1 నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము,
నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము.
2 అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను
శాంతిని నీకు కలుగజేయును. (సామెతలు 3:1-2)
నా ఉపదేశమును మరువకుము
దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ మన జీవితాలకు కేంద్రంగా ఉంచుకోవాలని ఇక్కడ జ్ఞాపకం చేయుచున్నాడు. అయిన కొందరు చదవకుండా, అధ్యయనం చేయకుండా, ధ్యానం చేయకుండా రోజుల తరబడి గడిపే సందర్భాలు ఉన్నాయి.
నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము
ఆయన ఆజ్ఞలను పాటించమని లేఖనాలు మన హృదయాలను ఉపదేశిస్తున్నాయని గమనించండి. ఆజ్ఞలను పాటించడం అనేది కేవలం 'కంటి సేవ' మాత్రమే కాకుండా అంతర్గతంగా లోతుగా ప్రతిధ్వనిస్తుంది. మనము ఆజ్ఞలను పాటిస్తున్నామని బాహ్యంగా చూపించే సందర్భాలు ఉండవచ్చు కానీ బహుశా కొన్ని సందర్భాలలో అంతర్గతంగా కాకపోవచ్చు.
ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనడం వల్ల రెండు ముఖ్యమైన ప్రయోజనాలు
1. దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములు ఉండును
2. శాంతి మీకు కలుగజేయును.
షాలోమ్ - శాంతి, అంటే సంక్షేమం మరియు సమృద్ధి, క్రమం మరియు సామరస్యం.
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక
నీ పూర్ణహృదయముతోయెహోవాయందు నమ్మక ముంచుము (సామెతలు 3:5)
మన స్వబుద్ధిపై ఆధారపడకూడదని బైబిలు ఈ వచనంలో చెప్పినప్పుడు, అది అహేతుకంగా ఉండమని ప్రోత్సహించడం లేదు. మన "స్వబుద్ధిపై" ఆధారపడకూడదని మనకు చెప్పబడింది, అంటే ప్రాథమికంగా మన స్వబుద్ధి ఆధారంగా తీర్మానాలు ఉండకూడదు.
13 జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు (దీవించబడినవాడు, అదృష్టవంతుడు, ఆశించదగినవాడు), వివేచన [దేవుని వాక్యం మరియు జీవిత అనుభవాల నుండి నేర్చుకొనువాడు] కలిగిన నరుడు ధన్యుడు.
14 వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటెజ్ఞానలాభమునొందుట మేలు. (సామెతలు 3:13-14)
గమనించండి, వివేచన దేనిని నుండి పొందవచ్చు:
1. దేవుని వాక్యం మరియు
2. జీవిత అనుభవాలు
3. అలాగే, దానియేలు విజ్ఞాపన ప్రార్థన చేసాడు, లేఖనాల పట్ల వివేచనా దయచేయమని దేవునికి మొఱ్ఱపెట్టాడు. (దానియేలు10:12-14)