english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దేవుని వాక్యం మిమ్మల్ని అభ్యంతరపరుస్తుందా?
అనుదిన మన్నా

దేవుని వాక్యం మిమ్మల్ని అభ్యంతరపరుస్తుందా?

Saturday, 27th of September 2025
0 0 81
Categories : అపరాధం (Offence)
యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను - ''దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా?

యోహాను 6లో, యేసు తనను తాను పరలోకపు రొట్టెగా అభివర్ణించాడు. తన శరీరము మరియు రక్తము ఒక వ్యక్తిని నిత్యజీవము కొరకు పోషించునని కూడా చెప్పాడు. అది విన్న పరిసయ్యులు, సద్దూకయ్యులు జీర్ణించుకోలేక చాలా బాధపడ్డారు. తప్పుగా బోధించిన యేసును మతబోధకుడని అని వారు ముద్రవేశారు.

ఆ సమయంలో, "ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని - ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి." ఆయన శిష్యులలో చాలా మంది ఆయనను వెంబడించలేదని కూడా లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. (యోహాను 6:60,66)

ఆయన అత్యంత సన్నిహిత శిష్యులు కూడా అభ్యంతర చెందే దశలో ఉన్నారు. ఆ సమయంలో యేసు వారిని ఇలా అడిగాడు, "దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా?"

నిజమేమిటంటే, మిమ్మల్ని అభ్యంతరపరిచే విధంగా వాక్యంలో ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. క్షమాపణ గురించి ఒక సందేశాన్ని బోధించడం నాకు గుర్తుంది, మరియు నన్ను ఎగతాళి చేసిన ఒక వ్యక్తి అప్పుడు జనంలో ఉన్నాడు. అయితే, ఆ రోజు నేను బోధించిన వాక్యం అతన్ని దోషిగా నిలబెట్టింది, మరియు అతడు తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాడు. ఈ రోజు, ఈ వ్యక్తి మన సంఘ సభ్యుడు.

ఎవరైనా మన సంప్రదాయాలు లేదా భావోద్వేగాలతో సరికాని నిజాలను పంచుకున్నప్పుడు, అది మనల్ని బాధిస్తుంది మరియు అభ్యంతరపరుస్తుంది. దానిని దేవుని వాక్యంగా చూడడానికి బదులుగా మరియు మరింత అవగాహన కోసం పరిశుద్ధాత్మను అడగడానికి బదులుగా, మనం మనస్తాపం చెందుతాము.

యేసయ్య వాక్యమై, ఆ వాక్యము శరీరధారియై యుండెను, మరియు ఇక్కడ ఆయన ఏమని సెలవిచ్చాడో ఒక్కసారి గమనించండి, "మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యులు" (మత్తయి 11:6). మీరు వాక్యాన్ని మిమ్మల్ని అభ్యంతరపరచడానికి అనుమతించనప్పుడు, దానికి బదులుగా వాక్యం మిమ్మల్ని రూపించడానికి అనుమతించినప్పుడు, మీరు ధన్యులు.

Bible Reading: Hosea 11-14; Joel 1 
ఒప్పుకోలు
తండ్రీ, యేసు నామంలో, నేను నా జీవితకాలమంతయు ఆరోగ్యంగా మరియు బలముతో నడుస్తానని ప్రకటిస్తున్నాను.

దేవుడు నాకు అప్పగించిన ప్రతిదానిని ఘనంగా మరియు ఏ భేదము లేకుండా నేను ఆనందంగా నెరవేరుస్తాను. నేను జీవించే దేశంలో యెహోవా దీవెనలను మరియు క్షేమాన్ని అనుభవిస్తాను. నా జీవితకాలమంతా ఏ అభ్యంతరము లేకుండా యెహోవాను సేవిస్తాను. (కీర్తనలు 118:17 మరియు కీర్తనలు 91:16).



Join our WhatsApp Channel


Most Read
● దోషము యొక్క శక్తిని విచ్ఛిన్నం చేయడం - II
● దేవుడు సమకూరుస్తాడు
● మీరు ఒంటరితనంతో పోరాడుతున్నారా?
● తన్నుతాను మోసపరచుకోవడం అంటే ఏమిటి? - I
● పరిపక్వత బాధ్యతతో మొదలవుతుంది
● అసూయ యొక్క ఆత్మపై విజయం పొందడం
● శీర్షిక: అదనపు సామాను వద్దు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్