english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. సాతాను మీకు అప్పగించిన పనిని ఎలా అడ్డుకుంటాడు
ಅನುದಿನದ ಮನ್ನಾ

సాతాను మీకు అప్పగించిన పనిని ఎలా అడ్డుకుంటాడు

Saturday, 2nd of August 2025
0 0 435
Categories : కలవరము (Distraction) ప్రలోభం (Temptation) విడుదల (Deliverance) సంబంధాలు (Relationships)
శత్రువు (దుష్టుడు) వారి దైవిక నియామకాన్ని ( అప్పగించిన పనిని) నెరవేర్చకుండా అడ్డుకోవడానికి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అమలు చేసే అత్యంత విజయవంతమైన సాధనాలలో కలవరము ఒకటి.

మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. (లూకా 10:42)

శత్రువు చేయాల్సిందల్లా మన పిలుపు యొక్క ప్రాథమిక పనిని నుండి మన దర్శనాన్ని మళ్లించడం. శత్రువు విజయవంతంగా చాలా విషయాలపై మన దృష్టిని మళ్ళించాడు. చాలా మంది అన్ని వైపులా నడవడం ప్రారంభించినప్పుడు మరియు బహుశా సమాజంలో, చెడినా మరియు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది.

కొన్ని సంవత్సరాల్లుగా, శత్రువు దేవుడిచ్చిన నియామకం నుండి ప్రజలను ఎలా దూరం చేస్తున్నాడో నేను చూశాను. కొంతమందికి, వాడు మద్యాన్ని అలవాటు చేసాడు; కొంతమందికి, వాడు మాదక ద్రవ్యం మరియు ఇతర పదార్థాలను అలవాటు చేసాడు. కొంతమందికి, వాడు ప్రమాదకరంగా అనిపించే ఇంటర్నెట్ గేమ్‌లను అలవాటు చేసాడు, అది ప్రజలను రోజుకు గంటల పాటు బంధిస్తుంది. ఫలితం లేని రోజులు మరియు వారాలు గడిచిపోతాయి.

ఒక పాస్టర్ గారు ఒకసారి తమ సంఘంలో జరిగిన ఒక నిజమైన సంఘటన గురించి నాతో పంచుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక యువతి వారి సభలకు క్రమం తప్పకుండా హాజరయ్యేది. ఆమె చాలా ప్రార్థనాపరురాళ్లు మరియు పరిశుద్ధాత్మతో నిండి ఉండేది. ఆమె గాయక బృందానికి నాయకత్వం వహించేది, లేఖనాలను అభ్యసించేది, ప్రజల కోసం ప్రార్థించేది.

ఒక మంచి రోజు, ఒక అబ్బాయి వారి సభలకు హాజరు కావడం ప్రారంభించాడు. అతడు సంఘంలో సరిగ్గా నిలదొక్కుకోలేదు. త్వరలో ఈ అమ్మాయి అతనితో మాట్లాడింది మరియు కొంత సాకుతో ఆరాధనలను దాటవేసింది. ఇంకా మూడు నెలలు కూడా కాలేదు, మరియు పాస్టర్‌కు ఆ అమ్మాయికి వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి. సంఘం విషయం పక్కన పెడితే, ఆ తర్వాత నగరమంతటా క్రైస్తవ సమావేశాలలో కూడా ఆమె కనిపించలేదు. చాలా విచారకరం కానీ వాస్తవికమైనది!

ప్రజలను వారికి అప్పగించిన పనిని నుండి ఆకర్షించడానికి దుష్టుడు తగని సాంగత్యాలను ఉపయోగిస్తాడు. ఇప్పుడు నేను ప్రతి సాంగత్యము తప్పు అని చెప్పడం లేదు. అయితే, సరైన సమయంలో సరైన సాంగత్యము కూడా విపత్తు కావచ్చు.

శత్రువుల వలలో పడకుండా ఉండాలంటే మనకు వివేచన మరియు సరైన సలహా అవసరం. "నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము" (సామెతలు 11:14)

బైబిలు మనల్ని హెచ్చరిస్తుంది "నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు" (1 పేతురు 5:8)

Bible Reading: Isaiah 35-37
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, యేసు నామంలో, నేను నిన్ను వివేచనకై వేడుకుంటున్నాను. నీ మీ మార్గాల్లో నేను ఎదగడానికి సహాయపడే సరైన వ్యక్తులతో నన్ను చుట్టుముట్టు. తండ్రీ, యేసు నామంలో, నా దైవిక నియామకం నుండి నాకు ఆటంకం కలిగించే ప్రతి కలవరమును నేను బంధిస్తున్నాను. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● 29 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● పురాతన మార్గములను గూర్చి విచారించుడి
● ఆయన పరిపూర్ణ ప్రేమలో స్వాతంత్య్రము పొందుకోవడం
● ఆరాధనను ఒక జీవన విధానంగా మార్చుకోవడం
● స్థిరత్వం యొక్క సామర్థ్యం
● ధారాళము యొక్క ఉచ్చు
● మరొక అహాబు కావద్దు
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್