english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. క్రీస్తు ద్వారా జయించుట
అనుదిన మన్నా

క్రీస్తు ద్వారా జయించుట

Thursday, 11th of June 2026
0 0 32
Categories : దేవుని వాగ్దానాలు (Promises of God) విశ్వాసం (Faith)
ప్రకటన గ్రంధం అంతటా, ప్రభువైన యేసు జయించిన వారికి ఇచ్చే బహుమానములు, దీవెనలు గురించి పదేపదే మాట్లాడుతున్నాడు. జయించువానిగా ఉండడమంటే పరిపూర్ణంగా ఉండటమే కాదు, విశ్వాసంలో పట్టుదలతో ఉండడం క్రీస్తు విజయాన్ని మన జీవితాల్లో వ్యక్తపరచడం. క్రీస్తు ద్వారా జయించుట అంటే ఏమిటో తెలుసుకుందాం.
యోహాను 16:33లో, ప్రభువైన యేసు ఇలా ప్రకటించాడు, "ఈ లోకములో నీకు కష్టములు కలుగును. అయితే ధైర్యము తెచ్చుకొనుము! నేను లోకమును జయించితిని." 

సవాళ్లు, పరీక్షలు జీవితంలో అనివార్యమైన భాగమని ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది. అయితే, యేసు ఇప్పటికే మన తరపున విజయం పొందాడు. ఆయన మరణం, పునరుత్థానం ద్వారా, ఆయన పాపం, మరణం చీకటి శక్తులపై విజయం పొందాడు.

జయించువానిగా ఉండడమంటే క్రీస్తుపై మన విశ్వాసాన్ని ఉంచడం ఆయన బలంపై ఆధారపడడం, మన స్వంత శక్తి మీద కాదు. దేవుడు మనతో ఉన్నాడని, మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడని తెలుసుకోవడం, కష్టాలను సహించడం (ద్వితీయోపదేశకాండము 31:8). పరిస్థితులకు విరుద్ధంగా అనిపించినప్పటికీ, దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకోవడం దీని అర్థం. ప్రకటన 12:11లో, "గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా మరియు వారి సాక్ష్యపు వాక్యము ద్వారా" శత్రువును జయించిన వారు జయించువారు అని మనము చూస్తాం.

జయించువానిగా, క్రీస్తు మన కోసం అందించిన ప్రతి ఆధ్యాత్మిక దీవెనలు వనరులకు మనకు ప్రాప్యత ఉంది. దేవుడు తప్పించుకునే మార్గాన్ని అందిస్తాడనే హామీతో మనం శోధనను ఎదుర్కోవచ్చు (1 కొరింథీయులకు 10:13). మనం బాధలను సహించగలము, అది లక్షణమును నిరీక్షణను ఉత్పత్తి చేయును (రోమీయులకు 5:3-4). విజయవంతమైన జీవితాలను జీవించేలా చేసే పరిశుద్ధాత్మ శక్తిలో మనం నడుచుకోవచ్చు (గలతీ 5:16).

మీరు ఈరోజు సవాలు లేదా విచారణను ఎదుర్కొంటున్నారా? మీరు క్రీస్తు ద్వారా జయించిన వారని గుర్తుంచుకోండి. ఆయన ఇప్పటికే మీ కోసం గెలుపొందిన విజయాన్ని గురించి ఒకసారి ఆలోచించండి. మీ పరిస్థితిపై దేవుని వాగ్దానాలను పొందుకోండి ఆయన నమ్మకత్వంపై  విశ్వసించండి.
పరిశుద్ధాత్మ శక్తికి  ఆధారపడండి, ఆయన మిమ్మల్ని మార్గనిర్దేశం చేసేందుకు బలపరచడానికి అనుమతిస్తాడు. మీ విశ్వాసానికి కర్త,  పరిపూర్ణుడు అయిన యేసుపై మీ దృష్టిని నిలిపి ఉంచండి (హెబ్రీయులకు 12:2).

Bible Reading: Nehemiah 10-11
ప్రార్థన
పరలోకపు తండ్రీ, యేసుక్రీస్తు ద్వారా నాకు లభించిన విజయానికి వందనాలు. విశ్వాసంలో పట్టుదలతో నీ బలాన్ని విశ్వసిస్తూ జయించేవానిగా జీవించడానికి నాకు సహాయం చేయి. నీ సన్నిధి, శక్తి హామీతో ప్రతి సవాలును ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు దయచేయి. నీ ప్రేమ కృప యొక్క ఘనతకు నా జీవితం సాక్ష్యమిచ్చును గాక. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● దేవుని కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండడం
● 24వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● కేవలం ఆడంబరము కొరకు కాకుండా లోతుగా వెదకడం
● ఒక కల దేవుని నుండి వచ్చిందని ఎలా తెలుసుకోవాలి
● సరైన వ్యక్తులతో సహవాసం చేయుట
● మధ్యస్తముపై ప్రవచనాత్మకమైన పాఠం - 1
● కాలేబు యొక్క ఆత్మ
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2026 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్