english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. ప్రభువులో మిమ్మల్ని మీరు ఎలా ప్రోత్సహించుకోవాలి (ధైర్యపరుచుకోవాలి)
ಅನುದಿನದ ಮನ್ನಾ

ప్రభువులో మిమ్మల్ని మీరు ఎలా ప్రోత్సహించుకోవాలి (ధైర్యపరుచుకోవాలి)

Saturday, 12th of July 2025
1 0 393
Categories : భావోద్వేగాలు (Emotions)
1 సమూయేలు 30లో, సిక్లగునకు తిరిగి వచ్చిన తరువాత, దావీదు మరియు అతని జనులు అమాలేకీయులు దాడి చేశారని మరియు ఎవరినీ చంపకుండా తమ భార్యలను మరియు పిల్లలను బందీలుగా తీసుకుని వెళ్లారని తెలుసుకున్నారు.

దావీదు మరియు అతని జనులు విధ్వంసం చూసినప్పుడు మరియు వారి కుటుంబాలకు ఏమి జరిగిందో తెలుసుకున్నప్పుడు, వారు ఇకపై లేరని తలచుకొని ఏడ్చారు.

దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. (1 సమూయేలు 30:6)

గమనించండి, నిరుత్సాహం అతనిని బాదపెట్టడానికి దావీదు అనుమతించలేదు. బదులుగా, అతడు ప్రభువును బట్టి తనకు తాను ధైర్యము మరియు బలోపేతం చేసుకోవడానికి ఒక ఎంపిక చేసుకున్నాడు. మీకు మద్దతు ఇవ్వడానికి, మీ చేయి పట్టుకోవడానికి ఎవరూ లేని సందర్భాలు ఉంటాయి; అలాంటి సమయాల్లో చాలా మంది ఎప్పటికీ పైకి లేవకుండా పడిపోయారు. ఇలాంటి పరిస్థితి మీకు రాకూడదని నేను ప్రవచిస్తున్నాను. లెమ్ము! ప్రభువులో మిమ్మల్ని మీరు ధైర్యపరచుకొనుడి

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దావీదు ప్రభువులో తనకు తాను బలపరచుకున్నప్పుడు, అతని జనులు కూడా అతని వద్దకు తిరిగి వచ్చారు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ప్రభువులో మికై మీరు ధైర్యపరచుకోనినప్పుడు, ఆ ధైర్యము అంటువ్యాధిగా మారుతుంది. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

దావీదు తనకు తాను ప్రభువును బట్టి ఎలా ధైర్యపరచుకున్నాడో బైబిల్లో స్పష్టంగా లేదు. బహుశా, అతడు తన వీణను తీసుకొని, ఒంటరి ప్రదేశానికి వెళ్లి, దేవుని స్తుతి ఆరాధన పాటలు పాడటం ప్రారంభించాడేమె. దావీదుకు పాడాలని అనిపించకపోవచ్చు, కానీ అతడు దానిని ఎలాగో అలా చేసాడు.

మీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను పెంచడానికి నిరాకరించండి. దానికి బదులుగా, ప్రభువును ఘనపరచండి. మీ హెడ్‌ఫోన్‌లను ధరించుకొని, కొంత ఆరాధన పాటలు వినండి మరియు ఆయన నామాన్ని ఘనపరచు. లేదంటే మీరు మీ బైబిల్ను తెరిచి, గ్రంథంలోని ప్రోత్సాహకరమైన భాగాన్ని బిగ్గరగా చదవవచ్చు. మీ ఆత్మీయ మనిషి వాక్యం పలికే మీ స్వరాన్ని ఎంచుకుంటాడు మరియు మీ ఆత్మీయ మనిషిలో విశ్వాసం పుడుతుంది. (రోమీయులకు 10:17)

దేవుని యొక్క గొప్ప దాసుడు ఒకసారి ఇలా అన్నాడు, "మీరు దేవుని గొప్పగా చేసినప్పుడు, మీ కష్టాలను చిన్నదిగా చేస్తారు." శక్తివంతముగా, ఉంది కాదా? ఈ విధంగా మిమ్మల్ని మీరు ప్రభువును బట్టి ధైర్యపరుచకోవచ్చు. విజయం త్వరలో మీ సొంతమవుతుంది! మీ సాక్ష్యం వినడానికి నేను ఎదురు చూస్తున్నాను.
ಪ್ರಾರ್ಥನೆಗಳು
దయగల తండ్రీ, నీవే నా నిరీక్షణ మరియు బలం అని నేను నీకు వందనాలు చెల్లిస్తుతున్నాను. నీవు నన్ను ఎన్నటికీ విఫలం చేయవని తెలుసుకొని నేను నీ మీదే ఆధారపడుతున్నాను. యేసు నామంలో ఆమేన్.



Join our WhatsApp Channel


Most Read
● క్రైస్తవులు దేవదూతలను ఆజ్ఞాపించవచ్చా?
● విశ్వాసం యొక్క సామర్థ్యము
● కుమ్మరించుట
● 21 రోజుల ఉపవాసం: 5# వ రోజు
● దానియేలు ఉపవాసం
● ప్రార్థనలో వచ్చే కలవరముపై ఎలా విజయం సాధించాలి
● దయాళుత్వము చాలా ముఖ్యమైనది
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್