-4
Prayer
తండ్రీ, యేసు నామములో, నీ వాక్యము నుండి నేను పొందిన వెలుగుకై వందనాలు. నీ వాక్యముకు లోబడి ఉండేందుకు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యంలోని సత్యము నా జీవితాన్ని నడిపించును గాక. నీ కృప ఇలాగే కురిపిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను.

Join our WhatsApp Channel


Most Read
● దేవుడు ఈరోజు నాకు పొందుపర్చగలడా?
● మీ జీవితంలో శాశ్వతమైన మార్పులను ఎలా తీసుకురావాలి - 2
● మీరు దేని కోసం వేచి ఉన్నారు?
● మీరు ద్రోహాన్ని అనుభవించారా
● ఇతరులతో శాంతియుతంగా జీవించండి
● సమయాన్ని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలి
● 11 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
Comments
CONTACT US
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
Email: [email protected]
Address :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
GET APP
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
Events
Live
NoahTube
TV
Donation
Manna
Praises
Confessions
Dreams
Contact
© 2025 Karuna Sadan, India.
➤
Login
Please login to your NOAH account to Comment and Like content on this site.
Login