english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. దైవిక క్రమశిక్షణ గల స్వభావం - 1
ಅನುದಿನದ ಮನ್ನಾ

దైవిక క్రమశిక్షణ గల స్వభావం - 1

Wednesday, 30th of October 2024
1 0 824
Categories : క్రమశిక్షణ (Discipline) శిష్యత్వం (Discipleship)
ఒలింపిక్ క్రీడాకారులు భూమి మీద అత్యంత క్రమశిక్షణ, నిశ్చయత మరియు అంకితభావం ఉన్న వ్యక్తులలో ఉంటారు. ఒలింపిక్ క్రీడాకారుడు ప్రతిరోజూ స్వీయ-క్రమశిక్షణను అభ్యసించాలి, లేదంటే గెలుపుపై ఉన్న ఆశలన్నీ పోతాయి.

ఇది లేఖనంలో అపొస్తలుడైన పౌలు వ్రాసిన విషయం, "పందెపు రంగమందు పరుగెత్తు వారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి." (1 కొరింథీయులు 9:24)

క్రైస్తవ జీవితాన్ని కూడా ఒలింపిక్ క్రీడాకారునితో పోల్చవచ్చు. మన మందరం కృప ద్వారా రక్షించబడ్డాము మరియు కృపతో జీవిస్తున్నాము అనేది చాలా నిజం. అయితే, అపొస్తలుడైన పౌలు ఏమి వ్రాశాడో ఒకసారి గమనించండి: "అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే" (1 కొరింథీయులకు 15:10)

ఈ రోజు మనం ఏమైయున్నామో అది దేవుని కృప వల్ల మాత్రమే. అపొస్తలుడైన పౌలు దానిని అంగీకరించాడు. అయితే, అతడు ఇంకా ఇలా అంటున్నాడు, "వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని." మరో మాటలో చెప్పాలంటే, దేవుడు తన వంతు పని చేసాడు, ఇప్పుడు పౌలు కూడా తన వంతు కృషి చేస్తున్నాడు.

ఒక క్రైస్తవుడు మొదట వెలను లెక్కించకుండా ప్రభువుతో నడవలేడు. సహజంగా చెప్పాలంటే, యేసుని వెంబడించడంలో వెల ఉంటుంది. యేసు దేని గురించి దాచి ఉంచ లేదు. యేసయ్య దగ్గర శ్రేష్టమైన గుర్తు లేదు: ఇదంతా చాలా స్పష్టంగా ఉంది.

మీలో ఎవ డైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? (లూకా 14:28)

మన సిలువను ఎత్తుకొమని మరియు శరీర కోరికలను తిరస్కరించమని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు, లేదంటే మనము పందెమును పూర్తి చేయకపోవచ్చు. అందువల్ల, మనం వెలను లెక్కించాలి మరియు మన ప్రవర్తనలో వ్యక్తిగత-క్రమశిక్షణతో ఉండాలి.

అపొస్తలుడైన పౌలు యొక్క గొప్పతనం మరియు ప్రభావ రహస్యం ఈ వచనాలలో ఉంది: మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను. (1 కొరింథీయులు 9:25-27)
ಪ್ರಾರ್ಥನೆಗಳು
నేను విశ్వాసం నుండి విశ్వాసం, మహిమ నుండి మహిమ వరకు యెదుకుతున్నాను. ప్రభువు నా పక్షాన ఉన్నాడు, కాబట్టి ఎవరు నాకు విరోధిగా నిలబడగలరు. నేను యేసును వెంబడించాలని నిర్ణయించుకున్నాను, వెను తిరుగను, వెను తిరుగను.

Join our WhatsApp Channel


Most Read
● ప్రభువులో మిమ్మల్ని మీరు ఎలా ప్రోత్సహించుకోవాలి (ధైర్యపరుచుకోవాలి)
● హామీ గల సంతృప్తి
● మీరు ఒక ఉద్దేశ్యం కొరకై జన్మించారు
● మొలకెత్తిన కఱ్ఱ
● 20 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● ప్రేరేపించే జ్ఞానం (బుద్ది) మరియు ప్రేమ
● వాక్యం ద్వారా వెలుగు వస్తుంది
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್