3 నా తండ్రికి (దావీదు) నేను (సొలొమోను) కుమారుడుగా నుంటిని నా తల్లి (బత్షెబా) దృష్టికి నేను సుకుమారుడనైనయేకకుమారుడనైయుంటిని.
4 ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు. (సామెతలు 4:3-4)
దావీదు సొలొమోనుకు దేవుని నుండి నేర్చుకున్న జ్ఞానాన్ని మరియు సత్యాన్ని బోధించాడు. సొలొమోను జ్ఞానానికి విలువ ఇవ్వడం నేర్చుకున్నాడు మరియు దానిని తన దగ్గరికి వచ్చే వారందరికి అందించాడు. అతడు రాజు అయ్యాక, దేశాన్ని పరిపాలించడానికి తనకు ఇంకా గొప్ప జ్ఞానాన్ని ఇవ్వమని పరలోకపు తండ్రిని కోరాడు. (2దినవృత్తాంతములు1:9–12 చూడండి.)
దేవుడు మలుపులను అనుమతిస్తాడని మనం తరచుగా వింటుంటాము. దాని అర్థం ఏమిటంటే, మనం తప్పు చేసి, సరిగ్గా లేని రహదారిపై వెళితే, దేవుడు మలుపులను అనుమతిస్తాడు, తద్వారా మనం సరైన మార్గంలో తిరిగి వస్తాము. అయితే దీనిపై వాక్యము ఏం చెబుతుందో ఒకసారి గమనించండి.
దేవుడు మనకు ఆ మలుపులను అనుమతించడానికి కృప మరియు దయగలవాడు. కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు ఎక్కువ మలుపులను తీసుకుంటే, మీరు నిజంగా ఉండాల్సిన చోటికి చేరుకోవడంలో మీరు సమయాన్ని వృధా చేసుకుంటారు. (సామెతలు 4:10-15 MSG)
నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.
నీ కన్నుల యెదుట నుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసికొనుము.
అది దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. (సామెతలు 4:20-22)
ప్రభువైన యేసు సెలవిచ్చాడు, నా మాటలు జీవమునైయున్నవి. (యోహాను6:63) దేవుడు యెహోషువతోదివారాత్రము వాక్యాన్ని ధ్యానిస్తే నీవు వర్ధిల్లుతావు, మరియు గొప్ప విజయం సాధిస్తావని చెప్పాడు. జీవితాన్ని మరియు దీవెనలను పొందుకోవడానికి, మీరు దేవుని వాక్యాన్ని ఎంచుకోవాలి. మీరు సమస్యాత్మక-మనస్సుకు బదులుగా వాక్యపు-మనస్సు గలవారు, మరణ-మనస్సుకు బదులుగా జీవపు-మనస్సు గలవారుగా మారాలి. మీరు దేవుని వాక్యంపై ఏక-మనస్సు కలిగి ఉండాలి.
నీ కన్నులు ఇటు అటు చూడకసరిగాను
నీ కనురెప్పలు నీ ముందర సూటిగానుచూడవలెను. (సామెతలు 4:25)
వాక్యం నుండి ఈ ఒక్క ఉపదేశం మనల్ని మోహము బారిన పడకుండా చేస్తుంది.
Join our WhatsApp Channel
Chapters