అనుదిన మన్నా
ఏడంతల ఆశీర్వాదములు (దీవెనలు)
Friday, 2nd of December 2022
5
1
2344
Categories :
ఆశీర్వాదం (Blessing)
నిన్ను గొప్ప జనముగా చేసి
నిన్ను ఆశీర్వదించి
నీ నామ మును గొప్ప చేయుదును,
నీవు ఆశీర్వాదముగా నుందువు.
నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను;
నిన్ను దూషించువాని శపించెదను;
భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడును (ఆదికాండము 12:2-3)
అబ్రాము ఇంకా కల్దీయుల ఊర్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన ఏడు వాగ్దానాలు; అతడు తన దేశమును, అతని కుటుంబాన్ని, అతని అనువయిన ప్రదేశం విడిచిపెట్టి, హారాను మార్గంలో కనాను వెళ్లాడు:
1) నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను
2) నేను నిన్ను ఆశీర్వదిస్తాను
యాంప్లిఫైడ్ బైబిల్ ఇలా సెలవిస్తుంది, "నేను నీకు విస్తారమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను." అబ్రహము సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు. నిజానికి, ఆదికాండము 24:1 అబ్రహము సమస్త విధాలుగా ఆశీర్వదించబడ్డాడని సెలవిస్తుంది.
3) నేను నీ నామమును గొప్ప చేయుదును,
యాంప్లిఫైడ్ బైబిలు ఆదికాండము 12:2 లో, "నేను నీ నామమును గొప్పగా మరియు విశిష్టంగా చేయుదును."
అబ్రహము వెళ్ళిన ప్రతిచోటా, ప్రజలు అతన్ని గురించి తెలుసుకున్నారు. అతని కీర్తి అతనికి ముందుంది మరియు అతనిని వెంబడించింది. అతడు శక్తివంతమైన రాజు. అతడు దేవుణ్ణి నుండి దయను పొందుకున్నాడు!
4) నీవు ఆశీర్వాదముగా నుందువు
"మనము ఆశీర్వాదంగా ఉండటానికి ఆశీర్వదించబడ్డాము" అనే పదం ఇక్కడ నుండి వచ్చింది. మనం తగినంత కంటే ఎక్కువగా ఉండాలని దేవుడు కోరుకునే ప్రధాన కారణాలలో ఒకటి, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మరియు సహాయకరంగా ఉండడానికి.
క్రైస్తవులుగా, మీ ప్రయోజనం కోసం మాత్రమే చూడండి అని చెప్పే లోక పద్దతిని మనము అనుసరించకూడదు. బదులుగా, మనం దేవుని వనరులను ఉద్దేశించిన వాటి కోసం ఉపయోగించాలి: మన చుట్టూ ఉన్న లోకానికి దేవుని మహిమను చూపించాలి.
మనం దాతృత్వముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవసరమైన వారికి మనం ఇవ్వగలిగేలా మనం ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటున్నారు. మన ఆశీర్వాదాలను మనం పంచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు.
5) నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను
ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి సహాయం చేసినప్పుడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మీ దయ వారిపై రుద్దబడుతుంది. మీ జీవితాన్ని సానుకూల రీతిలో తాకిన ప్రతి వ్యక్తి దేవుని నుండి దయను పొందుతాడు; మనం ఎంత ధన్యులం.
6) నిన్ను దూషించువాని శపించెదను
మిమ్మల్ని దూషించు వారిని దేవుడు ఆశీర్వదించడు. ఆయన ఇలా అన్నాడు, "నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును." ద్వితీయోపదేశకాండము 28:7 ఇలా సెలవిస్తుంది, "నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీ మీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుట నుండి పారిపోవుదురు"
7) భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడును
మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, "నేను సమస్త ప్రజలను ఎలా ఆశీర్వదించగలను?"
మీరు దేవుని రాజ్యంలో సేవ చేసినప్పుడు, మీరు దేవుని పనికై ఇచ్చినప్పుడు, మీరు సమస్త లోకముకు సువార్తను పంపడంలో కీలక పాత్ర పోషిస్తారు.
అబ్రాహాముతో పాటు మనం ఆశీర్వదించబడ్డామని గలతీయులకు 3:9లో దేవుడు సెలవిచ్చాడు. అంటే ఆయనకున్న ప్రతి ఆశీర్వాదం, మనం కూడా పొందవచ్చు.
ఒప్పుకోలు
క్రీస్తు లోనికి బాప్తిస్మము పొందిన నేను క్రీస్తును ధరించుకొనియున్నాను. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసు క్రీస్తు నందు మేమందరము ఏకముగా ఉన్నాము. నేను క్రీస్తు సంబంధుడనైతే (మూలభాషలో క్రీస్తువారైతే) ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై యుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నాను. (గలతీయులకు 3:27-29). అబ్రాహాము యొక్క వాగ్దానాలు యేసు నామంలో నావియై ఉన్నాయి. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● ఆ వాక్యన్ని పొందుకునట● యెహోవాకు మొఱ్ఱపెట్టము
● తలుపులను మూయండి
● ఉత్తమము మంచి వాటికి శత్రువు
● లొపలి గది
● అంతిమ రహస్యము
● కలను చంపువారు
కమెంట్లు