దేశం మరియు నగరం (పట్టణం)
మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు. (1 తిమోతికి 2:1-4)
మీరు మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచి మరియు అంగీకారయోగ్యమైన కార్యమును చేసినప్పుడు, మీరు ప్రభువుకు సన్నిహిత స్నేహితులు. దీని గుంరించి నాకు ఎలా తెలుసు? "నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు. (యోహాను 15:14)
అలాగే బైబిలు మనకు ఇలా ఆజ్ఞాపిస్తుంది, "నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షమము మరియు శాంతి కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును." (యిర్మీయా 29:7) మీరు నివసించే నగరం మరియు దేశం కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు మరియు మీ ప్రియమైనవారు కూడా క్షేమంగా ఉండి సమృద్ధి చెందుతారు.
పశ్చాత్తాపం:
మీరు మీ దేశం లేదా నగరం గురించి చెడుగా మాట్లాడి ఉంటే లేదా మాట్లాడే అలవాటు ఉంటే, అయితే మీరు క్షమించమని ప్రభువును అడగాలి. (దీని మీద కొంత సమయం వెచ్చించండి)
ధ్యానించుటకు కొన్ని లేఖనాలు
కీర్తనలు 33:12
యెషయా 2:4
ప్రకటన 22:2
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)
తండ్రీ, దేశాన్ని నీ మార్గంలో మరియు నీ మాట ప్రకారం నడిపించే నిర్ణయాలు తీసుకునేలా (మీ దేశం పేరును పేర్కొనండి) భారతదేశ నాయకుల హృదయాలను మరియు మనస్సులను నిర్దేశించమని మేము నిన్ను వేడుకుంటున్నాము. యేసు నామంలో.
తండ్రీ, నీ రాజ్యము వచ్చుగాక మరియు నీ చిత్తము భారతదేశ దేశంలో జరుగును గాక. యేసు నామంలో.
తండ్రీ, భారత దేశాన్ని సువార్తతో మేల్కొలపు. యేసు నామంలో. (యోవేలు 3:12)
యేసు నామంలో. భారతదేశము ప్రభువు స్వరాన్ని వినును గాక! (యెషయా 1:2)
తండ్రి, భారతదేశాన్ని అవినీతి బానిసత్వం నుండి దేవుని ప్రజల మహిమాన్వితమైన స్వేచ్ఛలోకి విడిపించు. (రోమీయులకు 8:21)
తండ్రీ, యేసు నామంలో నీ గురించి సాక్ష్యమివ్వడానికి నీ సత్యస్వరూపియైన ఆత్మును భారతదేశానికి పంపు. (యోహాను 15:26)
తండ్రీ, భారత దేశంపై నీ ఆత్మను కుమ్మరించు మరియు భారతదేశం యొక్క పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. (యోహాను 16:8)
తండ్రీ, భారతదేశం పశ్చాత్తాపపడేలా చేయి మరియు వారు విగ్రహములను విడిచిపెట్టి మరియు మానవడు చేయు హేయ కృత్యము లన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొనేలా చేయి. (యెహెజ్కేలు 14:6)
తండ్రీ, నీ ప్రజలను భారతదేశమంతటా పైకి లేపుము. యేసు నామంలో. (సంఖ్యాకాండము 23:24)
తండ్రీ, భారతదేశం నుండి ప్రపంచంలోని అన్ని దేశాలకు నీ రాయబారులను పంపుము. (యిర్మీయా 49:14)
తండ్రీ, భారతదేశంలోని ప్రతి మోకాలు వంగునట్లు మరియు ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోనును గాక! (ఫిలిప్పీయులకు 2:10-11)
తండ్రీ, సముద్రము జలములతో నిండియున్నట్టు భారతదేశం యెహోవా మాహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును గాక. (హబక్కూకు 2:14)
తండ్రీ, భారతదేశంలోని నీ ప్రజల ద్వారా సమస్త దేశాలు దీవించబడును గాక. యేసు నామంలో. (గలతీయులకు 3:8)
ఇదే ప్రార్థన అంశములను పునరావృతం చేయండి, ఇప్పుడు దేశానికి బదులుగా మీ నగరం పేరును పేర్కొనండి.
ఈ ప్రార్థనలకు జవాబులు ఇచ్చినందుకు ప్రభువును స్తుతించి, వందనాలు చెప్పండి.
శుభాకాంక్షలు
మీ కోసం మరియు నా కోసం పరిపూర్ణుడు ఈ అసంపూర్ణ లోకంలోకి వచ్చాడు.
ఈ విశిష్టమైన సమయానికి ఆయనే కారణం
నా కుటుంబం మరియు నా నుండి మీ అందరికీ దీవించబడిన మరియు ఆత్మతో నిండిన క్రిస్మస్ 2021 శుభాకాంక్షలు.
హాయి లోకమా ప్రభు వచ్చెన్ అంగీకరించుమీ.... (పాడండి)
(జాయ్ టూ ద వరల్డ్)
Join our WhatsApp Channel
Most Read
● గొప్ప ప్రతిఫలము ఇచ్చువాడు● 21 రోజుల ఉపవాసం: 11# వ రోజు
● మీ నిజమైన విలువను కనుగొనండి
● Day 13: 40 Days Fasting & Prayer
● 38 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీరు దేవుని తదుపరి రక్షకుడు కావచ్చు
● అపకీర్తి గల పాపానికి ఆశ్చర్యమైన కృప అవసరం
కమెంట్లు