english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. ఆయన చిత్తాన్ని చేయడం యొక్క ప్రాముఖ్యత
ಅನುದಿನದ ಮನ್ನಾ

ఆయన చిత్తాన్ని చేయడం యొక్క ప్రాముఖ్యత

Wednesday, 10th of September 2025
0 0 465
Categories : దేవుని చిత్తం (Will of God) శిష్యత్వం (Discipleship)
ఒక వ్యక్తికి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం ఎందుకు చాలా ముఖ్యమైనది?

"ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. (మత్తయి 7:21)

దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడ భూమిపై అలాగే శాశ్వతత్వంలో మన ఆనందాన్ని నిర్ణయిస్తుంది. కేవలం పెదవి (మాట) సేవ మిమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. మన జీవితాల్లో ప్రతి ఒక్కరికీ దేవుని చిత్తం గురించి సరైన అవగాహన పొందడం నిజంగా చాలా అవసరం.

మారుతున్న లోకంలోని తత్వాలు మరియు మానవుల అభిప్రాయాల ప్రకారం మన జీవితాలను ఆధారం చేసుకోకుండా చూసుకోవాలి. మనం జ్ఞానవంతులమై ప్రభువు చిత్తం ఏమిటో అర్థం చేసుకోవాలి. (ఎఫెసీయులకు 5:17) ప్రభువు చిత్తాన్ని అర్థం చేసుకోవడం అంటే మనం దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం మరియు ఆయన చిత్తం పర్యాయపదాలు (దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి).

మీరు ఇద్దరు సోదరులు, కయీను మరియు హేబెలును గుర్తుంచుకుంటే. హేబెలు దేవునికి కావలసిన దానిని దేవునికి అర్పణను తీసుకువచ్చాడు మరియు కయీను సరైనదని భావించిన దానిని తీసుకువచ్చాడు. అంతిమ ఫలితం ఏమిటంటే, హేబెలు త్యాగాన్ని దేవుడు సన్మానించాడు మరియు కయీను త్యాగం తిరస్కరించబడింది. (ఆదికాండము 4:3-5 చదవండి)

హెబ్రీయుల గ్రంథం, హేబెలు కయీను కంటే శ్రేష్ఠమైన బలి అర్పిచాడనే వాస్తవాన్ని నొక్కి చెబుతోంది.

విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. (హెబ్రీయులకు 11:4)

మనమందరం - మనది కాకుండా దేవుని ప్రణాళికలను అమలు చేయడానికి మరియు ఆయన చిత్తాన్ని చేయడానికి ఈ భూమిపై ఉన్నాము.

మనం ఏదైతే నిర్మిస్తున్నామో, ఏది అమలు చేయాలని ప్రణాలిక చేస్తున్నామో అది ఆయన చిత్తం మరియు విధానాల ప్రకారం ఉండాలి. "నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను." (నిర్గమకాండము 25:8-9)

మోషే పర్వతంపై తనకు చూపించిన పద్దతి ప్రకారం గుడారాన్ని నిర్మించడానికి తగినంత తెలివైనవాడు. అతడు అలా చేసిన తర్వాత, "యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండ చేసెను" అని బైబిలు చెబుతోంది. (నిర్గమకాండము 40:34-35)

మీరు మొత్తం (నిర్గమకాండము 40) అధ్యాయం చదివితే, గుడారాన్ని నింపడానికి ప్రభువు తేజస్సు కోసం మోషే ప్రార్థించలేదని కూడా మీరు గమనించవచ్చు.

నేను మీతో ఒక లోతైన రహస్యాన్ని పంచుకుంటున్నాను: ప్రభువు మీకు చూపిన విధానాల ప్రకారం పనులు జరిగినప్పుడు, దేవుని చిత్తానుసారంగా పనులు జరిగినప్పుడు, దేవుని మహిమ అక్షరాలా అలాంటి ప్రాజెక్ట్, వెంచర్‌కు , ఒక పరిచర్య , ఒక వ్యక్తి కట్టుబడి ఉంటుంది లేదా అనుసరిస్తుంది.

Bible Reading: Ezekiel 25-27
ಅರಿಕೆಗಳು
నేను తండ్రిని ఆత్మతో మరియు సత్యంతో ఆరాధిస్తాను. నేను క్రీస్తు యేసు నా కోసం చేసినదానిపై మాత్రమే ఆధారపడతాను మరియు మానవ ప్రయత్నంపై నేను నమ్మకం పెట్టుకొను. యేసు నామంలో. (ఫిలిప్పీయులకు 3:3)


Join our WhatsApp Channel


Most Read
● మరొక అహాబు కావద్దు
● జీవన నియమావళి
● ప్రబలంగా ఉన్న అనైతికత మధ్య స్థిరంగా ఉండడం
● పరిపక్వత బాధ్యతతో మొదలవుతుంది
● మూడు పరిధులు (రాజ్యాలు)
● కోల్పోయిన రహస్యం
● శూరుల (రాక్షసుల) జాతి
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್