english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దేవుడు మీ శరీరం గురించి శ్రద్ధ వహిస్తాడా?
అనుదిన మన్నా

దేవుడు మీ శరీరం గురించి శ్రద్ధ వహిస్తాడా?

Friday, 19th of August 2022
3 0 1539
Categories : సాధకము - (Exercise)
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. (1 థెస్సలొనీకయులకు 5:23)

దేవుడు మనలను ఆత్మ, జీవము మరియు శరీరముగా చేశాడు. ఈ మూడు క్రైస్తవులకు సమానంగా ముఖ్యమైనవి. ఆత్మతో నింపబడిన క్రైస్తవులు తరచూ ఆత్మ మరియు జీవము యొక్క కోణాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, కాని శరీరాన్ని ఎలాగైనా కాపాడుకోవడం వెనుక సీటుకు పంపబడుతుంది.

అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు "దైవభక్తి (నీతి) వైపు నీకు నీవు శిక్షణ (సాధకము) ఇచ్చుకో, [మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచుకోండి]. శారీరక శిక్షణ కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును (కొద్దిగా ఉపయోగపడుతుంది) (1 తిమోతి 4:7-8) రెండు రకాల శిక్షణ ముఖ్యమైనవి - శారీరక మరియు ఆధ్యాత్మిక శిక్షణ. చాలామంది ఈ సత్యాన్ని చూడలేకపోతున్నారు.

కొంత మంది ఆధ్యాత్మిక అంశంపై పూర్తిగా దృష్టి సారించి వారి భౌతిక శరీరాలను నిర్లక్ష్యం చేస్తారు. మరోవైపు, కొందరు తమ భౌతిక శరీరాల రూపం మరియు ఆకారంపై ఎక్కువ దృష్టి పెడతారు, కానీ వారు ఆధ్యాత్మిక పెరుగుదల మరియు పరిపక్వతను విస్మరిస్తారు. తూగేటట్టు (సంతులనం) ఉండాలి.

వ్యాయామం (సాధకము) చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా మరియు క్రైస్తవులు దీన్ని చేయవచ్చా? అవును!

1. మన శరీరాలను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా దేవుని మహిమపరుస్తాము.
1 కొరింథీయులకు 6:19-20 మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

మన శరీరానికి మనం యజమాని కానందున మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనము కేవలము దానిని నిర్వహిస్తున్నాము. బైబిల్లో మేనేజర్ అనే పదముకు అర్థం పరిచారకుడు. నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఆధ్యాత్మిక పరిచారకత్వ సమస్య.

2. వ్యాయామం మన శరీరాలను చాలా వరకు క్రమశిక్షణలో సహాయపడుతుంది
గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు సువార్తను ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో [పరీక్షలో నిలబడకుండా, ఆమోదించబడకుండా మరియు అనుకరణగ తిరస్కరించబడుతనేమో) అని నా శరీరమును [బాక్సర్ లాగా] నలగగొట్టి, దానిని (దానిని కఠినంగా నిర్వహిస్తున్నాను, వేదనతో క్రమశిక్షణగా) లోపరచుకొనుచున్నాను. (1 కొరింథీయులు 9:27)

3. దేవుని చిత్తాన్ని చేయటానికి వ్యాయామం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని(శరీర) విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. (3 యోహాను 2). వ్యాయామం ఒత్తిడి మరియు అలసటను చాలా వరకు తగ్గిస్తుంది.

మొత్తానికి, వ్యాయామంలో ఇతరులు మనలను గమనించి ప్రశంసిస్తారని మన క్రైస్తవుల లక్ష్యం ఉండకూడదు. బదులుగా, వ్యాయామం యొక్క లక్ష్యం మన శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి ఈ లోకములో చేయమని దేవుడు మనలను పిలిచినా పనిని చేయటానికి ఎక్కువ శారీరక శక్తిని కలిగి ఉంటాము.
ప్రార్థన
తండ్రీ, నా శరీరానికి ధన్యవాదాలు. ప్రభువా, నా శరీరాన్ని బాగు చేయి. ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న సత్యాన్ని స్వీకరించడానికి మరియు సాధనం చేయడానికి నాకు సహాయం చేయి. యేసు నామంలో. ఆమెన్

Join our WhatsApp Channel


Most Read
● దైవ క్రమము -1
● ఆయనకు సమస్తము చెప్పుడి
● దేవునికి మీ పగను ఇవ్వండి
● వంతెనలు నిర్మించడం, అడ్డంకులు కాదు
● దేవుని యొక్క 7 ఆత్మలు: యెహోవా యెడల భయభక్తులు గల ఆత్మ
● విశ్వాసంలో దృఢంగా నిలబడడం
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 2
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్