క్రీస్తును ప్రభువుగా విశ్వసించడం మరియు అంగీకరించడం ద్వారా మనం రక్షింపబడినందున, మనం దేవుని మూలముగా పుట్టియున్నాము (1 యోహాను 5:1). అందువల్ల, మనలో దేవుని స్వభావం ఉందని అర్థం. మరియు దేవుని నుండి పుట్టడం ద్వారా, మనకు దేవుని లాంటి స్వభావం యొక్క ప్రేమ ఉంది.అందువలన, కుక్క మొరగడం ఎంత సహజమొ, దేవుని బిడ్డగా ప్రేమించడం అంత సహజం. మీకు అర్ధమైందా!
"... మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది." (రోమీయులకు 5:5) ఇది లోకం యొక్క ప్రేమ కాదు; ఇది దేవుని లాంటి ప్రేమ. 2 తిమోతి 1:7 లో బైబిల్ స్పష్టంగా చెబుతుంది, మనకు ప్రేమ గల ఆత్మ ఇవ్వబడింది.
కాబట్టి, మనం కేవలం మనుషులమే కాదు; మనము "ప్రేమ జీవులం". ప్రేమ మన స్వభావం. ఇది మన "సహజ స్థితి". అందువల్ల, మన స్వభావానికి వ్యక్తీకరణ ఇస్తేనే మనం ఇతరులను స్పష్టంగా ప్రేమించగలుగుతాము. అవును, జీవితంలో, ప్రజలను ప్రేమించడం అంత సులభం కాని అనేక పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు మనల్ని ఎంతగానో బాధపెట్టవచ్చు, అది మన హృదయాల్లోకి లోతుగా వెళ్ళుతుంది. ఏదేమైనప్పటికీ, అన్నింటికీ, ప్రేమించడానికి మరియు సహాయం చేయడానికి దేవుడు మనకు యోగ్యుడు. అందుకే ఆయన తన స్వభావాన్ని మనకు ఇచ్చాడు, మనం ప్రేమించాల్సిన విధంగా ప్రేమించడంలో సహాయపడతాడు.
గమనించండి, ఒక కుక్కపిల్లకి వయోజన కుక్కలాగే మొరిగే సామర్ధ్యం ఉన్నప్పటికీ, కుక్కపిల్ల పుట్టిన వెంటనే మొరాయిస్తుందని మనము ఆశించలేము. అయినప్పటికీ, కుక్కపిల్ల పెరగడం ప్రారంభించినప్పుడు, ఇది ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించడం ప్రారంభిస్తుంది. అదే పంథాలో, మనలో దేవుని యొక్క ప్రేమ స్వభావం ఉన్నప్పటికీ, దానికి మనం ముఖకవళిక ఇవ్వాలి. మనం మరింతగా ఎదిగి, దేవునితో సన్నిహితంగా నడుస్తున్నప్పుడు, మనం దానిని మరింతగా మెరుగుపర్చగలము.
మనకు దేవుని లాంటి ప్రేమ ఉంటే సరిపోదు; దానిని చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది, తద్వారా దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచబడతాడు. నేను మిమల్ని ప్రోత్సహిస్తున్నాను, మీలోని దేవుని ప్రేమ యొక్క స్వభావాన్ని వ్యక్తీకరించడానికి దయచేసి దానిని గుర్తుంచుకోండి. మీరు మీ దేవుని లాంటి ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు ఇతరులు ఆశీర్వదించబడనివ్వండి. మీరు అకస్మాత్తుగా పరిపూర్ణంగా కాలేరు కాని "వెయ్యి మైళ్ళ ప్రయాణం, ఒక అడుగుతో మొదలవుతుంది" అని గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుండే ప్రారంభించండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు.
మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు (యోహాను 13:35). మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జీవితం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించండి.
ప్రార్థన
తండ్రీ, నేను నీ మూలముగా పుట్టినందుకు వందనాలు. నేను నిన్ను మహిమపరుస్తున్నాను ఎందుకంటే నీ ప్రేమ స్వభావాన్ని నాకు ఇచ్చావు. నాలో ఉన్న ఈ దేవుని లాంటి ప్రేమకు నేను అత్యున్నత ముఖకవళిక ఇవ్వగలనని ప్రార్థిస్తున్నాను. నేను తప్పక ఇతరులను ప్రేమించటానికి నాకు సహాయం చేయి, తద్వారా నీ నామము నా ద్వారా గొప్పగా మహిమపరచబడుతుంది. యేసు నామంలో.
Join our WhatsApp Channel
Most Read
● వాగ్దాన దేశములోని బలగాలతో వ్యవహరించడం● 21 రోజుల ఉపవాసం: 1# వ రోజు
● దైవిక క్రమశిక్షణ గల స్వభావం - 2
● 21 రోజుల ఉపవాసం: 9# వ రోజు
● సరైన అన్వేషణను వెంబడించడం
● అభిషేకం యొక్క నంబర్ 1 శత్రువు
● 30 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు