బంధాలలో పునరుద్ధరణ (పునఃస్థాపనం)
కోపం ఒక విధిని చంపుతుంది. కోపం అనేది విధికి మొదటి శత్రువు. ఇది ఒక విధంగా లేదా మరొక విధంగా బంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
మోషేకు మొదటిసారి కోపం వచ్చినప్పుడు, అతడు ఒకరిని చంపాడు. (నిర్గమకాండము 2:12)
అతడు రెండవసారి కోపంతో, దేవుడు చెక్కి తన వేళ్ళతో వ్రాసిన మౌలిక ఆజ్ఞల పలకలను పగులగొట్టెను, అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను. (నిర్గమకాండము 32:19-20)
అతడు మూడవసారి కోపంగా ఉన్నప్పుడు, అతడు బండతో మాట్లాడకుండా రెండుసార్లు కొట్టాడు మరియు ఆ ప్రక్రియలో తన పరిచర్యను పోగొట్టుకున్నాడు. (సంఖ్యాకాండము 20:11)
కోపం చాలా తీవ్రమైనది, మీరు దానిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది ఇతర ఆత్మలు ప్రవేశించడానికి ద్వారములను తెరుస్తుంది. ఇది మీ చేతుల్లో వేడి బొగ్గును పట్టుకోవడం లాంటిది, మీరు కోపంగా ఉన్న వ్యక్తిపై దానిని విసిరేందుకు వేచి ఉన్నారు, కానీ వాస్తవానికి, మీరు మిమ్మల్ని మీరు కాల్చుకుంటున్నారు.
ధ్యానించుటకు కొన్ని లేఖనాలు
సామెతలు 13:20
సామెతలు 18:24
సామెతలు 17:17
యోహాను 15:12-13
మిమ్మల్ని, మీ ఇంటిని, మీ ఆస్తులను మరియు కుటుంబ సభ్యులను నూనెతో అభిషేకించండి. మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటికి కూడా నూనెతో అభిషేకించండి.
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)
నా జీవితంలోని కోపం యొక్క ఆత్మ నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామంలో శాశ్వతంగా అంతమైపో.
కోపం యొక్క ఆత్మ ద్వారా నా జీవితంలో తెరవబడిన ప్రతి ద్వారము యేసు నామంలో శాశ్వతంగా మూసివేయబడును గాక.
యేసు నామంలో నా కోపంతో కలిగించిన ప్రతి నష్టాన్ని పరిశుద్ధాత్మ బాగు చేయి.
ప్రజలు నన్ను చూసినప్పుడు, (నా గురించి విన్నప్పుడు, నా గురించి ఆలోచించిన్నప్పుడు) వారు తమ హృదయాలలో సంతోషించుదురు. (నిర్గమకాండము 4:14)
నా ప్రతి బంధం నుండి చెడు సంకల్పం మరియు అపార్థం యొక్క ప్రతి ఆత్మ యేసు నామంలో నిర్మూలించబడును గాక.
నేను నా ప్రతి బంధాన్ని యేసు రక్తంతో కప్పుతున్నాను. నా జీవితంలోని ప్రతి బంధం యేసు నామంలో దేవుని అగ్ని స్పర్శను పొందును గాక.
సమాధానకర్తయగు అధిపతి - ప్రభువైన యేసుక్రీస్తు నా ప్రతి బంధాన్ని నియంత్రించును గాక.
పరిశుద్ధాత్మ నా బంధాలన్నింటినీ రూపాంతరము చేయి మరియు నీ రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా ప్రతి బంధాన్ని ఉపయోగించు.
నేను యేసు నామంలో దాగిఉన్న ప్రతి చెడు ఆత్మ బంధాలను పరిత్యజిస్తున్నాను.
నా బంధాలకు వ్యతిరేకంగా వ్రాసిన ప్రతి చెడు వ్రాత యేసు రక్తం ద్వారా పరిశుద్ధ పరచబడును గాక.
నా కలలలో ఆత్మ భార్య/భర్తను పరిచయం చేసిన ప్రతి సముద్రపు మంత్రవిద్య, యేసు నామంలో అగ్నితో కాలిపోవును గాక.
కలలో నా భర్తగా/భార్యగా నటిస్తున్న ప్రతి మంత్రవిద్య యొక్క గూఢచారి, యేసు నామంలో అగ్నితో కాలిపోవును గాక.
నిరాశపరిచేందుకు నా బంధాలతో శారీరకంగా జతచేయబడి ప్రతి మంత్రవిద్య యొక్క గూఢచారి, యేసు నామంలో అగ్ని ద్వారా మరణించు గాక.
Join our WhatsApp Channel
Most Read
● 21 రోజుల ఉపవాసం: వ రోజు #15● మీ లక్ష్యాలను సాధించే శక్తిని పొందుకోండి
● మీ అనుభవాలను వృధా చేయకండి
● అశ్లీలత
● నేటికి కనుగొనగలిగే అరుదైన విషయం
● 21 రోజుల ఉపవాసం: వ రోజు #13
● లోబడే స్థలము
కమెంట్లు