అనుదిన మన్నా
మీరు ప్రార్థిస్తే, ఆయన వింటాడు
Friday, 23rd of April 2021
3
1
2239
Categories :
ప్రార్థన (Prayer)
సాధారణంగా, మీరు వ్యక్తులతో సభాంషించినప్పుడు, ప్రతిఫలంగా మీరు సమాధానం ఆశిస్తారు. కొన్నిసార్లు, మీరు సమాధానాల కోసం పూర్తిగా విశ్వసించని వ్యక్తులతో మీరు అభ్యర్థనలు చేయవచ్చు. అటువంటి వ్యక్తులతో మునుపటి లావాదేవీల, నిరాశలతో, కన్నీళ్లతో, విరిగిన హృదయాలతో వల్ల కావచ్చు.
నిజమే, మానవుడు విఫలం కావచ్చు, కాని దేవుడు ఎప్పుడూ విఫలం కాడు! "దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?" (సంఖ్యాకాండము 23:19) మీరు ప్రార్థన చేసినప్పుడు మీ అభ్యర్థనలకు సమాధానాల కోసం మీరు దేవుణ్ణి విశ్వసించవచ్చు.
దేవుని గొప్ప దాసుడు ఒకసారి ఇలా అన్నాడు, "మన ప్రార్థనలు ఇబ్బందికరంగా ఉండవచ్చు. మన ప్రయత్నాలు బలహీనంగా ఉండవచ్చు. కానీ ప్రార్థన యొక్క శక్తి అది వినేవారిలో ఉంది మరియు చెప్పేవారిలో కాదు కాబట్టి, మన ప్రార్థనలలో తేడా ఉంటుంది."
ప్రజలు చిన్న పిల్లలకు వాగ్దానాలు చేసినప్పుడు, వాగ్దానం చేసినట్లు ఖచ్చితంగా జరుగుతుందని వారు అమాయకంగా ఎలా నమ్ముతారో మనకు తెలుసు. దేవునికి మన ప్రార్థనలో ఇది చాలా దూరం కాదు, ఎందుకంటే ఆయన చిత్తం ప్రకారం మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని ఆయన వాక్యం చెబుతుంది. ఒక చిన్న పిల్లవాడు సిగరెట్లు అడిగితే, తెలివిగల వ్యక్తి అలాంటి వాటికి ఎప్పుడూ సమాధానం ఇవ్వడు. అదే విధంగా, దేవునికి మన ప్రార్థనలు మన జీవితాల ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చేంతవరకు, ఈ చీకటి ప్రపంచంలో మనం వెలుగుగా ప్రకాశింపజేయడానికి, ఆయన అలాంటివి ఆలంకించునని మనకు పూర్తి నమ్మకం ఉంది, మరియు మనం ఆయనను అడిగిన దానిపై సమాధానాలు పొందుకుంటాము(1 యోహాను 5:14,15).
పరిస్థితి ఎలా ఉన్నా, దేవుడు ఇప్పటికీ ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. దేవుడు విన్న మరియు వారి ప్రార్థన అభ్యర్థనలకు సమాధానాలు ఇచ్చిన మనుష్యుల జీవితాలతో బైబిల్ నిండి ఉంది. అలాంటి వారిలో జకర్యా ప్రవక్త ఒకరు. అతను ఒక ప్రత్యేకమైన సవాలును కలిగి ఉన్నాడు, ఇది అతని భార్యతో కలిసి, ఒక బిడ్డకు చాలా కాలం జన్మనివ్వలేకపోయింది, కాని అతను దానిని వదల్లేదు. చివరికి, ఒక నిర్దిష్ట రోజున, దేవదూత కనిపించినప్పుడు, "జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది" (లూకా 1:13) అని చెప్పినప్పుడు అతను తన యాజక విధుల నిర్వర్తిస్తున్నాడు.
అపొస్తలుడైన పేతురు జైలు శిక్ష అనుభవించినప్పుడు మీకు గుర్తుందా? అతని విడుదలపై చర్చలు జరపడానికి వారు ఇతర మార్గాలను కోరి ఉండవచ్చు, కాని పేతురు విడుదల విషయంలో అలౌకికంగా ఏదో జరిగింది. అపొస్తలుల కార్యములు 12:5 ఇలా చెబుతోంది, "పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను".
మీరు ఏమి కోరుకుంటున్నారు - ఉద్యోగం, మంచి వివాహం, పరిచర్యలో విజయం, మంచి ఆరోగ్యం, పిల్లలు? శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చే ప్రభువుకు ప్రార్థించండి. (యాకోబు 1:17 చదవండి) మీ సవాళ్లను ప్రార్థనలో దేవుని వద్దకు తీసుకెళ్లండి, మరియు మీ సమస్య గురించి మీరు దేవునికి చెప్పగలిగితే, ఆయన మీ కోసం ఖచ్చితంగా కార్యం చేస్తాడు.
ప్రార్థన
వందనాలు తండ్రి, నేను ప్రార్థన చేసినప్పుడల్ల మీరు నా మనవి ఆలకిస్తారు. నా హృదయం ఎంతో ఆనందిస్తుంది, ఎందుకంటే నేను ప్రార్థనలకు సమాధానమిచ్చే దేవునికి సేవ చేస్తున్నాను. నేను నా పనులని నీకు సమర్పిస్తున్నాను. ఓ దేవా, నా విశ్వాసం మరి దేని మీద కాదు, నీలో మాత్రమే ఉంది. యేసు శక్తివంతమైన నామంలో. ఆమెన్
Join our WhatsApp Channel
Most Read
● అద్భుతాలలో పని చేయుట: కీ#2● యుద్ధం కోసం శిక్షణ - II
● మీ హృదయాన్ని పరిశీలించండి
● కార్యాలయంలో ఒక ప్రసిద్ధ వ్యక్తి - II
● 11 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● మన వెనుక ఉన్న వంతెనలను కాల్చడం
● పందెంలో గెలవడానికి రెండు పి(P)లు
కమెంట్లు