english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. ప్రవచనాత్మకమైన మధ్యస్తము
ಅನುದಿನದ ಮನ್ನಾ

ప్రవచనాత్మకమైన మధ్యస్తము

Wednesday, 13th of August 2025
1 0 424
Categories : ప్రార్థన (Prayer) మధ్యస్త్యం (Intercession)
యాకోబు కుమారులు ఐగుప్తు చేరుకున్న దృశ్యం. వారు తమ సోదరుడైన యోసేపును కలిశారు, కానీ అతడు ఇప్పటికీ వారికి తనకు తాను ఎవరని వెల్లడించకోలేదు. యోసేపు తన సహోదరుల హృదయాలు నిజంగా మారిపోయాయా లేదా అని తనిఖీ చేయడానికి మరొక పరీక్షను అమలులోకి తెచ్చాడు.

యోసేపు తన నిర్వాహకుడు బెన్యామీను గోనెలో తన వెండి గిన్నె వేయమని అడిగాడు. తనిఖీ ప్రక్రియలో, వెండి గిన్నె బెన్యామీను వద్ద కనుగొనబడింది, వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సోదరుడు ఐగుప్తుకు తిరిగి వచ్చారు.

మళ్ళీ, సోదరులందరూ నిశ్శబ్దంగా ఉన్నారు (బహుశా, వారు మాట్లాడటానికి చాలా ఆశ్చర్యపోయారు). అయినప్పటికీ, తన సోదరుడైన బెన్యామీను తరపున మధ్యస్తము (విజ్ఞాపన) చేసే బాధ్యతను యూదా తీసుకుంటాడు.

మనము ఈ దృశ్యము ఆదికాండము 44:32-33లో గమనించగలము
యూదా యోసేపును వేడుకున్నాడు, "తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని. 33 కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము." (ఆదికాండము 44:32-33)

విజ్ఞాపన ప్రార్థన చేయు వారు విజ్ఞాపన చేస్తున్న వ్యక్తి స్థానంలో ఉంటారు.

యోసేపు గమనించాడు; అతని సోదరులు వ్యక్తిగత లాభం కోసం తమ సొంత సోదరుడిని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వారిలో తీవ్రమైన మార్పు కనిపిస్తోంది. ఒకరు మరొకరి కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చెరసాలలో ఉన్న బెన్యామీను స్థానంలో ఉండటానికి యూదా సిద్ధమయ్యాడు. యోసేపు తన సహోదరులలో వచ్చిన ఈ మార్పును చూసి వారికి తనను తాను వెల్లడిపరచుకుంటాడు. (ఆదికాండము 45:1-3 చదవండి)

ఇది చాలా ప్రవచనాత్మకమైనదని నేను నమ్ముతున్నాను. నేడు, ప్రతి క్రైస్తవుడు తన దీవెనలు, తన కుటుంబం, తన సంఘం, తన పరిచర్య మొదలైన వాటి గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తున్నాడు. దీనికి కారణం నేను, నేనే మరియు నా గురించి. మనం త్యాగం చేసే విజ్ఞాపన ప్రార్థనలోకి ప్రవేశించినప్పుడు, ఒకరి కోసం ఒకరు విజ్ఞాపన చేసినప్పుడు, ప్రభవు మనకు అర్థం చేసుకోలేని మార్గాల్లో తనకు తాను వెల్లడిపరచుకుంటాడు.

పరిశుద్ధాత్మ ఈ విషయాన్ని నా హృదయ లోతుల్లో చాలా బలంగా నాటాడు. యూదా విజ్ఞాపన ప్రార్థన యోసేపు తన సోదరులకు వెల్లడి పరచుకున్నాడు. మీ విజ్ఞాపన ప్రార్థన కోల్పోయిన చాలా మందికి క్రీస్తును వెల్లడిపరుస్తుంది.

Bible Reading: Jeremiah 7-9
ಅರಿಕೆಗಳು

1. నేను ప్రభువైన యేసుక్రీస్తును నా ప్రభువు, దేవుడు మరియు రక్షకునిగా విశ్వసిస్తున్నాను కాబట్టి, నేను మరియు నా ఇంటివారు రక్షింపబడ్డామని నేను ఆజ్ఞాపిస్తున్నాను! (అపొస్తలుల కార్యములు 16:13, యోబు 22:28)

2. నా పిల్లలు (మీ పిల్లల పేర్లను పేర్కొనండి) సురక్షితంగా నిలిచియుందురు మరియు కొనసాగుదురు మరియు వారి సంతానము నీ యందు స్థిరపరచబడుదురు. (కీర్తనలు 102:28)

3. తండ్రీ, యేసు నామములో, నా కుటుంబ సభ్యులను (వారి పేర్లను పేర్కొనండి) నీ చేతుల నుండి ఎవరు అపహరింపలేరని నేను అంగీకరిస్తున్నాను. (యోహాను 10:29)



Join our WhatsApp Channel


Most Read
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #1
● గొప్ప ఉద్దేశాలు జరగడానికి చిన్న చిన్న కార్యాలు
● గొప్ప ప్రతిఫలము ఇచ్చువాడు
● ఆరాధన: సమాధానమునకు మూలం
● విశ్వాసం: ప్రభువును సంతోషపెట్టడానికి ఖచ్చితమైన మార్గం
● దేవదూతల సైన్యం మన పక్షమున ఉన్నారు
● ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క నిశ్శబ్ద నిరోధకము
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್