అనుదిన మన్నా
త్వరగా విధేయత చూపడం
Thursday, 28th of April 2022
3
0
937
Categories :
విధేయత (Obedience)
బ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులో నున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వ దించెదను; ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.
ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను. ఇస్సాకు గెరారులో నివసించెను. (ఆదికాండము 26:1-6)
ఇస్సాకు కాలంలో ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చింది. పుష్కలంగా ఉన్న ఐగుప్తుకు వెళ్లడమే సరైన పని అని అప్పుడు అనిపించింది. కానీ ప్రభువు ఇస్సాకును వెళ్లవద్దని ఆజ్ఞాపించాడు మరియు బదులుగా అతడు తన తండ్రి అబ్రహంతో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు. దేవుడు తనతో నిజంగా మాట్లాడుతున్నాడని నమ్మడం ఇస్సాకుకు కష్టంగా ఉంది, కానీ అతడు చేశాడు.
అతడు దేవుని వాక్యానికి లోబడి, దేవుడు చెప్పిన చోటే ఉండిపోయాడు. కరువు మధ్యలో అతని విధేయత ఫలితంగా, అతడు నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు!
ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. (ఆదికాండము 26:12)
కానా వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయింది. మరియ దాసులతో, "ఆయన (యేసు) చెప్పింది చేయుడి" అని చెప్పింది. దాసులకు ఇది చాలా కష్టమైన విషయం, కానీ వారు త్వరగా విధేయత చూపారు. యేసు ప్రభువు మాటను పాటించడంలో వారు ఆలస్యం చేసినట్లయితే, వివాహ విందులో గందరగోళం ఏర్పడి ఉండేది.
మునుపటి ద్రాక్షారసం కంటే తరువాతి ద్రాక్షారసం మంచిగా ఉన్నప్పుడు వారి విధేయతకు ప్రతిఫలం లభించింది. ఆలస్యమైన విధేయత అవిధేయత. నేను క్రిత్మకంగా నేర్చుకున్నట్లుగా దేవుని వాక్యానికి త్వరితంగా విధేయత చూపడం వల్ల మీకు చాలా హృదయ వేదనలు మరియు కష్టాలు దూరమవుతాయి.

ప్రార్థన
తండ్రీ, వెంటనే నీకు విధేయత చూపే మరియు నీ వాక్యం పట్ల సమర్పణగా ఉండే హృదయాన్ని నాకు ప్రసాదించు, ఎందుకంటే త్యాగం కంటే విధేయత ఉత్తమం. యేసు నామంలో. ఆమెన్.
Most Read
● ఆరాధనను జీవన విధానంగా మార్చుకోవడం● సాధారణ పాత్రల ద్వారా గొప్ప కార్యము
● దేవుడు మీ శరీరం గురించి శ్రద్ధ వహిస్తాడా?
● మీ సౌలభ్యము నుండి బయటపడండి
● కలవరము యొక్క ప్రమాదాలు
● విశ్వాసం ద్వారా కృప పొందడం
● 17 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
కమెంట్లు