english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. మీరు ప్రభువును వ్యతిరేకిస్తున్నారా?
ಅನುದಿನದ ಮನ್ನಾ

మీరు ప్రభువును వ్యతిరేకిస్తున్నారా?

Sunday, 8th of September 2024
0 0 848
Categories : గర్వము (Pride) విడుదల (Deliverance)
ఒకసారి సంఘ సభ్యుడు ప్రవచనాత్మక వరములలో బాగా ఉపయోగించబడుతున్న తన పాస్టర్ గారి దెగ్గరికి వెళ్ళాడు  మరియు ఇలా అడిగాడు "పాస్టర్ గారు, ఏ ఆత్మ నన్ను వ్యతిరేకిస్తుందో మీరు నాకు చెప్పగలరా?" పాస్టర్ గారి జవాబు కోసం ఆ సంఘ సభ్యుడు చాలా ఆకర్షియమైన సమాధానం కోసం ఎదురు చూస్తూనప్పుడు, అప్పుడు పాస్టర్ గారు ఇలా సమాధానము ఇచ్చారు, "దేవుని ఆత్మ మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది ఎందుకంటే మీరు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు"

దయచేసి కింది లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించండి:
కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదినిఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. (యాకోబు4:7)

విశ్వాసమందు స్థిరులై వానిని (అపవాదిని) ఎదిరించుడి. (1పేతురు5:9)

ఒక క్రైస్తవుడు మొదట దేవునికి లోబడాలి, అప్పుడు అపవాదిని ఎదిరించాలని పై లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. శత్రువు యొక్క ప్రతి చెడు పథకాన్ని మనం ఈ విధంగా అధిగమించగలము.

మంచి శుభవార్త ఏమిటంటే, క్రైస్తవులలో చిన్నవాడు కూడా క్రీస్తులో బలంగా నిలబడటం ద్వారా శత్రువు యొక్క అత్యంత చీకటి శక్తులను విజయవంతంగా ఎదుర్కోగలడు. ఏదేమైనా, తరచుగా పట్టించుకునే ఒక అంశం ఉంది మరియు అక్కడే అన్ని సమస్యలు తలెత్తుతాయి.

దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. (యాకోబు4:6)

.....మీరందరుఎదుటివానియెడలదీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మునుఅలంకరించుకొనుడి; "దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును." (1పేతురు5:5)

దేవుని బలంతో మనం అపవాదినిఎదిరించాలనేది వాస్తవం. అయినప్పటికీ, చాలా సార్లు క్రైస్తవులు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు. గర్వము అనేది దేవునికి, ఆయన మార్గాలకు ఆటంకము. ప్రభువు స్వయంగా మనల్ని వ్యతిరేకించినప్పుడు ఇది జరుగుతుంది.

సంఖ్యకాండము22బిలాము అనే వ్యక్తి గురించి చెబుతుంది.

స్పష్టంగా బిలాము గొప్ప ఖ్యాతిని నెలకొల్పాడు! అతడు ఒక వ్యక్తిని శపించినట్లయితే, అతను శపించబడుతాడు మరియు అతడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడుతారు. బిలాముకుప్రభువు గురించి తెలుసు, ఆయన చేశాడని అందరికీ తెలుసు. మోయాబీయులతో వెళ్లవద్దని యెహోవాబిలాముతో స్పష్టంగా చెప్పాడు, అయినా బిలాము వెళ్ళాడు. (సంఖ్యాకాండము22:21)

అప్పుడు అతడు వెళ్ళినందున దేవుని కోపం (బిలాముకు వ్యతిరేకంగా) రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అంతలో యెహోవాబిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్నయెహోవా దూతను అతడు చూచెను… (సంఖ్యాకాండము22: 22,31)

మనం దేవుణ్ణి ఎదిరించినప్పుడు, ఆయన మనలనుఎదురిస్తాడు. అటువంటి పరిస్థితులలో మన ఆటంకము పూర్తిగా వ్యర్థం. వినయము గర్వానికి వ్యతిరేకం.

మీ జీవనశైలిలోని కొన్ని ప్రదేశాలను మార్చడం గురించి ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు మరియు మీరు మార్పును నిరవధికంగా వాయిదా వేస్తున్నారు. ఒక ప్రత్యేకమైన ఆర్థిక పరమైన విత్తనాన్ని విత్తాల్సిన అవసరము ఉందేమో, ఒకరిని క్షమించాల్సిన అవసరం ఉందేమో లేదా ప్రార్థన కోసం ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించడం వంటివి ప్రభువు మీపై ఆకట్టుకుంటాడు. ఏమైనప్పటికీ, ఇకపై ఆయనను ఎదురించకుండా  దేవుని యందు మీకు మిరైలోబడియుండుడి.

మీరు అభివృద్ధిని చూడకపోవచ్చు మరియు గర్వం సమస్యల కారణంగా వ్యతిరేకం ప్రభువు నుండే రావచ్చు కాబట్టి మీరు దాని కోసం అపవాదిని నిందిస్తున్నారు. మీరు ఏ విధంగానైనా ప్రభువును వ్యతిరేకిస్తున్నారా?
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, యేసు నామములో, నీ వాక్యానికి శ్రద్ధ చూపకుండా నిన్ను వ్యతిరేకిస్తూనందుకు నన్ను క్షమించు. నీ వాక్యాన్ని వెంటనే పాటించే మనసు నాకు దయచేయి. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 2
● వారు చిన్న రక్షకులు
● హన్నా జీవితం నుండి పాఠాలు
● ఒక విజేత కంటే ఎక్కువ
● అగాపే ప్రేమలో ఎలా వృద్ధి చెందాలి
● విత్తనం యొక్క గొప్పతనం
● మనుష్యుల పారంపర్యాచారము (సంప్రదాయాలు)
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್